Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారు వివాహాది శుభకార్యాలలో ఉత్సాహంగా ఉంటారు.. ఉద్యోగ, వివాహసిద్ధితో పాటు ఎన్నో
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 19.02.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 19.02.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : బుధవారం, తిథి : కృ. సప్తమి, నక్షత్రం : స్వాతి
మేష రాశి
పలుకుబడి ఉన్నవారితో పరి చయాలు ఏర్పరచుకొంటారు.అవకాశములు కలసి వస్తాయి. ఆర్థిక, ఆరోగ్యాలు అనుకూలం. ఒక్కొక్క సారి ఒంటరితనపు భావనలు పొందు సూచనలు ఉన్నాయి.ఉద్యోగ, వివాహసిద్ధివంటివి ఏర్పడగలవు. సంతానంతో అంతర్గత పోరుతనాలు వుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రయోజనాలను ఏర్పరచుకోగలరు.
వృషభ రాశి
గ్రహసంచారాలు మిశ్రమంగా ఉన్నాయి. ఊహించుకొన్న పనులను పూర్తి చేసుకుంటారు. అధికారులు, పెద్దలువంటివారు సహకరించగలరు. బంధుమిత్రులచే ఒత్తిడులు ఉంటాయి. ఆక స్మిక ఖర్చులు, ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు టార్గెట్ విధానాల్ని పాటించుకోవాలి.
మిథున రాశి
కార్యాచరణకు పెట్టలేని ఆలోచనలు చేసుకొంటారు. కుటుం బంలో చిన్నతరహా విందులు నిర్వహిస్తారు. ఖర్చు లెక్కువగా ఉంటున్నా ప్రయోజనాలు పొందుతారు. యంత్ర, వాహన ఉపయోగాల్లో జాగ్రత్తలు అవసరం. నూతన వ్యాపార వ్యవహారాలకు శ్రీకారంచుట్టగలరు. గృహ, భూ వసతులకై చేయు యత్నాలు అనుకూలి స్తాయి. రెన్యువల్స్, ఎగ్రిమెంట్స్ పూర్తిచేసుకొంటారు.
కర్కాటక రాశి
ఆర్థికంగా సామాన్య స్థితులు ఉన్నా రావలసినవి వాయిదాపడతాయి. ప్లానింగ్లోని పనులకు దూరంగా ఉండండి. ఇతరులచే సహకార ములు ఇచ్చిపుచ్చుకొంటారు. వృత్తి, ఉద్యోగ పూర్వా ర్జితాలు కొన్ని విడుదలవ్వగలవు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు చేయు యత్నాలు ఉపకరించగలవు.
సింహ రాశి
నూతన కార్య క్రమాల్ని చేపట్టుకొని పూర్తిచేసుకుంటారు. ఖర్చులు ఒక్కొక్కటిగా పెరుగు సూచనలు కలవు. ఇంటా-బయటా ఒత్తిడిని కలిగించు సమస్యలను ఎదుర్కో వలసిరావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు వ్యాసంగా లకు కాలహరణములు ఏర్పరచుకోకుండా సాగాలి.
కన్య రాశి
ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబంలో అవగాహనలు పెరిగి పరస్పర సహకారాలు ఏర్పరచు కొంటారు. భూ, గృహ వసతులకై చేయు యత్నాలు ఉపకరించగలవు. ప్రభుత్వతరహా పనులను చేపట్టు టకు వీలైన సమయం. నూతన వ్యాపార వ్యవహార ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.
తుల రాశి
చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతున్నా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ సమస్యలకు పరిష్కారం పొందుతారు. సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగగలవు. వ్యక్తిగతమయిన విమర్శలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించుకోగలరు. అనారోగ్యసమస్యలు చిన్నతరహా చికాకుపరచగలవు. ముఖ్యమైన వ్యవహారములపై సంప్రదింపులు చేయ గలరు.
వృశ్చిక రాశి
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేటట్లు జాగ్రత్తపడండి. ముఖ్యమయిన విషయా లపై సంప్రదింపులు జరిపినా సరైన సమాధానమును రాబట్టుకోలేకపోతారు. విద్యార్థులు పట్టుదలలు చూప గలిగితే మంచి వ్యాసంగాలు ఏర్పడగలవు.
ధనుస్సు రాశి
ఊహించుకొన్న పనులకు ప్రతిబంధకములు ఎదురవ్వవచ్చును. ఆత్మ స్థైర్యం, పట్టుదలలు చూపవలసివుంటుంది. విద్యా ర్థులు పట్టుదలలతో సాగాల్సివుంటుంది. బంధువు లతో సమస్యలకు ప్రయత్నిస్తే పరిష్కారాలు పొందు తారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూడ గలరు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ చూపుకొన్నా అధికారు లచే ఒత్తిడులు పొందగలరు.
మకర రాశి
ప్రయత్నాలు వేగవంతమవుతున్నా తొందరపాటును చూపు సూచనలున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు చేసుకోగల్గుతారు. కుటుంబ వ్యక్తుల తీరు చికాకుపరచగలదు. ఇతరుల్ని మీ వ్యవహారాలకు దూరంగా ఉంచండి. వివాహాది శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొనగలరు. మధ్యవర్తిత్వంనకు నిర్వహించు వారితో ఖర్చులు పెరుగు సూచనలున్నాయి.
కుంభ రాశి
ముఖ్యమయిన పనులందు ఏకాగ్రతలు తగ్గకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ వ్యక్తులతో ముఖ్యమైన విషయాలపై చర్చలు చేయగలరు. మీ అధికారులతో సంయమనములు తప్పనిసరి చేయండి. కలసిరాని ఆలోచ నలు ఎక్కువ చేస్తారు. ద్వంద్వ వైఖరి చూపి సమస్య లను నియంత్రించుకోలేకపోతారు. పరిచయం లేని వారితో తగుమాత్రంగా వ్యవహరించుకోవాలి. తప్పని సరి కొన్ని ప్రయాణాలు చేయవలసిరావచ్చు.
మీన రాశి
నిశ్చితమైన అభిప్రాయములతో వ్యవహరించుకోవాలి. ఈర్ష్య, అసూయలను ఎక్కువ పొందు సూచనలు గలవు. కుటుంబ వ్యక్తుల తీరు నేరుగా ఉండగలదు. అవసరా లను సమర్థించుకొనునట్లు ఆదాయాలు ఉంటాయి. అభివృద్ధికై ఋణభారాలను పెంచుకొను సూచనలు ఉన్నాయి. తోటివారి ప్రభావాలచే లక్ష్యములు ప్రభా వితములగు సూచనలు గలవు. జాగ్రత్తలు అవసరం.
టాపిక్