నేటి రాశి ఫలాలు మే 9, 2025: ఈరోజు ఈ రాశి వారికి దైవ దర్శనాలు, దూర ప్రయాణాలు.. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు!-today rasi phalalu may 9th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు మే 9, 2025: ఈరోజు ఈ రాశి వారికి దైవ దర్శనాలు, దూర ప్రయాణాలు.. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు!

నేటి రాశి ఫలాలు మే 9, 2025: ఈరోజు ఈ రాశి వారికి దైవ దర్శనాలు, దూర ప్రయాణాలు.. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 09.05.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు మే 9, 2025 (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 09.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : శుక్రవారం, తిథి : శు. ద్వాదశి, నక్షత్రం : హస్త

మేష రాశి

మేష రాశి వారు కుటుంబ సభ్యుల ఆరోగ్య, అభివృద్ధి విషయలలోనూ దృష్టి సారిస్తారు. కుటుంబ, ఆహార, ఆర్థిక విషయాలలో, కొత్త వ్యక్తులతో వాగ్వాదాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఆత్మీయుల ఆరోగ్య, అభివృద్ధి కొరకు ఉద్వేగంతో కూడిన ఆలోచనలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో నిధానంగా వ్యవహరించండి. భవిష్య ప్రణాళికలను చర్చస్తూ నిర్ణయం తీసుకోవాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి వ్యాపార విస్తరణ, ప్రయాణాలు, భాగస్వామ్య వ్యవహారాల విషయంలో, జీవిత భాగస్వామి ఆరోగ్య సంతానము కారణంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. శ్రమ, విశ్రాంతి లోపం. ఈరోజు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతవరకు ఆగిన ఆర్థిక విషయాలు కొంత ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ఎవరి సహకారం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులతో మంతనాలు, కుటుంబంలోని సభ్యులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.

మిధున రాశి

మిధున రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు. నూతన గృహ, వాహనాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. రుణము లభిస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వారం మధ్యలో దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో నిర్లక్ష్యం తగదు. అనవసర, వృథా ఖర్చుల విషయంలో చూసి వ్యవహరించాలి. నూతన అవకాశాలు కలిగినా నిర్ణయ సామర్థ్యం లోపంతో పూర్తిగా సద్వినియోగం చేసుకోలేరు. కొలీగ్స్ తో, పెద్దలతో వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి వృత్తి విషయంలో ఆలోచనలు, వృత్తిపరంగా ఊహించని వ్యక్తుల సహకారం ఉంటుంది. ఆకస్మిక అవకాశాలు. సంతానం యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అత్మీయుల స్వార్థ ఆలోచనలు ఇబ్బందిని, ఘర్షణని కలిగిస్తాయి. ఆర్ధిక లాభతరమైన అంశాలలో ఎదురుచూస్తున్న వర్తమానాలు, స్థిరాస్తులు, భూములు కొనుగోలు విషయంలో తొందరపాటు వద్దు. కొత్త వ్యక్తులను, వారి ఆలోచనలను నమ్మే విషయంలో అచితూచి వ్యవహరిస్తూ అనవసర వ్యయములు, ప్రదోచాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి

సింహ రాశి వారికి మారు‌ ప్రయాణములకి అవకాశము. మీ ఆర్థిక అంశాలలో పెద్దల ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సలహా, సహకారం అవసరం. ఉన్నత విద్య కొరకు ఎదురు చూసే విద్యార్థులకి విద్యా విషయాల్లో పోటీల్లో కొంత సామాన్య ఫలితాలు. కొత్త పసులు మొదలు పెడతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు వలన మోసానికి అవకాశములు. మిత్రులుతో అభిప్రాయబేధాలు రాకుండా వ్యవహారించాలి.

కన్యా రాశి

ప్రయాణాలు చేసేటప్పుడు స్వార్థపూరితమైన వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండి. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తి మించిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాలలో అవకాశాలు రావచ్చు. విద్య సంబంధమైన విషయాల్లో అభివృద్ధి, అశించిన ఫలితాలు పొందుతారు. ఆత్మ శక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు, కమ్యూనికేషన్ విషయంలోనూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులతో, తోబుట్టువులతో విచారానికి దూరంగా ఉంచాలి. మాట్లాడేటప్పుడు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. మీ మీద మీరు శ్రద్ద తీసుకుంటారు. శత్రువులు మీద విజయాన్ని సాధిస్తారు.

తులా రాశి

తులా రాశి వారికి ఆర్థిక సంబంధమైన అంశాలలో ఆలోచనలు అనుకూలం. దూర ప్రదేశాలలో వ్యాపార విస్తరణ అంశాల గురించి ఆలోచిస్తారు. నూతన పరిచయాలు, మైత్రి బంధాలు బలపడతాయి. ఆరోగ్య, ప్రయాణ సంబంధ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఆత్మీయులు దూరం పెట్టే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకుంటారు. పోటీ పరీక్షలలో మిశ్రమ ఫలితాలు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు బందువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు ఈ రాశి వేరు ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, గురువుల యొక్క సహకారం ఉంటుంది. నూతన స్నేహ సంబంధాలకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన లాభం కన్నా, గౌరవం పెరుగుతుంది. ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చు నియంత్రణ అవసరం.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి సంతానం అవసరాల నిమిత్తం ఖర్చు ఎక్కువవుతుంది. వారి ఆరోగ్య, అభివృద్ధి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తి ప్రదేశంలో అధిక బాధ్యతలు, శ్రమ ఉన్నప్పటికీ అనవసర వ్యక్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. స్థిరాస్తుల పై పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం. రుణములు తీసుకునే ప్రయత్నాలు. ఇంతకుముందు మీ దగ్గర రుణములు తీసుకున్న వారు సమయానికి చెల్లించకపోవడంతో ఇబ్బందులు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలోనూ, దూరవిద్య, న్యాయ సంబంధ విషయంలోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు, ఇబ్బంది కలిగించే అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.

మకర రాశి

స్తిరాస్తులు, వ్యవసాయ సంబంధ పెట్టుబడుల కొరకు, స్వగ్రామ సందర్శన కొరకు తల్లితో సంప్రదిస్తారు. ఆలోచనలు ప్రతిపాదించుటలో అలస్యం కాకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. విద్య సంబంధమైన విషయాల కొరకు, నూతన విషయాలు గ్రహించుటలో శ్రమ పడతారు. విద్యార్థులు జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి శ్రీ హయగ్రీవాయ నమ: అనే మంత్రం జపించుట మేలు. సంతానం అభివృద్ధి విషయంలోని, ఇంతకు ముందు పెట్టుబడులు, ఇన్వెస్టెంట్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మీయ వ్యక్తులతో విందు వినోదాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. వారికి బహుమానాల కొరకు, ప్రయాణాలు కొరకు అనుకోని ఖర్చులు చేస్తారు.

కుంభ రాశి

కుంభ రాశి వారు నూతన ఆలోచనలని అమలు పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయంలో సామర్థ్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు. దూర ప్రదేశాలలో ఇంటర్వ్యూలు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో పోటీలలో అనుకున్న ఫలితాలు. స్థిరాస్తులు అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ అనవసర ఆలోచనలతో హృదయాందోళన. సంతానముతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీ ఆలోచనలకి వారి ఆలోచనలకి సమున్నయం లేకపోవడం వల్ల చికాకులు, ముఖ్యంగా మగ పిల్లల అభివృద్ధి విషయంలోనూ, స్నేహముల విషయంలోనూ శ్రద్ద తీసుకుంటారు.

మీన రాశి

మీన రాశి వారు ఈరోజు కుటుంబంతో కలిసి చర్చలు జరుపుతారు. ఆర్థిక సంబంధాలలో ఆలోచనలు ఉంటాయి. ఎక్కువ శాతం సోషల్ మీడియా, స్క్రీన్ టైమ్ తో సమయాన్ని వృధా చేసుకోకుండా కంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, దైవ దర్శనం దూర ప్రయాణాలు, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు. స్థిరాస్తుల విషయంలో తోబుట్టువులతో వాదనలకు దూరంగా ఉండాలి. సామర్థ్యం, పరాక్రమం పెరుగుతాయి. మిత్ర బృందం సహకరిస్తారు. రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వారి మీద విజయాన్ని సాధిస్తారు. భూవిషయాలలో సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్లాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000