Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది.. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి, సూర్యారాధన శుభప్రదం-today rasi phalalu mesha rasi to meena rasi april 14th monday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది.. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి, సూర్యారాధన శుభప్రదం

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది.. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి, సూర్యారాధన శుభప్రదం

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 14.04.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 14.04.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: చైత్ర, వారం : సోమవారం, తిథి : కృ. విదియ, నక్షత్రం : స్వాతి

మేష రాశి

మేష రాశి వారి పనులు సకాలంలో పూర్తవుతాయి. చేపట్టిన వ్యాపారం నిరాటంకంగా పూర్తవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సాహిత్యవేత్తలకు కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి.

మిథున రాశి

మిథున రాశి విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో పనుల్లో ఆలస్యం, వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రామరక్షా స్తోత్రం వినండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం తీసుకుంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. రుణ బాధలు కొంత తగ్గుతాయి. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. శివాలయాన్ని సందర్శించండి.

సింహ రాశి

సింహ రాశి వారి పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. సంతృప్తిగా ఉంటారు. సమా జంలో గుర్తింపు లభిస్తుంది. నలుగురికి సాయం చేస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. అధికారుల ఆదరణ ఉంటుంది. సూర్యారాధన శుభప్రదం.

కన్య రాశి

కన్య రాశి వారి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఊహించని ఖర్చుల మూలంగా పనులలో జాప్యం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు, కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కాలయాపన చేయకుండా పనులపై మనసు నిలపడం మంచిది. విష్ణు సహస్రనామాలు పఠించండి.

తులా రాశి

తులా రాశి వారి పిల్లలు చదువులో రాణిస్తారు. పైచదువులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కోర్టు కేసులలో అను కూల ఫలితాలు ఉంటాయి. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. పనులు నెరవేరుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొన సాగుతుంది. గణపతి ఆలయాన్ని సందర్శించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు విషయంలో వివాదాలు తలెత్తుతాయి. కోర్టు కేసులలో అను కూల ఫలితాలు ఉంటాయి. కుటుంబపెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. అధికారుల విమర్శలను ఎదుర్కొంటారు. లక్ష్మి, ధ్యానం శుభప్రదం.

మకర రాశి

మకర రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సహకారం లభి స్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగు తుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలి తాలు ఉంటాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. విందులకు హాజరవుతారు. విద్యార్థులకు మంచి సమయం. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.

మీన రాశి

మీన రాశి వారు ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపు తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శివారాధన శుభప్రదం.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk

సంబంధిత కథనం