హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 24.05.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: వైశాఖ, వారం : శనివారం, తిథి : ద్వాదశి, నక్షత్రం : రేవతి
మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోవడం వల్ల సానుకూల ఫలితాలను సాధిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. నిత్యం సుబ్రహ్మణ్య పశుపతి కంకణం రూపం ధరించడం వలన మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఏర్పడిన ఇబ్బందులు, సమస్యలు తీరిపోతాయి.
ఈ రాశి వారికి ఈ రోజు సంతాన పురోగతి బాగుంటుంది. బ్యాంకు రుణాలు తీసుకుంటారు. నానారకాల అరిష్టాలు, ఇబ్బందులు, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్ ఉపయోగించండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీకు ఏ మాత్రం సంబంధం లేని వివాదాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా పోటీ ఏర్పడుతుంది.
మిథున రాశి వారు ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. నిత్యం నల్లవత్తులతో అష్టమూలికా తైలం కలిపి దీపారాధన చేయడం వలన శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఎవరినీ నొప్పించకుండా అందరికీ న్యాయం చేస్తారు.
సంతానం, నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలను పంచుకుంటారు. నిత్యం సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయండి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. అవసరాలకు డబ్బు అందుతుంది.
సింహ రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మహాతీర్ధం పొడిలో చేసే అభిషేకాలు, పూజలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఋణాలు మంజూరు అవుతాయి. మొండి సమస్యలు తీరిపోతాయి. వ్యాపారంలో రొటేషన్ సంతృప్తికరంగా ఉంటుంది.
కన్యా రాశి వారికి వ్యాపార సంబంధమైన విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి. ఐశ్వర్యనాగిని ఉపయోగించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సంతానం అభివృద్ధి చెందడం, వాళ్ల వలన పేరు ప్రతిష్ఠలు రావడం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్న అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. రావలసిన బాకీలు కొద్దికొద్దిగా జమ చేసుకుంటారు.
అసలు గురించే మీ ఆందోళన. వడ్డీల మీద ఆశ పెట్టుకోరు. అరటి నారవత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం అన్ని విధాలా మంచిది. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. గతం గుర్తుకు వస్తే, ఇప్పుడు ఎంత బాగున్నామో అర్థమవుతుంది. రాజకీయ, కళారంగాలలోని వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు.
వృశ్చిక రాశి వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. నిత్యం సర్వదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయడం వలన గ్రహాల వలన కలిగే బాధలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరిస్తారు.
ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఋణాలు కొంతవరకు తీరుస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. నిత్యం యజ్ఞభస్మాన్ని ధరించడం వలన యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.
కలియుగధర్మానికి ఇది పరాకాష్ఠ. వివాహం చేసుకోవడంతోనే అన్ని బంధాలు తెగిపోతాయా? స్వేచ్ఛ నశించిపోతుందా? జన్మనిచ్చిన వారికి, తోడబుట్టిన వారికి సహాయం చేయడం నేరం అవుతుందా? మొదలైన ప్రశ్నలకు అంతరాత్మ, మనస్సు సమాధానం చెప్పదు. సంతానం పురోగతి బాగున్నప్పటికీ, వారిలో ఒకరి ప్రవర్తన ఇబ్బందికరంగా మారుతుంది. నిత్యం సర్పదోష నివారణ కంకణం ధరించండి.
కుంభ రాశి వారు శుభకార్యాల విషయంలో కఠినంగా, దృఢంగా వ్యవహరిస్తారు. నానారకాల అరిష్టాలు, ఇబ్బందులు, శత్రుబాధలు, బాధలు నశించటానికి త్రిశూల్ ఉపయోగించండి. నూతన అవకాశాలు చక్కగా ఉపయోగించుకుంటారు. మీ పాండిత్యం అందరి చేత ప్రశంసించబడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉన్నా ఏదో అసంతృప్తి వెన్నాడుతుంది. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. చురుగ్గా వ్యవహరిస్తారు.
ప్రతి పనిని క్రమపద్ధతిలో నిర్వహిస్తారు. విద్యార్థినీ, విద్యార్థులు నిత్యం సరస్వతీ తిలకాన్ని నుదుట ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపాన్ని మెడలో ధరించడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనాన్ని కన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. సంతాన విషయంలో మీరు ఆనందించే విధంగా శుభ సమాచారం వింటారు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 9494981000
టాపిక్