Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంపద పెరుగుతుంది, కలలు నిజం అవుతాయి.. శివాలయాన్ని సందర్శిస్తే మంచిది!
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 15.04.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 15.04.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: చైత్ర, వారం : మంగళవారం, తిథి : కృ. తదియ, నక్షత్రం : విశాఖ
మేష రాశి
మేష రాశి వారికీ విజయం లభిస్తుంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారు. అభిష్టసిద్ధి ఉంది. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు ఆర్ధిక ఆర్ధిక వృద్ధిని వృద్ధిని అందిస్తాయి. లక్ష్య సాధనలో నిర్లిప్తత వద్దు. వృత్తి, ఉద్యోగాల్లో పట్టువిడుపులతో వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయోగాలకు అనువైన సమయం కాదు. నవగ్రహ శ్లోకాలను పఠించండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. మిత్రుల సహకారం అందుతుంది. ఆరంభశూరత్వం వద్దు. పెద్దల మద్దతు లభిస్తుంది. స్నేహాలు బలపడతాయి. వ్యాపారం లాభదాయకం. సంతోషాన్నిచ్చే వార్త వింటారు. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. మహాలక్ష్మిని ధ్యానించండి.
మిథున రాశి
మిథున రాశి ఉద్యోగులకు శుభ ఫలితాలు ఉన్నాయి. మీ నిర్ణయాలు నలుగురికీ ఆదర్శంగా నిలుస్తాయి. ఎదుగుదలకు సరైన సమయం. వినయంతో వ్యవహరించాలి. వ్యాపార విజయాలు సాధిస్తారు. సున్నితంగా సంభాషించండి. స్నేహితుల సాయంతో ఓ సమస్య నుంచి బయటపడతారు. త్వరలో ఓ విజయం సిద్ధిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం సూచితం. సకాలంలో పనులను ప్రారంభించండి. ఆర్ధిక ప్రగతి సాధిస్తారు. సంపద పెరుగుతుంది. మీ కలలు నిజం అవుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోకండి. చెడు ఆలోచనలు రానీయకండి. ఆత్మ బలంతోనే కార్యసిద్ధి సాధ్యం. మిత్రుల అండ లభిస్తుంది. ఓ శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని ఉపాసించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి అవసరానికి డబ్బు అందుతుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. నిర్ణయాల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి. దర్శబద్ధమైన మార్గంలోనే నడవండి. గ్రహదోషం అధికంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో సమస్యల్ని అధిగమించండి. కలహాలు సృష్టించేవారితో జాగ్రత్త. కొన్నిసార్లు లౌక్యం అవసరం. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.
కన్య రాశి
కన్య రాశి వారు మనోబలంతో విజయాలు సాధిస్తారు. సకాలంలో ప్రయత్నాలు ప్రారంభించండి. అధికారుల అండ లభిస్తుంది. కొన్ని నిర్ణయాల్ని కాలానికే వదిలేయడం ఉత్తమం. తోటివారితో స్నేహంగా మెలగాలి. ఓ పని పూర్తవుతుంది. వ్యాపారంలో ముందుచూపు అవసరం. ఆరోగ్యం జాగ్రత్త, ఈశ్వరుడిని ఆరాధించండి.
తుల రాశి
తుల రాశి వారికి వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ప్రగతిని సాధిస్తారు. ఉద్యోగ జీవితంలో తగిన జాగ్రత్తలు అవసరం. స్తోమతకు మించి అప్పులు చేయకండి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరుత్సాహం వద్దు. ఓ ఆపద నుంచి బయటపడతారు. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి. వేంకటేశ్వర స్వామిని ఉపాసించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన సమయం. మేలు జరుగుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. పెట్టుబడులకు తగిన సమయం. ఏకాగ్రతతో వ్యాపార విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సాధనకు సమయం కేటాయిస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తారు. ధర్మమార్గాన్ని విడిచిపెట్టకండి. మహాలక్ష్మిని ధ్యానించండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి వ్యాపారంలో కలిసొస్తుంది. ఉత్తమ ఫలితాలు ఉంటాయి. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. కొత్త నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో నిర్లిప్తత పనికిరాదు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. చిరునవ్వుతో సంభాషించండి. జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడిని ధ్యానించండి.
మకర రాశి
మకర రాశి వారికి లక్ష్మీకటాక్షం ఉంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. జీవిత లక్ష్యాల విషయంలో స్పష్టత వస్తుంది. ముఖ్య నిర్ణయాల సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త, చంచలత్వం పనికిరాదు. ఓ శుభవార్త వింటారు. శ్రీమహావిష్ణువును ఉపాసించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. కొన్నిసార్లు బుద్ధిచతురత అవసరం. గతంలోని అవరోధాలు తొలగిపోతాయి. సమాజానికి ఉపయోగపడే పని చేస్తారు. ఓ శుభవార్త వింటారు. మహాలక్ష్మిని ఆర్చించండి.
మీన రాశి
మీన రాశి వారు మనోబలంతో పనుల్ని ప్రారంభించండి. ఆర్ధిక విజయానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఒత్తిడికి గురికావద్దు. కొందరి కారణంగా విఘ్నాలు ఎదురవుతాయి. వాటిని లౌక్యంగా తప్పించుకోండి. ఆధ్యాత్మిక సాధన మరింత పెరగాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓ మంచి వార్త వింటారు. శివాలయాన్ని సందర్శించండి.
సంబంధిత కథనం
టాపిక్