రాశిఫలాలు (దిన ఫలాలు) : 13.04.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: చైత్ర, వారం : ఆదివారం, తిథి : కృ.పాడ్యమి, నక్షత్రం : చిత్ర
మేష రాశి స్త్రీ పురుషులు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయములు తీసుకొనవలెను. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఏదో ఒక విషయంలో ఇరుక్కున్నచో కోలుకోలేరు. వినాయక, సరస్వతి, చిత్రగుప్త పూజలు, నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. అవకాశం ఉన్నవారు జపదానములు చేయండి.
వృషభ రాశి స్త్రీ పురుషులు తొందరపాటు కలిగి ఉంటారు. కలహములకు తావు ఇవ్వరాదు. ప్రయాణములో అపశృతులు. అనారోగ్యము ఉన్నది. వ్యర్థ ప్రయాణములకు దూరంగా ఉండండి. అభివృద్ధి ఉన్నది. ప్రక్కనే సమస్యలు ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ ఆరాధన వలన అనుకూలత.
మిధున రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. గతంలోని తగాదాలు, కోర్టు సంబంధమైన విషయములు రాజీమార్గంలో పరిష్కరించుకొనగలరు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉండగలవు, అపవాదులకు, కొన్ని నిగ్రహ సంబంధమైన దోషాల నివారణకు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
కర్కాటక రాశి స్త్రీ పురుషులు ప్రతి విషయంలో పాజిటివ్ ఆలోచనతో ముందుకు సాగండి. వివాహ ప్రయత్నములు ఫలించుట, విందు వినోదములు. సంఘంలో గౌరవ మర్యాదలు. ప్రయత్న లోపము లేకుండా ముందుకు సాగండి. ఆర్థికంగా బాగుంది. అఖంద దీపారాధన, ఇష్ట దైవారాధన చేయండి.
సింహ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. పెద్దవారితో పరిచయాలు చక్కటి అనుభూతి కలుగుతుంది. ఆకస్మికంగా ధనం వస్తుంది. అనవసర విషయాలలో తలదూర్చిన ఆకస్మికంగా తగాదాలు రాగలవు. కోర్టు సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకొనగలరు. నవగ్రహ జపాలు, దానాలు ప్రదక్షిణలు చేయండి.
కన్య రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. కానీ మీ నిర్లక్ష్యం లేక స్నేహితులను నమ్మి బయట ప్రపంచంలో చెడు మాటలకు మోసపోవచ్చు. స్త్రీలోలురు అగుటకు అవకాశములున్నవి. కోర్టు సంబంధమైన సమస్యలు ఉన్నవి. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
తులా రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. చిక్కులు, చికాకులు, ప్రభుత్వం వారిచే ఒత్తిడి, గృహం మారుట, అనవసరం మాటలు పడుట లాంటివి జరగవచ్చు. ఉద్యోగస్తులపైన దాడులు జరగవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం హోమం చేయించండి. ప్రతిరోజు కుజ గ్రహ జపము చేయండి.
వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు సామాన్యముగా ఉంటుంది. అలా అని చింతించరాదు. అవమానములు శ్రమకు తగిన ఫలితము కనిపించదు. ఖర్చులు అదనంగా ఉన్నవి ఖర్చులను ముందు పొదుపు చేయండి. ఆర్భాటమునకు ఇది సమయం కాదు. వివాహ శుభములు ఒకదారికి రాగలవు. ఇష్టదేవత ఆరాధన చేయండి. అఖండ దీపారాధన చేయండి.
ధనస్సు రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో ఆటంకములు వున్నాయి. అలా అని భయపడరాదు. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు, అస్వస్థత, నిరాశ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అగాదములు కొంత ఊరట కలిగి ఉండండి. నవగ్రహ బాధలు ఉన్నవి గోచార దోషాలు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
మకర రాశి స్త్రీ పురుషులకు సహకారము, ఇతరులకు దగ్గర తీసుకొనగలిగినప్పుడు ముందుకు సాగుటలో అడ్డంకులు తొలగును. వృథా ప్రయాణములు చేయరాదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మీరు నిజము చెప్పి సలహాలు తీసుకొనండి. నవగ్రహ జపదానములు అవసరం ఉన్నది.
కుంభ రాశి స్త్రీ పురుషులకు కొంతవరకు అనుకూలంగా కనిపిస్తుంది. విదేశి చదువులు ప్రయాణములు దైవారాధనవలన ఉద్యోగ అవకాశం. మానసిక ఒత్తిడి తగ్గుటకు అవకాశమున్నది. చేయు వృత్తులలో అనేక సమస్యలు ఉండగలవు. నవగ్రహ ప్రదక్షిణలతో అనుకూలత.
మీన రాశి స్త్రీ పురుషులకు మనోవేదన, మానసిక ఒత్తిడి. ప్రతి విషయంలో తెలియని భయం కుటుంబ కలహములు. భార్యాభర్తలు తగాలు, అన్నదమ్ముల గొడవలు ఆస్తి సంబంధమైన వివాదములు ఉన్నవి. ఈ విపత్తు నివారణ నవగ్రహాలకు ప్రదక్షిణలు దానాలు అవసరం.
సంబంధిత కథనం
టాపిక్