Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులు పూర్తి కావు.. ఆదాయం బాగుంటుంది, దుబారా ఖర్చులు తగ్గించుకోండి!-today rasi phalalu mesha rasi to meena rasi april 5th saturday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులు పూర్తి కావు.. ఆదాయం బాగుంటుంది, దుబారా ఖర్చులు తగ్గించుకోండి!

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులు పూర్తి కావు.. ఆదాయం బాగుంటుంది, దుబారా ఖర్చులు తగ్గించుకోండి!

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 05.04.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 05.04.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసు

మాసం: చైత్ర, వారం : శనివారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : ఆర్ధ్ర

మేష రాశి

మేష రాశి వారు కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలకు తావివ్వవద్దు. మీ యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభ రాశి

వృషభ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టు జరుగుతాయి. ఆటంకాలెదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోష పరుస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు.

మిధున రాశి

మిధున రాశి వారికీ సర్వత్రా అనుకూలం. అభీష్టం నెరవేరుతుంది. దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సామరస్యంగా మెలగండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేయగల్గుతారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలు వదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వద్దు.

సింహ రాశి

సింహ రాశి వారు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సంకల్పబలంతోనే విజయం సాధిస్తారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పత్రాల రెన్యువల్ ని ఆశ్రద్ధ చేయకండి. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. పనుల్లో ఆటంకాలెదురైనా పూర్తి చేయగల్గుతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.

కన్య రాశి

కన్య రాశి వారు ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయంకృషితోనే లక్ష్యాలు సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు.

తుల రాశి

తుల రాశి వారికీ అనుకూలదాయకం, శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. భేషజాలకు పోవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికీ అభీష్టం సిద్ధిస్తుంది. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు.

మకర రాశి

మకర రాశి వారు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.

కుంభ రాశి

కుంభ రాశి వారు వాక్పటిమతో రాణిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. పొదుపు ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్నీ తేలికగా కొట్టివేయొద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.

మీన రాశి

మీన రాశి వారి కార్యసాధనకు ఓర్పు ప్రదానం. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. మీ శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. పెద్దల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ఆదాయం సంతృప్తికరం. పరిచయస్తులకు ధనసహాయం అర్థిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన పనులు వాయిదా వేసుకుంటారు. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

సంబంధిత కథనం