Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశులకు వృత్తి, ఉద్యోగాల్లో పేరు వస్తుంది.. ధన యోగం, లక్ష్యాలను సాధిస్తారు
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 18.02.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

రాశిఫలాలు (దిన ఫలాలు) : 18.02.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : మంగళవారం, తిథి : కృ. షష్టి, నక్షత్రం : స్వాతి
మేష రాశి
ఉత్తమ కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. పదోన్నతి సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఫలితాలు అనుకూలం. కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారం పట్ల శ్రద్ధ పెంచాలి. శ్రీమహాలక్ష్మిని ద్యానించండి.
వృషభ రాశి
ఆర్థికంగా మేలు జరుగుతుంది. వృథా వ్యయాలను నివారించండి. మొహమాటం వద్దు. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య లక్ష్యాలను ఏకాగ్రతతో పూర్తిచేయండి. పరిస్థితులకు తగినట్టుగా వ్యవహరించండి. కలహాలకు ఆస్కారం ఉంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మిథున రాశి
కొత్త పనులు ప్రారంభిస్తారు. చంచల స్వభావం పనికిరాదు. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోండి. కొందరు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తారు. అయినా. ఉద్వేగానికి లోనుకావద్దు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపార నిర్ణయాల విషయంలో లోతైన అధ్యయనం అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి.
కర్కాటక రాశి
దైవానుగ్రహం ఉంది. అదృష్టం వరిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలకే పరిమితం కాకుండా... ఆచరణ వైపుగా అడుగులు వేయండి. దీర్ఘకాలంగా పరిష్కారం కాని ఓ పని కొలిక్కి వస్తుంది. వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. పనుల వాయిదా వద్దు. బుద్ధిబలంతో లక్ష్యాలను సాధిస్తారు. వేంకటేశ్వరుడిని పూజించండి.
సింహ రాశి
ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల సహాయం అందుతుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో కలిసొస్తుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక సాధన పెంచండి. పార్వతీ పరమేశ్వరులను ధ్యానించండి.
కన్య రాశి
ఏకాగ్రతతో కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కృషికి తగిన విజయాలు ఉంటాయి. సమస్యల్ని సున్నితంగా పరిష్కరించుకోండి. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. విజయం వరిస్తుంది. మహాగణపతిని ఉపాసించండి.
తుల రాశి
వ్యాపారయోగం ఉంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిత్రులతో సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి సమస్యలు ఎదురు కావచ్చు. విభేదాలకు దూరంగా ఉండండి. నలుగురినీ కలుపుకుని వెళ్లండి. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. మేలు జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
వృశ్చిక రాశి
శుభాలు జరుగుతాయి. ఆటంకాలు తొలగుతాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఫలితాలు బావుంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. అపాత్రదానం వద్దు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉన్నత స్థాయిలో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. వివాదాల జోలికి వెళ్లొద్దు. లక్ష్మీదేవిని ధ్యానించండి.
ధనుస్సు రాశి
కొత్త ప్రయత్నాలు ఆరంభిస్తారు.. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అవరోధాలు ఎదురైనా, సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. వాహన యోగం ఉంది. ఎంతోకాలం నుంచీ పూర్తికాని పనులు కొలిక్కి వస్తాయి. సమస్యలు ఎదురైనా సంయమనంతో వ్యవహరించండి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. వినాయకుడిని ప్రార్ధించండి.
మకర రాశి
స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కొంత పని ఒత్తిడి ఉంటుంది. ఇష్టదైవాన్ని ఆరాదించండి.
కుంభ రాశి
ధన యోగం ఉంది. ఆర్థిక ఫలితాలు అనుకూలం. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. అవరోదాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. మిత్రుల సహకారం అందుతుంది. ఆత్మీయుల సూచనల్ని నిర్లక్ష్యం చేయకండి. కాలాన్ని వృథా చేసుకోవద్దు. ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రతతో నిర్వర్తించండి. మహాగణపతిని ధ్యానించండి.
మీన రాశి
శుభప్రదమైన కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిభతో పెద్దల్ని మెప్పిస్తారు. వ్యాపారం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. అదృష్టయోగం సూచితం. వివాదరహితంగా వ్యవహరించండి. కుటుంబానికి సమయం కేటాయించండి. సౌమ్యంగా సంభాషించండి. వృత్తి, ఉద్యోగాల్లో పేరు వస్తుంది. ధన, ధాన్య యోగాలు ఉన్నాయి. ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించండి.