ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ఆటంకాలు, చిన్నపాటి సమస్యలు.. జాగ్రత్తగా ఉండడం మంచిది!-today rasi phalalu mesha rasi to meena rasi april 23rd wednesday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ఆటంకాలు, చిన్నపాటి సమస్యలు.. జాగ్రత్తగా ఉండడం మంచిది!

ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ఆటంకాలు, చిన్నపాటి సమస్యలు.. జాగ్రత్తగా ఉండడం మంచిది!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 23.04.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 23.04.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: చైత్ర, వారం : బుధవారం, తిథి : కృ. దశమి, నక్షత్రం : ధనిష్ట

మేష రాశి

మేష రాశి వారు ముఖ్యమైన పనుల్లో ఆలోచనలతో సాగండి. ప్రయత్నించుకున్నవారికి అనుకూల సమయం. ఆదాయాలు ఆశించినట్టుంటాయి. మీ పరిధి పరిమితికి లోబడి వ్యవహరించుకోవాలి. వ్యాపారాల్లో నిత్య సరుకుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏ పనైనా చట్టబద్ధంగా ఉండేటట్లు జాగ్రత్తపడండి. విద్యార్థులకు అనుకూల సమయం.

వృషభ రాశి

వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రయత్న అనుకూలతలు ఉంటాయి. శుభకార్యాలు నిర్వహించుట, మంచి వార్తలు వినుట ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీదైన తరహాలో వ్యవహరించుకోగలరు. కోర్టు, లిటిగేషన్ వ్యవహారాలను అనుకూలంగా మార్పుచేసుకోగలరు. అనారోగ్య సమస్యల నుండి క్రమంగా కోలుకుంటారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

మిథున రాశి

మిథున రాశి గ్రహ సంచారాలలో మార్పులు, కొన్ని ప్రయోజనాలు ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీపై మీకు నమ్మకం పెరగడం, అధికారులచే గుర్తింపులు ఏర్పడుట ఉంటాయి. కుటుంబంలో ఉత్సాహాలు సిద్ధిస్తాయి. ఆలోచనలు చోటుచేసుకొంటాయి. విద్యార్థులకు మంచి సమయం. వాగ్విషయాల్లో పట్టువిడుపులు పాటించుకోవాలి. ప్రయాణాల్లో వాహనాలతో జాగ్రత్తలు అవసరం.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి ప్రయత్న అనుకూలతలకు పట్టుదలలు అవసరం. సమస్యలను సరి చేసుకుంటారు. ఓర్పుగా వ్యవహరించుకోవాలి. అనారోగ్య భావనలు తగ్గుటయే కాక ఉత్సాహంగా వ్యవహరించుకోగలరు. మీ వ్యక్తిగతాలను ఇతరులతో చర్చించకండి. వ్యాపార వ్యవహారాల్లో ఊహించుకొన్న కదలికలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో బాధ్యతల మార్పులుంటాయి. విద్యార్థులు ఏకాగ్రతతో సాగాల్సి వుంటుంది.

సింహ రాశి

సింహ రాశి తరచుగా పునర్విమర్శలకు ప్రాధాన్యతనిచ్చుకొని సాగండి. చేపట్టిన పనులు మందగతిన సాగుతాయి. రొటేషన్ పనులకే ప్రాధాన్యతనిచ్చుకోండి. ఊహించుకొన్న వ్యక్తులతో సంబంధాలు ఏర్పడుటయే కాక వారికి మార్గదర్శకత్వాలు లభిస్తాయి. ఆదాయాలు సామాన్యంగా ఉంటాయి. అనవసర ఖర్చులలో తెలివిగా సాగవలసి వుంటుంది. విద్యార్థులు ప్రణాళికాయుతంగా సాగాలి. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాల్ని విడవకుండా జాగ్రత్తలు అవసరం.

కన్య రాశి

కన్య రాశి వారు కుటుంబంలో ఏకవాక్యతలు ఉండేటట్లు జాగ్రత్తలు పాటించుకోవాలి. కాలాతీత నిర్ణయాలు ఉండకుండా ప్రయత్నాల్లో వేగం పెంచుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణ స్థాయిలో సాగుతాయి. ప్రలోభాలకు గురికాకండి. ఇతరులు గుర్తించలేరను భావాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో స్నేహభావాలతో వ్యవహరించుకోవాలి. విద్యార్థులకు అనుకూల సమయం.

తుల రాశి

తుల రాశి వారికి సహకరించు వ్యక్తులు పెరుగుతారు. ఊహించుకొన్న సమాచారాల్ని సేకరిస్తారు. అవసరాలను సమర్థించుకొనునట్లు ఆదాయాలుంటాయి. గౌరవమును కోరుకొనక నలుగురిని కలుపుకొని యత్నించుకోవాలి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూడగలరు. వివాహ, ఉద్యోగ యత్నీకులు నిరాశలకు గురికాకుండా సాగాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు శ్రమ పడినా అంతంతమాత్రపు ప్రయోజనాలు ఉంటాయి. తరచూ ప్లానింగ్లో మార్పు చేర్పులు చేసుకొంటారు. వృత్తి, ఉద్యోగ మార్పులకు అనుకూలతలుండవు. విద్యార్థులు ప్రణాళికతో ముందుకెళ్లాలి. వ్యాపారాల్లో చెల్లింపులకు ప్రాధాన్యతనిచ్చి సాగాలి. కుటుంబ సహకారాలుంటాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ముఖ్యమైన పనులకు ప్రత్యేక జాగ్రత్తలతో, భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని సాగాలి. సామాన్య అనుకూలతలు అన్నిటా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండేవి చేపట్టుకోండి. మొహమాటాలకు గురిచేయు వ్యక్తులుంటారు. వ్యక్తిగతమైన పునరాలోచనలు అన్నిటా పాటించుకోండి. వాహన, యంత్రాదులతో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి.

మకర రాశి

మకర రాశి గ్రహసంచారాలు మిశ్రమ ప్రయోజనం ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణతలతో సాగుతాయి. ఆదాయాలు అవసరాలకు సరిపడునట్లు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలకు ఊహించని ఆటంకాలు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి వార్తలు ఉండగలవు. సలహాలు ఇచ్చుటకు దూరంగా ఉండండి. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారు మానసికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. అవకాశాలు కలసివస్తాయి. ఇతరుల వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉంటూ వ్యవహరించుకోండి. అనాలోచిత ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగాలు సాధారణతలతో సాగుతాయి. ఎదుటివారి ఆంతర్యం తెలుసుకోకుండా, పూర్తి సమాచారం సేకరించకుండా ఒక అభిప్రాయానికి రాకండి.

మీన రాశి

మీన రాశి వారికి గ్రహసంచారాలు చిన్నతరహా ప్రయోజనాలు ఇస్తాయి. పెండింగ్ పనులను పూర్తి చేసుకొంటారు. అవసరాలలో సమర్థించుకొంటారు. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా పట్టుదలలు చూపుకొని అవకాశాలను ఏర్పరచుకుంటారు. అనారోగ్యభావనలందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. విద్యార్థులు వారి వారి టార్గెట్స్ అధిగమించుకోగలరు. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహపూరిత వాతావరణంలో పని చేసుకోగలుగుతారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం