హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 25.05.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: వైశాఖ, వారం : ఆదివారం, తిథి : కృష్ణ పక్షం త్రయోదశి , నక్షత్రం : ఉత్తరాషాఢ
మేష రాశి వారి కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు నిలకడగా ఉండవు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. మొండిగా యత్నాలు సాగిస్తారు. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పనుల్లో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు.
గ్రహస్థితి నిరాశాజనకం. మనోదైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. చిన్న విషయానికే చికాకు పడతారు. సామరస్యంగా మెలగండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పత్రాలు అందుకుంటారు. వేడుకకు హాజరు కాలేరు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
మిధున రాశి వారికి లావాదేవీలతో తీరిక ఉండదు. ప్రలోభాలకు లొంగవద్దు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మనోధైర్యం కోల్పోవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పత్రాల రెన్యూవల్లో ఆలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.
కర్కాటక రాశి వారు తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. కొత్త యత్నాలు మొదలెడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఒక సమాచారం అందోళన కలిగిస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశం సందర్శిస్తారు.
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ధనం పొదుపుగా ఖర్చు చేయండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి.
కన్యా రాశి వారికి శుభ సమయం ఆసన్నమైంది. అవకాశాలు కలిసివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. యత్నాలు కార్యరూపం దాల్చుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ సమస్యలను ఆప్తులకు తెలియజేయండి. వేడుకకు హాజరవుతారు.
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణవిముక్తులవుతారు. ఖర్చులు విపరీతం. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. సోమవారం నాడు ఆప్రియమైన వార్త వినాల్సి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
వృశ్చిక రాశి వారికి కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. వెండి, బంగారాలు జాగ్రత్త.
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కొత్త యత్నాలు మొదలెట్టండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.
మకర రాశి వారు ఆర్థికంగా పురోగమిస్తారు. పొదుపు ధనం అందుతుంది. అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహసంబంధాలు వెల్లివిరుస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, దళారులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు.
కుంభ రాశి వారికి విశేష ఫలితాలున్నాయి. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. స్థిరచరాస్తుల వ్యవహారంలో పునరాలోచించండి. తొందరపాటు నిర్ణయం తగదు. న్యాయనిపుణుల సలహా పాటించండి.
మీన రాశి వారి కార్యం సిద్ధిస్తుంది. సమస్యలను దైర్యంగా ఎదుర్కొంటారు. మీ కృషి స్పూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తికాగలవు. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. వాయిదాల చెల్లింపుల్లో ఆస్రద్ధ తగదు. అపరిచితులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రలోభాలకు లొంగవద్దు. పత్రాలు అందుకుంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ-9494981000
టాపిక్