రాశిఫలాలు (దిన ఫలాలు) : 01.04.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసు
మాసం: చైత్ర, వారం : మంగళవారం, తిథి : శు. తదియ , నక్షత్రం : భరణి
మేష రాశి వారు అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు, కళాకారుల యత్నాలు సఫలీకృతమవుతాయి. స్వల్ప అనారోగ్యం, వ్యయప్రయాసలు. నలుపు, ఆకుపచ్చ అదృష్ట రంగులు, దుర్గాదేవిని పూజించండి.
వృషభ రాశి వారు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనులు పూర్తి చేస్తారు. పట్టుదలతో సమస్యలు అధిగమిస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు రావచ్చు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, కళాకారులకు యత్నకార్యసిద్ధి. చికాకులు ఉండవచ్చు. గులాబీ, లేత నీలం అదృష్ట రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథున రాశి వారి పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోగతి, ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. వాహనయోగం. వ్యాపారాలు వుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ధనవ్యయం, ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు, గులాబీ, ఎరుపు అదృష్ట రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కర్కాటక రాశి వారు కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం, తెలుపు, గులాబీ అదృష్ట రంగులు. గణపతి అర్చన చేయండి.
సింహ రాశి వారి కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు సంభవం, రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబంలో కలహాలు, నీలం, తెలుపు అదృష్ట రంగులు, విష్ణుధ్యానం చేయండి.
కన్య రాశి వారి పాత బాకీలు కూడా వసూలై ఆర్థిక పరి స్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు ద్వారా కొంత సహాయసహకారాలు అందుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహ నాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు. స్వల్ప అనారోగ్యం, ఖర్చులు, ఎరువు, లేత పసుపు అదృష్ట రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
తుల రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. భూవ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పాతసంఘటనలు గుర్తు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులు దగ్గరవుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుం టారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొద్దిపాటి చికాకులు, అనారోగ్యం. ఎరుపు, లేత ఆకు పచ్చ అదృష్ట రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చిక రాశి వారు అనుకున్న పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహం. రుణదాతల నుంచి ఒత్తిడులు, వ్యాపాదాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ధనలాభం. కార్యసిద్ధి. శుభవర్తమానాలు, ఆకుపచ్చ, ఎరుపు అదృష్ట రంగులు, దేవీఖడ్గమాల పఠించండి.
ధనుస్సు రాశి వారు ఇంతకాలం పడిన శ్రమ కొంతవరకు ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి. బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభి స్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి. రాజ కీయవర్గాలకు విదేశీ పర్యటనలు, వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు, ఆరోగ్య సమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చ అదృష్ట రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి.
మకర రాశి వారి ముఖ్య వ్యవహారాలు సాఫీగా కొనసా గుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యావకాశాలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో ముఖ్య విషయాలపై చర్చలు, సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని వివాదాలు, దూరప్రయాణాలు. ఒప్పందాలలో కొన్ని ఇబ్బందులు. నీలం, తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
కుంభ రాశి వారు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలమువుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి లాభం, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులకు అవకాశం. కళాకారులకు చేజారిన అవకాశాలు తిరిగి దక్కుతాయి. మానసిక అశాంతి, బంధువులతో మాట పట్టింపులు, ఆరోగ్యం మందగిస్తుంది. పసుపు, నీలం అదృష్ట రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మీన రాశి వారు ఎంతటి పనినైనా ఓపిగ్గా పూర్తి చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం, దీర్ఘకాలిక సమస్య పరిష్కారం, వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు, వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. గులాజీ, లేత ఎరుపు అదృష్ట రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.
సంబంధిత కథనం
టాపిక్