Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి విదేశీ అవకాశాలు, ధన లాభం.. అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది-today rasi phalalu mesha rasi to meena rasi february 24th monday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి విదేశీ అవకాశాలు, ధన లాభం.. అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి విదేశీ అవకాశాలు, ధన లాభం.. అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 24.02.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik )

రాశిఫలాలు (దిన ఫలాలు) : 24.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మాఘ, వారం : సోమవారం, తిథి : కృ. ఏకాదశి, నక్షత్రం : పూర్వాషాడ

మేష రాశి

ఎంతో పని ఉన్నప్పటికీ ఉత్సాహం మాత్రం ఉండదు. పాత బంగారాన్ని మార్చాలని ఆలోచనలు జరుపుతారు. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు. వాళ్లకు విలువైన వస్తువులు, వస్త్రాలు బహుమతులుగా ఇస్తారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రయోజనాలని అందుకుంటారు. యజ్ఞ భస్మంతో శివ అర్చన చేసి ఆ భస్మంని బొట్టుగా ధరించండి.. పోరాటంలో పాల్గొన్న ఆలోచనలు కలుగుతాయి.

వృషభ రాశి

సహోదర సహోదరీ వర్గంతో సఖ్యతగా మెలగాలి ఆలోచనలు కలుగుతాయి. వారి ప్రవర్తన మాత్రం కాస్త దురుసుగా ఉంటుంది. కుటుంబ పరువు మర్యాదలను చెడగొట్టడం ఇష్టం లేక ఎంతో ఓర్పుతో సహనంతో మీరు వారిని భరిస్తుంటారు. యజ్ఞ భస్మంతో శివ అర్చన చేసి ఆ భస్మంని బొట్టుగా ధరించండి. ఉద్యోగంలో ఉన్నత హెూదా కోసం చేసే ప్రయత్నాలు రికమండేషన్ కలిసొస్తాయి.

మిధున రాశి

పనులు ఆలస్యంగా నెరవేరుతాయి కానీ వాటి ద్వారా మీకు ఏ నష్టం వాటిల్లదు. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు ముడి పడతాయి. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉంటాయి. ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. పిల్లల భవిష్యత్తు గురించి ఎంతగానో ఆలోచిస్తారు. తెలిసిన వాళ్ళ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు.

కర్కాటక రాశి

కొత్త కార్యక్రమాలు నూతన ఉత్సాహంతో ప్రారంభించ గలుగుతారు. సంగీత నృత్య కళల పట్ల ఆకర్షితులవుతారు నేర్చుకోవాలని ఆలోచనలు నెరవేరుతాయి. ఉద్యోగరీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. హనుమాన్ వత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. కొంతమందితో ఉన్న శత్రుత్వం కారణం చేత కార్యాలయంలో మరింత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.

సింహ రాశి

సహరాదర సహోదరీ వర్గం అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉన్నది. స్త్రీ సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. క్రమశిక్షణ లోపిస్తుంది అన్న విషయాన్ని గ్రహించి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. పూజల్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. కళా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులపుతారు మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు స్నేహానికి ఎదుగుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కన్య రాశి

దూరపు ప్రయాణం శుభకార్యాల నిమిత్తం చేసే విధంగా ఉంటుంది. మంచి శుభవార్త వినగలుగుతారు. విదేశీ అవకాశాలు ప్రయాణాలు అనుకూలిస్తాయి. కిందిస్థాయి ఉద్యోగస్తులతో సతమతం అవటం వాళ్ళ పనులు చేయకపోవడం మీకు తలనొప్పిగా పరిణమిస్తుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతన మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది.

తుల రాశి

రెన్యూవల్ కోసం దరఖాస్తు దాఖలు చేస్తారు. విదేశాలలో ఉన్న వారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలసి వస్తాయి. వైద్య విద్య పట్ల మక్కువ చూపిస్తారు. రహస్య మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహన ప్రయాణాల్లో భద్రత వహించండి. పూజల్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. ఎదుటివారి నిర్లక్ష్క్ష్యం మీకు ప్రమాదానికి కారణం అవ్వొచ్చు. అక్కరలేని విందు వినోదాల్లో పాల్గొనవద్దు.

వృశ్చిక రాశి

ఆర్థిక పురోభివృద్ధిని సాధించగలుగుతారు. బహుముఖంగా ప్రజ్ఞాపాటవాలు కనబరుస్తారు. వృత్తి, ఉద్యోగాలపరంగా మీ స్థాయి పెంపొందుతుంది. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అవసరం. ప్రత్యర్థి వర్గం చేస్తున్న. కుట్రలను భగ్నం చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాలు, రాజకీయ పరిచయాలు లాభిస్తాయి. సరస్వతి దేవి శ్లోకం చదవండి. కష్టమైన కార్యక్రమాలను కూడా క్రమంగా సానుకూల పరచుకోగలుగుతారు. ఉపయుక్తమైన విషయాలు అని భావించిన ప్రతి వ్యవహారాలను ఓర్పు నేర్పు కనబరుస్తారు.

ధనస్సు రాశి

చెవి, ముక్కు గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఋణాలను చాలా వరకు తీరుస్తారు. తనఖా వస్తువులు విడిపిస్తారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత విషయంలో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. నిర్మోహమాటం వైఖరి కనబరుస్తారు. మీడియా వలన బాధపడతారు. మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. శుభకార్య చర్చలు సానుకూల పడతాయి.

మకర రాశి

రక్త సంబంధీకులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార బాటలో: ఉంటాయి. ఆదాయాన్ని పెంపొందించుకునే అన్ని మార్గాలను సమర్థవంతంగా చేజిక్కించుకొని గలుగుతారు. కారణం లేని చికాకులు వేధిస్తాయి. మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపుతారు. సౌర కంకణాన్ని ధరించండి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు గాను పరిష్కార మార్గాలు లభిస్తాయి. సహోదర, సహోదరీ వర్గంతో విభేదాలు వచ్చే సూచనలున్నాయి.

కుంభ రాశి

జీవిత భాగస్వామి సలహాలను, సూచనలను ఎక్కువగా పాటిస్తారు. మిత్ర వర్గం వలస బాధపడతారు. జమా ఖర్చులను సరిచూసుకుంటూ. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు అందుకు తగిన విధంగా ఉండవు. అయినప్పటికీ ఉత్సాహవంతంగా కార్యక్రమాలను సానుకూల పరచుకోవడానికి గాను ఓర్పును కనబరుస్తారు.

మీన రాశి

కొత్త పరిచయాల ద్వారా పాత సమస్యలే కొత్త కోణంలో తారసపడతాయి. సహనానికి పరీక్షలు ఎదురౌతాయి, ఆర్ధిక స్థితి గతులలో చెప్పుకోదగిన ఇబ్బందులేవీ ఏర్పడవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి గాను నూతన ప్రక్రియను అవలంబిస్తారు. అరటి నార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.