రాశిఫలాలు (దిన ఫలాలు) : 11.03.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: ఫాల్గుణ, వారం : మంగళవారం, తిథి : శు. ద్వాదశి, నక్షత్రం : ఆశ్రేష
మేష రాశి వారికి ఈ రోజు శుక్రుడు మిశ్రమ ఫలితాలనిస్తాడు. నూతన పెట్టుబడులు, వ్యాపారాలకు అవకాశం ఉంది. సమస్యలను పరిష్కరించుటకు రాజీపడుట మంచిది. వాస్తవదృష్టితో పరిశీలిస్తే సమస్యలకు పరిష్కారం వస్తుంది.
వృషభ రాశి వారికి ఈ రోజు అప్పుల నుండి విముక్తి, ఆర్థికంగా స్థిరత్వం. మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. మీ కీర్తి పెరుగుతుంది. భూమి కొనుగోలు చేసే ప్రయత్నానికి శ్రీకారం చుడతారు. ఇల్లు కొనడానికి అవకాశాలు మెరుగవుతాయి.
మిథున రాశి వారికి ఈ రోజు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ధ్యాన యోగం ద్వారా ఉపశమనం పొందండి.
ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో మీ హోదా మరియు గౌరవం పెరుగుతాయి. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహ రాశి వారికి ఈ రోజు పరీక్షలలో విజయం సాధిస్తారు. స్వయం వృత్తుల వారికి అనేక రకాలుగా లాభాలు ప్రోత్సాహకాలు వస్తాయి. మీ స్నేహితులు, సలహాదారులు మరియు పెద్దలు మీకు విలువ ఇచ్చి మంచిగా వ్యవహరిస్తారు.
కన్య రాశి వారికి ఈ రోజు ప్రయాణంలో సమస్యలు, ఖర్చులు అధికమవుతాయి. మీరు మీ జీవితభాగస్వామికి, పిల్లలకు సమయం కేటాయించండి. ఎదుటివారితో మాట్లాడే తీరు మెరుగుపరచుకోండి.
తులా రాశి వారికి ఈ రోజు ఆదాయవనరులు పెరుగుతాయి. ఇతర దేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కలసివస్తాయి. పిల్లల చదువుల విషయంలోనూ ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది.
వృశ్చిక రాశి వారికి ఈ రోజు తాత్కాలికంగా తక్కువ సమయంలో లాభాలు వచ్చే వ్యాపారాలు చేస్తారు. స్టాక్ మార్కెట్, షేర్ల వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరిస్తూ, ధనం వెచ్చించండి.
ధనుస్సు రాశి వారికి ఈ రోజు విద్యా విషయాలలో శ్రద్ధ అవసరం. చదువుల్లో క్రమేపీ రాణిస్తారు. శోభాయమానంగా, వాక్చాతుర్యంతో ఆధునిక సమాచారం, నవీన విషయ పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకుంటారు.
మకర రాశి వారికి ఈ రోజు గృహమున సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. జీవనం ఆనందమయంగా ఉంటుంది. దూరప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. విదేశీప్రయాణాలు కలసివస్తాయి. స్నేహితుల తోడ్పాటు మీకు ఉంటుంది.
ఈ రాశి వారికి ఈ రోజు గృహోపకరణాలు, అలంకరణ వస్తు వులు, రత్నాలు మరియు ఆభరణాల కొనుగోలు కోసం మీ డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. సంగీతం పట్ల అభిరుచి ఆసక్తి పెంచుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
మీన రాశి వారికి ఈ రోజు స్వీయనియంత్రణ విధించుకుని ఇతరులతో సత్సంబంధాలు మెరుగుపరచుకుంటారు. వివాహ విషయాలలో భావోద్వేగానికి గురికాకండి. ఈ రాశిలోని విద్యార్థులు ఫార్మసీ, వైద్యవిద్యకు సంబంధించిన చదువులలో ప్రావీణ్యత గడిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్