రాశిఫలాలు (దిన ఫలాలు) : 22.04.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: చైత్ర, వారం : మంగళవారం, తిథి : కృ. నవమి, నక్షత్రం : శ్రవణం
మేష రాశి వారు గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఎరుపు వత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం అన్ని విధాలా మంచిది. కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి అన్ని విధాలా అనుకూల సమయం.
వృషభ రాశి వారి ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కోర్టుకేసులు పరిష్కారమవుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు బకెట్లో రెండు చెంచాలు ఐశ్వర్యనాగిని పొడిని వేసి స్నానం చేయండి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త విద్యావకాశాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలలో అశించిన పురోగతి కనిపిస్తుంది.
మిథున రాశి వారి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రెండు, మూడు విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిత్యం హనుమాన్ సింధూరం ధరించటం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మాన సత్కారాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. నిత్యం మహాతీర్థం పొందటం వల్ల సౌఖ్యం, సంతోషం కలుగుతుంది. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి.
సింహ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నిత్యం లక్ష్మీకటాక్షం ముఖానికి రాసుకోవాలి. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. వివాదాలకు దూరంగా వుండండి.
కన్య రాశి వారు కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వర్తిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు కారాలు అభివృద్ధి సాధిస్తారు. అందరికి సమస్త శుభాలను చేకూరుస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి సత్కారాలు పొందుతారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. మానసిక అశాంతి.
తుల రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో కాస్త సంతృప్తి పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిత్యం దీపారాధన కుందిలో రెండు చుక్కలు పరిమళ గంధము వేయండి. లక్ష్యసాధనకు శ్రమిస్తారు. జీవిత భాగస్వామి సలహాల మేరకు కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల స్థితి. ధనవ్యయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారికి సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగై రుణాలు తీరుస్తారు. ఇంటా బయటా మీదే. పైచేయిగా వుంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అప్తుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నిత్యం లక్ష్మీతామర వత్తులు అష్టమూలిక తైలంతో కలిపి దీపారాధన చేయటం అన్ని విధాలా మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ధనస్సు రాశి ]రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వుంటాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఏ దేవతకైనా ఏ దేవునికైనా సుగంధ గంధాక్షింతలతో పూజించిన మంచి ఫలితాలు వుంటాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు.
మకర రాశి వారికి అవకాశాలు నిరాశపరుస్తాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు జరిగే సూచనలు, రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు పొందుతారు. జిల్లేడు వత్తులు అష్టమూలికాతైలంతో కలిపి దీపారాధన చేయటం అన్ని విధాలా మంచిది. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానం ఆశ్చర్యపరుస్తుంది.
కుంభ రాశి వారికి రుణబాధలు తొలగుతాయి. రాబడి పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం. ఉద్యోగ, వివాహ యత్నాలు ముమ్మారం చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. నిత్యం జువ్వాదితో దేవతార్చనము చేయటం వలన భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరం. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
మీన రాశి వారికి కుటుంబ బాధ్యతలు అధికమై సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. పెట్టుబడుల్లో లాభాలు పొందుతారు. అనుకున్నది సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. నిత్యం సర్వరక్షాచూర్ణము, సర్వదోష నివారణ చూర్ణము కలిపి స్నానం చేయటం వలన నవగ్రహ దోషాలు పోయి మాని జరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
సంబంధిత కథనం
టాపిక్