రాశిఫలాలు (దిన ఫలాలు) : 29.04.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: చైత్ర, వారం : మంగళవారం, తిథి : శు. విదియ, నక్షత్రం : కృత్తిక
మేష రాశి వారికి గ్రహసంచారాలు సామాన్యంగా ఉపకరిస్తాయి. ఇతరులపై ఆధారపడి పనుల్ని చేపట్టుకోకండి. సహకరించకపోగా నిరుత్సాహపూర్వక వ్యాఖ్యలు ఉండు సూచనలు ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటూ ఆదాయ మార్గాలపై దృష్టిని ఉంచుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆధ్యాత్మికతలకు సమయ కేటాయింపులు చేయలేకపోతారు. విద్యార్థులకు మంచి వ్యాసంగాలు సిద్ధిస్తాయి.
వృషభ రాశి వారు కుటుంబంతో సంతోషంగా వ్యవహరించుకొంటారు. సమయోచితముగా వ్యవహరించుకొని అవసరాలను సమర్థించుకోగలరు. గతం నుండి నిలచిన అపరిష్కృతములైన భూ వ్యవహారాల్లో కదలికలుంటాయి. శుభకార్య యత్నాలందు ఓపిక, పట్టుదలలు చూపుకోవాలి. నూతన ఒప్పందాలు, అగ్రిమెంట్లు ఏర్పడతాయి. ఆరోగ్య. ఆర్థిక విషయాలు పరవాలేనివిగా సాగుతాయి. సాధారణ పనులకే ప్రాధాన్యతనిచ్చుకోండి.
మిథున రాశి వారికి గ్రహసంచారాలు సామాన్య ప్రయోజనాలు ఇస్తాయి. కుటుంబంలో ఏకవాక్యతలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వాయిదాల పర్వమునకు దూరంగా ఉండాలి. గతంలో విమర్శించినవారే మీకు సహకరిస్తారు. నూతన ఒప్పంద అగ్రిమెంట్లువంటి విషయాల్లో వేచిచూసే విధానాలను అమలు చేసుకోండి. వస్తు జాగ్రత్తలకు ప్రాధాన్యతనీయండి. సామాన్యతలకు ప్రాధాన్యతనిచ్చి వ్యవహరించుకోవాలి.
జన్మ కుజుడు మినహా మిగిలినవి ఉపకరించు స్థితిలో ఉన్నాయి. కాలంతోను, నలుగురితో కలసి పయనించగలుగుతారు. అవకాశాలను వినియోగించుకుంటారు. కుటుంబంలో ఏకవాక్యతలుండి, కుటుంబ వ్యక్తులచే తీపి వార్తలుంటాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. వాహన మరమ్మతులు, భ్రాతృవర్గమున మనస్పర్థలుంటాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
సింహ రాశి వారు ప్లానింగ్గా సాగితే గందరగోళ స్థితిని దూరం చేసుకోగలరు. మానసిక, శారీరక ఒత్తిడులకు గురికాబడు సూచనలున్నా చేపట్టుకొన్ను పనులందు మంచి కదలికలుంటాయి. విమర్శలు ఏర్పడినప్పుడు మౌనమును పాటించుకొనుట మంచిది. ఆత్మన్యూనతభావాలకు దూరంగా ఉండండి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు మధ్యమంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంయమనాలు చూపుకోండి.
భేషజాలకు, పట్టుదలలకు దూరంగా ఉండండి. ఒక సందర్భంలో ఆత్మీయులు దూరంగా ఉండు స్థితులను జీర్ణించుకోలేకపోవచ్చు. జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో ముందు జాగ్రత్తలకు ప్రాధాన్యతని ఇయ్యాల్సివుంటుంది. అధికారులతో సంయమనాలు అవసరం. బాధ్యతలు పెరుగుతాయి. మనోభీష్టతలేని పనులు కర్తవ్యాలు కాగల సూచనలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాలలో నెలసరి చెల్లింపులు పూర్తి చేసుకుంటారు. ఆచార, అలవాట్లకు ప్రాధాన్యతనిచ్చి సాగుతారు.
ఇతరులు గౌరవించుటలేదను భావాలకు దూరంగా ఉండి, వారిని అర్థం చేసుకొని ప్రయాణించవలసి వుంటుంది. పరపతి సౌకర్యాలు, ఎదురు చూస్తున్న అనుమతులు పొందగలుగుతారు. ఆదాయాల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నా అవసరాల్ని సమర్థించుకోగలరు. అనవసర ప్రయాణాలు, బహుమతుల వితరణలందు జాగ్రత్త పడతారు. విరామ, ఆరోగ్యాలకై సమయ పాలనను తప్పని సరి చేయండి.
వృశ్చిక రాశి వారికి ప్రయత్న కార్య అనుకూలతలుంటాయి. అవసరాలను సమర్థించుకుంటారు. తరచూ ప్రయాణాలను చేయవలసి వుంటుంది. ఖర్చుల విషయంలో ఏకాగ్రతలు అవసరం. అధికారులు సహకరిస్తారు. అదనపు బాధ్యతలు స్వీక రించుటకు ఆలోచనలు అవసరం. కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి గౌరవం పొందుతారు. నిశ్చితార్థాలు పూర్తయి, మండపాలకు అడుగులు వేయగలుగుతారు.
చేపట్టుకొన్న పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక, అవసరాల పట్ల ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. ఇంటా బయటా అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగ పనుల్లో రీచెక్ తప్పనిసరి చేయండి. వ్యాపారాల్లో రొటేషన్లకే ప్రాధాన్యతనిచ్చి సాగాలి. ఒత్తిడిని కల్గించుకోకుండా నిర్మొహమాటాలు చూపుట మంచిది కాగలదు. విద్యార్థులు పట్టుదలలు చూపవలసి వుంటుంది.
మకర రాశి వారి ఆలోచనలు పలు రకాలుగా సాగుతాయి. ఇతరుల ప్రభావా లకు లోనవుతారు. ఆర్థిక సర్దుబాట్లుంటాయి. చెల్లింపులు పూర్తి చేసుకోగలరు. వాహన, యంత్రాల మార్పులు, కొత్తవి ఏర్పరచుకొనుట ఉంటాయి. కొన్ని ప్రయాణాలను, పెట్టుబడులను వాయిదా వేసుకుంటారు. వృత్తి, వ్యాపార ఉద్యోగాలలో సాధారణంగా సాగుతాయి. ప్రత్యర్థి వర్గంవారిచే కవ్వింపు చర్యలు ఉండగలవు.
ప్రతికూల స్థితుల మధ్య ప్రయత్నించుకోవలసి రావచ్చును. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూడగలరు. గత, విభేదాలు కొన్ని తగ్గి బంధుమిత్రులతో ఉత్సాహంగా వ్యవహరించుకొంటారు. బదిలీలకు, ఉద్యోగ మార్పు యత్నాలకు దూరంగా ఉండుట మంచిది. స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో తెలియనివారితో వ్యవహారాలకు దూరంగా ఉండండి. తాత్కా లిక లబ్ధిలు లేకపోయినా అదనపు బాధ్యతలను ఉద్యోగాల్లో స్వీకరించవలసి రావచ్చును.
మీన రాశి వారు ప్రత్యర్థి వర్గమునకు సరైన సమా ధానాలు చెప్పగలుగుతారు. ఆశించుకొన్న రంగాల్లో వృత్తి, ఉద్యో గాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారాలు చుడతారు. దూర ప్రయాణాలను చేపట్టవలసి రావచ్చును. బాధ్యతాయుత ప్రవర్తనకు గుర్తింపులు పొందుతారు. నిర్మాణపు పనులు మెల్లిగా సాగుతాయి. ఆహార నియమాలకు ప్రాధాన్యతనిచ్చి సాగండి.
సంబంధిత కథనం