Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటుంది!
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 16.04.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 16.04.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: చైత్ర, వారం : బుధవారం, తిథి : కృ. చవితి, నక్షత్రం : అనురాధ
మేష రాశి
మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు ఎక్కువై చికాకులు పెడతాయి. నూతన పెట్టుబడులు విషయంలో తొందరపాటు వద్దు. ప్రత్యర్థులు స్నేహహస్తం అందిస్తారు. నిత్యం సర్వదోష నివారణ చూర్ణమును స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేయడం వల్ల అన్ని దోషాలు పోతాయి..
వృషభ రాశి
వృషభ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందుడుగు. రాజకీయ, కళారంగాల వారికి కలిసి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. నిత్యం కౌముది ధరించటం వలన ఆరోగ్య, ఆర్థిక స్థితిగతులు మొదలైనవి లాభిస్తాయి. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. నిత్యం శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి పఠించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త వసువులు కొంటారు. కాంట్రాక్టులు రాగలవు. అవార్డులు, రివార్డులు పొందుతారు. నిత్యం శ్రీ లక్ష్మీచందనం ధరించటం వలన మేలు జరుగుతుంది. పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకం. వివాదాలకు దూరంగా వుండండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. స్థిరమైన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఎరుపు వత్తులు అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయండి.
సింహ రాశి
సింహ రాశి వారు అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వివాదాలకు నుండి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు వుంటాయి. ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా వుంటాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రుణాల తీరుతాయి.
కన్య రాశి
కన్య రాశి వారిని విమర్శించిన వారే ప్రశంసిస్తారు. శ్రమకు తగ్గిన ఫలితం అందుకుంటారు. హెూదాలో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి యోగదాయకం ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. అమ్మవారిని జువ్వాదితో పూజిస్తే నుంచి ఫలితాలు వుంటాయి. రుణబాధలు తొలగుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.
తుల రాశి
తుల రాశి వారికి పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. పలుకుబడి కలిగిన వారి సహాయం పొందుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరం, రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి సన్మాన, సత్కారాలు పొందుతారు, నిత్యం లక్ష్మీతామర వత్తులు, అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయటం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యభంగం, చికాకులు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నిత్యం శ్వేతార్క గణపతిని పూజించుట వలన పిల్లల చదువులు అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
ధనుస్సు రాశి
రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి కలిసి వచ్చే కాలం అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆర్ధిక విషయాలలో పురోగతి సాధిస్తారు. నిత్యం కౌముది ధరించండి. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా వుంటుంది.
మకర రాశి
మీలోని ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు పొందుతారు. నిత్యం యజ్ఞ భస్మం ధరించటం వల్ల యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆర్థిక పరిస్థితి కొంత వరకు మెరుగు పడుతుంది. బాకీల వసూలవుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి నూతన పెట్టుబడులకు తగిన సమయం. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా వుండండి. నిత్యం త్రిశూల్ చేత పొగవేయటం వలన మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్త అంచనాలు, వ్యూహాలతో ముందడుగు వేసి క్లిష్టమైన పనులు కూడా పూర్తి చేస్తారు.
మీన రాశి
మీన రాశి వారి ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిత్యం దైవికమ్ ధూపం వల్ల మీ పిల్లలకు అన్నిరకాల దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వివాదాల నుండి బయటపడతారు.
సంబంధిత కథనం
టాపిక్