Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది.. గులాబీ, పసుపు అదృష్ట రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి-today rasi phalalu mesha rasi to meena rasi february 20th thursday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది.. గులాబీ, పసుపు అదృష్ట రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది.. గులాబీ, పసుపు అదృష్ట రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి

HT Telugu Desk HT Telugu
Published Feb 20, 2025 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.02.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (freepik)

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 20.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మాఘ, వారం : గురువారం, తిథి : కృ. సప్తమి, నక్షత్రం : విశాఖ

మేష రాశి

కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే సంతృప్తినిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. వ్యతిరేక పరిస్థితులను సానుకూలపరచుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు, కళారంగం వారికి ఆహ్వానాలు. ధనవ్యయం. గులాబీ, ఎరువు రంగులు, పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.

వృషభ రాశి

ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు కలసిరావు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగినా చివరిలో స్వల్ప లాభాలు గడిస్తారు. ఇష్టం లేకున్నా ఉద్యోగాలలో మార్పులు తప్పవు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి. వాహనయోగం, స్థిరాస్తివృద్ధి. శుభవార్తలు. నీలం, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి

మిధున రాశి

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు, కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. వివాహయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో మీ అంచనాలు. నిజమవుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాల యత్నాలు సఫలం, కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. నేరేడు, ఆకుపచ్చ రంగులు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

అనుకున్న విధంగా సమయానికి డబ్బు అందుతుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు. పారిశ్రామిక వర్గాలకు సంస్థల ఏర్పాటులో వివాదాలు పరిష్కారం, ఉద్యోగాలలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. గులాబీ, లేత ఎరుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.

సింహ రాశి

చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగ్గా ఉంటుంది. ఒక ప్రకటన విద్యార్థులను సంతోషపరుస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ వ్యక్తులు ఊహించని రీతిలో సహకరిస్తారు. భూములు, వాహనాల కొనుగోలు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం నుంచి బయటపడతారు. గులాబీ, నీలం రంగులు, సూర్యారాధన మంచిది.

కన్య రాశి

నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత. ఉత్సాహాన్నిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వాహనాలు, భూముల కొనుగోలు, విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత ప్రోత్సాహకరం. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు, వ్యాపారాలల్లో పురోగతి, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు గుర్తింపు. ఎరుపు, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

తుల రాశి

ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంత కాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి గట్టెక్కుతారు. రాజకీయ వర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. ఆకుపచ్చ ఎరుపు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహకరం. నిరుద్యోగులకు కాస్త అనుకూలత. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు. వ్యాపారాలు ఆశించిన విధంగా పుంజుకుంటాయి. వస్తులాభాలు. ఉద్యోగాలలో కొత్త హోదాలు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. గులాబీ, పసుపు రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.

ధనుస్సు రాశి

ఆర్థిక లావాదేవీలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగయత్నాలు కాస్త అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి వస్తులాభాలు. ఆశ్చర్యకరమైన ఆహ్వానాలు, స్థిరాస్తి కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గే సూచనలు. రాజకీయవర్గాల యత్నాలు ఫలిస్తాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.

మకర రాశి

ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు, సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రాజకీయ వర్గాలకు వ్యవహారాలలో విజయం. పసుపు, నేరేడు రంగులు, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

కుంభ రాశి

ఆర్థిక విషయాలు క్రమేపీ అనుకూలించి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగులకు నూతనోత్సాహం. ఇంటి నిర్మాణాలలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి పారిశ్రామిక వర్గాలకు సంస్థలో ఏర్పాటులో అనుకూలత. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు నృసింహస్తోత్రాలు పఠించండి.

మీన రాశి

కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. పాతబాకీలు కొన్ని వసూలై అవసరాలు తీరతాయి. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. వాహన, గృహయోగాలు, వ్యాపారాలలో లాభాలు, ఉద్యోగాలలో పైస్థాయి నుంచి సంతోషకరమైన వార్తలు, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఎరుపు, పసుపు రంగులు, కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk

Whats_app_banner