ఈరోజు ఈ రాశుల వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.. విద్యార్థులకు అనుకూల సమయం, శివారాధన మేలు చేస్తుంది!-today rasi phalalu mesha rasi to meena rasi april 21st monday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు ఈ రాశుల వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.. విద్యార్థులకు అనుకూల సమయం, శివారాధన మేలు చేస్తుంది!

ఈరోజు ఈ రాశుల వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.. విద్యార్థులకు అనుకూల సమయం, శివారాధన మేలు చేస్తుంది!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 21.04.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.04.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: చైత్ర, వారం : సోమవారం, తిథి : కృ. అష్టమి, నక్షత్రం : ఉ. ఆషాడ

మేష రాశి

మేష రాశి వారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు వస్తుంది. ఇంట్లో వాళ్లతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల సమయం. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈశ్వరారాధన మేలుచేస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారు సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీ క్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఆదృష్టం కలిసివ స్తుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగు తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల సహకారం అందుతుంది. పనివారితో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం. దత్త స్తోత్రాలు పఠించండి.

మిథున రాశి

మిథున రాశి వారి గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. అన్ని విషయాలలో శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వృథా ఖర్చులు ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో మనస్పర్ధలు వస్తాయి. రాబడి మార్గాలపై దృష్టి సారించడం అవసరం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసిక సంతృప్తి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. శ్రమ అధికమైనప్పటికీ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. హనుమాన్ చాలీసా పఠించండి.

సింహ రాశి

సింహ రాశి ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. పనుల్లో కొంత ఆలస్యం జరు గుతుంది. బంధువర్గంతో ఇబ్బందులు ఉంటాయి. భాగస్వా ముల వల్ల వ్యాపారంలో చికాకులు తలెత్తుతాయి. అన్నీ సర్దుకుంటాయి. పెద్దల సలహాలు పాటించడం అవ సరం. లక్ష్మీధ్యానం శుభప్రదం.

కన్య రాశి

కన్య రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో జాప్యం జరగవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలుచేస్తుంది.

తుల రాశి

తుల రాశి వారి గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. పెద్దల సలహాలు పాటిం చడం అవసరం. ఉద్యోగులకు తాత్కాలిక అనుకూలత ఉంది. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. ఓపిక అవసరం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. గణపతి ఆరాధన శుభప్రదం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వరికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. వివా హాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సూర్యారాధన శ్రేయస్కరం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు నూతన నిర్మాణ పనులు మొదలుపెడతారు. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొన సాగుతుంది. బంధువర్గం మూలంగా కార్యసిద్ధి ఉంది. ప్రయాణాల వల్ల లబ్ది పొందుతారు. శ్రద్దగా పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మకర రాశి

మకర రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉత్సాహంతో పనిచే స్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురికి సాయపడతారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. అనుకున్న పనులు నెమ్మదిగా నెరవేరుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బంధువర్గంతో కార్య సాఫల్యం ఉంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలను సంయమనంతో పరి ష్కరించుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. రామాలయాన్ని సందర్శించండి.

మీన రాశి

మీన రాశి వారికి ప్రయాణాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులతో చిన్నపాటి మనస్పర్దలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దక్షిణామూర్తిని ఆరాధించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

సంబంధిత కథనం