Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అవకాశాలు కలసి వస్తాయి.. ధనలాభం, గృహంలో శుభకార్యలతో పాటు ఎన్నో!-today rasi phalalu mesha rasi to meena rasi april 17th thursday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అవకాశాలు కలసి వస్తాయి.. ధనలాభం, గృహంలో శుభకార్యలతో పాటు ఎన్నో!

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అవకాశాలు కలసి వస్తాయి.. ధనలాభం, గృహంలో శుభకార్యలతో పాటు ఎన్నో!

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 17.04.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 17.04.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: చైత్ర, వారం : గురువారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : జ్యేష్ట

మేష రాశి

మేష రాశి ఉత్సాహంగా చాలా పనుల్ని పూర్తి చేసుకుంటారు. ఇతరులకు మీ బాధ్యతలను అస్పగించక సొంతంగా చూసుకోవాలి. ప్రయాణాల్లో, పెట్టుబడుల్లో ముందు జాగ్రత్తలు అవసరం. ఆర్థిక విషయాల్లో సామాన్యతలు కొనసాగుతాయి. నూతన పనుల్ని చేపట్టుటకు ఆలోచనలు అవసరం. భ్రాతృవర్గపు రాకపోకలు పెరుగుతాయి. విద్యార్థులు వ్యాసంగాలకు పట్టుదల చూపుకోవాలి.

వృషభ రాశి

వృషభ రాశి గ్రహసంచార స్థితి అనుకూలం. అవకాశాలు కలసివస్తాయి. ఊహించుకున్నవి సకాలంలో పూర్తి చేసుకుంటారు. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో నుంచి మార్పులుంటాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం. వృత్తి, వ్యాపారాల్లో నూతన అంశాలపై దృష్టిపెట్టగలరు.

మిథున రాశి

మిథున రాశి రాశికి కొన్ని మంచి మార్పులు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపా రాల్లో సాధారణతలు ఏర్పడతాయి. అధికారులచే చిన్నతరహా గుర్తింపులుంటాయి. ఇతరులకు సహకరించగలుగుతారు. ఉద్యోగ మార్పులు కొందరికి ఉండగలవు. కొన్ని ఒప్పందాలవంటి విషయాలలో అనుకూల మార్పులు ఏర్పడతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికీ పుష్యమి, ఆశ్లేష, గ్రహసంచారాల్లో జన్మకుల స్థితిచే కొద్ది జాగ్రత్తలకు ప్రాధాన్యతలనిచ్చి వ్యవహరించుకోండి. అవకాశాలు కలసివస్తాయి. సహకరించు వ్యక్తులు పెరుగుతారు. దూర ప్రయాణాల్ని వాయిదా వేసుకొనుట, ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతనిచ్చి నూతన విషయాల్ని తెలుసుకోగలరు. విద్యార్థులకు మంచి సమయం.

సింహ రాశి

సింహ రాశి వారికి గ్రహ సంచారాలందు మార్పులచే పరీక్షా కాలంగా ఉండగలదు. కర్తవ్యాలకు, బాధ్య తలకు అంకితభావంతో ఆగాలి. కుటుంబంలో సమిష్టి యత్నాలుంటాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. రావలసిన వాటికై చేయు యత్నాల్లో లౌక్యంగా వ్యవహరించుకోవాలి. ఋణ భారాలను పెంచకండి.

కన్య రాశి

కన్య రాశి వారు ప్రారంభించిన పనుల్ని సకాలంలో పూర్తి చేసుకుంటారు. అధికారిక హోదాలు వంటి అదనపు బాధ్యతలను స్వీకరించవలసి రావచ్చు. ఇతరులకు మనఃపూర్వకంగా సహకరించగల్గుతారు. కొన్ని వృథా ఖర్చులు ఉన్నా సంతృప్తి ఉండగలదు. స్థిరాస్తులు, వాహనాలు వంటి విషయాలలో మక్కువ పెరగగలదు.

తుల రాశి

తుల రాశి వారికి గ్రహసంచారాలు మిశ్రమ స్థితి, జాప్యములకు దూరంగా ఉంటూ వ్యవహరించుకోవాలి. అనవసర ఆలోచనలు చుట్టు ముట్టు సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇష్టత కల బాధ్యతలు పెంపు ఉండగలదు. ఆదాయపరంగా హెచ్చుతగ్గులు చోటుచేసుకొనుట, అవసరాలను సమర్థించుకోలేకపోవుట ఉంటాయి. విద్యార్థులు సమయపాలనపై ప్రాధాన్యతనిచ్చి సాగాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి సామాన్య ప్రయోజనాలను ఏర్పరచగలవు. అన్నిటా తగు జాగ్రత్తలకు ప్రాధాన్యతనిచ్చుకొని సాగుటయే మంచిది. పెద్దలు కుటుంబవ్యక్తుల సూచనలు, సలహాలకి ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగులు, వృత్తులు నిర్వహించుకొను వారు సంయమనాలతో సాగుట మంచిది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమున పంచగ్రహ కూటమి, అష్టమ కుజ స్థితులచే మీరు అన్నిటా శ్రద్ధాసక్తతలు చూపుకోవాలి. ఇతరులను సహాయ సహకారాలు కోరకుండుట మంచిది. మీ భాషాశైలిని తప్పుపట్టే వారి సంఖ్య పెరగగలదు. అనారోగ్యభావనలు ఉండకుండా జాగ్రత్తలు పాటించుకోండి. ఒప్పందాలు, అగ్రిమెంట్లు వంటి విషయాలో వేచి ఉండు విధానాలను పాటించండి.

మకర రాశి

మకర రాశి వారు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తలు పాటిస్తూ పనులను చేపట్టుకోండి. ప్రారంభంలో నత్తనడకసాగినా మంచి ముగింపునివ్వగలుగుతారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మార్పు చేసుకోగల్గుతారు. సహోద్యోగుల్లో అభిప్రాయభేదాలు తలెత్తగలవు. రావలసిన వాటికై పట్టువిడుపులతో సాగాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారు ఇంటా బయటా ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూస్తారు. గృహంలో శుభకార్య నిర్వహణలు చేసుకొంటారు. ప్రయాణాలు చేయవలసి రావచ్చును. పెద్దల సలహాలు, సూచనలకు ప్రాధాన్యతనిచ్చి వ్యవహరించుకోండి.

మీన రాశి

మీన రాశి వారి గ్రహస్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఆలోచనలు నిలకడగా ఉండేట్లు జాగ్రత్త పడండి. తరచుగా ఆటంకాల్ని ఎదుర్కోవలసి రావచ్చును. ఖర్చుల్ని నియంత్రించుకొంటూ ప్రయత్నాలను చేసుకోవాలి. అన్నిటా పట్టుదలలతో శ్రమించి సాగాలి. విద్యార్థులు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

సంబంధిత కథనం