రాశిఫలాలు (దిన ఫలాలు) : 25.04.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: చైత్ర, వారం : శుక్రవారం, తిథి : కృ. ద్వాదశి, నక్షత్రం : పూ.బాధ్ర
మేష రాశి వారికి అదృష్టయోగం కొనసాగుతోంది. ఉత్తమ ఫలితాలు సాధించడానికి అనువైన సమయం. ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్వేగాల్ని అదుపులో ఉంచుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. మహాలక్ష్మిని ధ్యానించండి.
వృషభ రాశి వారికి శుభప్రదమైన సమయం. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆదాయం పెరుగుతుంది. బలమైన ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. పనులు వాయిదా వేయకండి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. మీ అన్వేషణ ఫలిస్తుంది. కోరుకున్నది అందుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.
మిథున రాశి వారికి ఆర్థిక ఫలితాలు బావున్నాయి. స్థిరమైన నిర్ణయాలు విజయాలను అందిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతి గోచరిస్తోంది. లక్ష్యాల విషయంలో స్పష్టత అవసరం. సహనానికి పరీక్షా సమయం. అపార్థాలకు తావివ్వకండి. గ్రహబలం తక్కువగా ఉంది. వ్యాపార వ్యవహారాల్లో పొరపాట్లకు ఆస్కారం లేక పోలేదు. వృథా వ్యయాల్ని పరిహరించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కర్కాటక రాశి వారికి అన్ని విధాలా ఉత్తమ సమయం. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ప్రగతిని సాదిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వనరులు సమకూరతాయి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునే ప్రయత్నం చేస్తారు. ఆత్మీయులకు అండగా నిలుస్తారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ముఖ్య వ్యవహారాల్లో లోతైన ఆలోచన అవసరం. గణపతిని ఉపాసించండి.
సింహ రాశి వారి ఆర్థిక ఫలితాలు అనుకూలం. స్థిరాస్తులు, వృద్ధి చెందుతాయి. నిర్ణయాల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి. ఒత్తిడికి గురికావద్దు. వాయిదా మనస్తత్వం పనికిరాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఓపిక అవసరం. సౌమ్యంగా సంభాషించండి. ఇబ్బందులు సృష్టించేవారితో జాగ్రత్త నవగ్రహాల్ని పూజించండి.
కన్య రాశి వారు మనోబలంతో విజయాలు సాధిస్తారు. నైపుణ్యాల్ని పెంచుకుంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. చిన్నపాటి చికాకులు ఎదురైనా ప్రశాంత చిత్తంతో వ్యవహరించాలి. మిత్రుల సలహాలు తీసుకోండి. అవరోధాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పని పూర్తవుతుంది. మోసగాళ్లతో జాగ్రత్త. విష్ణుమూర్తిని ధ్యానించండి.
తుల రాశి వారి వ్యాపార ఫలితాలు అనుకూలం. లాభాలు అందుకుంటారు. కాకపోతే, ఆర్ధిక నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. స్తోమతకు మించి అప్పులు ఇవ్వకండి. నిర్ణయాలు వాయిదా వేయకండి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరుత్సాహం వద్దు. సర్దుకుపోయే ధోరణితో వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.
వృశ్చిక రాశి వారు శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయటా మేలు జరుగుతుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో కలిసొస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ సేవలు సమాజానికి ఉపయోగపడతాయి. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వ్యాపార విజయాలకు మరింత ఏకాగ్రత అవసరం. ఆధ్యాత్మికతకు సమయం కేటాయించండి. లక్ష్మీదేవిని అర్చించండి.
ధనుస్సు రాశి వారికి వ్యాపారంలో కలిసొస్తుంది. గతంతో పోలిస్తే లాభాలు పెరుగుతాయి. ఆర్ధిక ఫలితాలు అనుకూలం. భూ, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. చిరునవ్వుతో సంభాషించండి. కుటుంబానికి సమయం కేటాయించండి. పరిస్థితులకు తగినట్టు స్పందించండి. ఇష్టదైవాన్ని పూజించండి.
మకర రాశి వారికి ధనయోగం ఉంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. విజయాలు సొంతం చేసుకుంటారు. ధర్మాన్ని వదిలిపెట్టకండి. వ్యాపార నిర్ణయాల్లో స్పష్టత అవసరం. ఇతరుల ప్రభావానికి లోనుకాకండి. ప్రయాణాల్లో జాగ్రత్త నిర్లిప్తత వీడకపోతే పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించండి.
కుంభ రాశి వారు శుభ ఫలితాలు సాధిస్తారు. కొత్త ప్రయత్నాలకు సరైన సమయం. పెద్దల అనుగ్రహంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలోని అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. కొంత దూకుడు అవసరమే. మీ కారణంగా పదిమందికి మేలు జరుగుతుంది. అదృష్టదేవత అన్నివేళలా వెన్నంటి నిలుస్తుంది. లక్ష్మీదేవిని పూజించండి.
మనోబలంతో పనులను ప్రారంబించండి. సంపద వృద్ధికి ప్రణాళికలు అవసరం. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఏ విషయంలోనూ ఒత్తిడికి గురికావద్దు. కొన్ని సమస్యల్ని సృజనాత్మకంగా పరిష్కరిస్తారు. సామరస్యంతో వ్యవహరించాలి. కలహాలకు అవకాశం కల్పించకండి. ఆధ్యాత్మిక సాధన మరింత పెంచండి. వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.
సంబంధిత కథనం