ఈరోజు ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగంలో ప్రమోషన్లు, పుత్రసంతానం, ధనవృద్ధితో పాటు ఎన్నో-today rasi phalalu mesha rasi to meena rasi april 19th saturday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగంలో ప్రమోషన్లు, పుత్రసంతానం, ధనవృద్ధితో పాటు ఎన్నో

ఈరోజు ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగంలో ప్రమోషన్లు, పుత్రసంతానం, ధనవృద్ధితో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 19.04.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.04.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: చైత్ర, వారం : శనివారం, తిథి : కృ.సప్తమి , నక్షత్రం : పూర్వాషాడ

మేష రాశి

మేష రాశి వారు సంపద, ఆస్తి, విలాసవంతమైన సౌకర్యాలు అనుభవిస్తారు. వ్యాపారపరంగా లాభాలను ఆర్జిస్తారు. ఆశావహంగా ఉంటారు. తన వాక్కుతో ఇతరులను మెప్పించి కార్యజయం పొందుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికీ అనుకూలమైన కాలం. ఆర్థికంగా బలపడతారు. కుటుంబసభ్యుల సహకారం బలమైన ఆర్థిక పరిస్థితికి దోహదం చేస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.

మిధున రాశి

మిధున రాశి వారు ఆరోగ్యంగా, ధనవంతులుగా మరియు తెలివైనవారుగా రూపుదిద్దుకుంటారు. జన్మరాశిలో గురు సంచారం జ్ఞానం, సంపద మరియు శ్రేయస్సును పెంపొందిస్తుంది. ఆర్థికపరిస్థితులు గణనీయంగా పెరుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికీ కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం. కుటుంబానికి దూరంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు.

సింహ రాశి

సింహ రాశి వారికీ కుటుంబంలో శాంతి, సామరస్యం ఉంటుంది. వృత్తిలో ప్రోత్సాహకాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టకాలంగా ఉంటుంది.

కన్య రాశి

కన్య రాశి వారికీ గురుబలం ఉంది. కలలను సాకారం చేసుకోవడానికి ప్రణాళిక రచిస్తారు. లక్ష్యం సాధించేవరకు దృఢ నిశ్చయంతో కృషి చేస్తారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంశక్తితో విజయం సాధిస్తారు. దైవబలంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఇతరులకు తమ వంతు సహాయం చేస్తారు.

తుల రాశి

తుల రాశి వారికీ ఆర్థిక పరిపుష్టి కల్గుతుంది. బంధు మిత్రుల సమాగమం కలుగుతుంది. ఎంత కఠినమైన పని అయినా ఎంతో సులువుగా చేయగలుగుతారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి గృహంలో కల్యాణాది శుభకార్య నిర్వహణ జరుగుతుంది. కార్యసిద్ధి అవుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలలో ముందంజ వేస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు జీవితంలో ప్రతి కార్యకలాపాన్ని చురుకుగా నిర్వర్తించడానికి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉన్నత ఆశయాలను విజయవంతంగా చేరుకుంటారు. సమాజం, కుటుంబం, స్నేహితులతో బాగుంటారు.

మకర రాశి

మకర రాశి వారికి మేధస్సు, జ్ఞానం వృద్ధి అవుతుంది. జీవితంలోని అనేక రంగాలలో విజయానికి దారితీసే ఉన్నత స్థాయి ధీశక్తి పెరుగుతుంది. అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు.

కుంభ రాశి

కుంభ రాశి వారు గృహం కొనడంలాంటి ప్రయోజనాలు నెరవేరతాయి. ధనాన్ని శుభవిషయాలకై మాత్రమే వెచ్చిస్తారు. దుబారా ఖర్చులను అదుపులో ఉంచగల్గుతారు. పుత్రసంతానం కల్గుతుంది. ధనవృద్ధి అవుతుంది.

మీన రాశి

మీన రాశి వారు ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ మరియు పదిమందిని ప్రోత్సహించి ముందుకు నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇతరులతో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం