నేటి రాశి ఫలాలు మే 23, 2025: ఈరోజు ఈ రాశి వారికి.. ఉద్యోగాల్లో గుర్తింపులు, అనుకూలతలతో పాటు సంతానం నుంచి శుభవార్తలు!-today rasi phalalu may 23rd 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు మే 23, 2025: ఈరోజు ఈ రాశి వారికి.. ఉద్యోగాల్లో గుర్తింపులు, అనుకూలతలతో పాటు సంతానం నుంచి శుభవార్తలు!

నేటి రాశి ఫలాలు మే 23, 2025: ఈరోజు ఈ రాశి వారికి.. ఉద్యోగాల్లో గుర్తింపులు, అనుకూలతలతో పాటు సంతానం నుంచి శుభవార్తలు!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 23.05.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 23.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : శుక్రవారం, తిథి : ఏకాదశి, నక్షత్రం : ఉత్తరాభాద్ర

మేష రాశి

మేష రాశి వారికీ గ్రహ సంచారాలు ఉపకరించగలవు. ప్రయత్నిత కార్యములు అనుకూలిస్తాయి. ఖర్చుల్ని సమర్థించుకొనునట్లు ఆదాయాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణతలు కొనసాగుతాయి. వ్యాపారాల్లో మధ్యమ ఆదాయాలు ఉంటాయి. చెల్లింపుల్ని పూర్తిచేసుకోగలరు. సమయపాలనపై దృష్టి పెట్టుకోండి. కుటుంబంలో ఉత్సాహమిచ్చే సంఘటనలుంటాయి. సుబ్రహ్మణ్యారాధన మరింత ఉపకరించగలదు.

వృషభ రాశి

గ్రహ సంచారాలు అనుకూలం. ప్రయత్నిత కార్యములందు జయం, ఉత్సాహమునిచ్చే సంఘటనలు, ఆధ్యాత్మికతలకు ప్రత్యేక సమయ కేటాయింపులుంటాయి. ఆదాయ మార్గాల్ని కొత్తగా అన్వేషించగలరు. గత సమస్యలకు పరిష్కారాలు ఏర్పరచగలరు. వివాహాది శుభకార్య యత్నాలకు ముందడుగు వేయగలుగుతారు. స్పెక్యులేషన్ రంగాల్లో రాణింపు ఉంటుంది.

మిథున రాశి

మిథున రాశి వారు గతంతో పోల్చితే అనుకూల స్థితులను చూస్తారు. పట్టుదల చూపుకోవాలి. ఉద్యోగాల్లో గుర్తింపులు, అనుకూలతలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సంతృప్తిని ఏర్పరచుకోగలరు. వృత్తి, వ్యాపారాల్లో చెల్లింపులు పూర్తి చేసుకోగలుగుతారు. వాగ్విషయాల్లో తొందరతనం చూపకండి. దానధర్మములను గోప్యంగా నిర్వహిస్తారు. సంతానం నుండి మంచి వార్తలు వినగలరు.

కర్కాటక రాశి

మానసిక సంతృప్తి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో చేదు అనుభవాలను దూరం చేసుకోగలరు. ఆధ్యాత్మికతలు కొనసాగి, విశేష గ్రంథపఠనములు చోటుచేసుకుంటాయి. స్వల్ప అనారోగ్య స్థితులున్నా నిత్యకృత్యములు సమయానుకూలంగా సాగగలవు. ఇతరుల పట్ల వ్యవహారాల్లో చులకణ భావాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రుల కలయికలుంటాయి.

సింహ రాశి

సింహ రాశి వారు కుటుంబ వ్యవహారాల్లో సంయమనాలు చూపుకోవాలి. అవకాశాలు కలసివస్తాయి. కొంత మొత్తమైన రుణమును తీర్చగలుగుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నూతన అలంకరణ విషయాలపై దృష్టి పెట్టగలరు. పెద్దవారిపట్ల ఆసక్తి చూపుకోగలరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉత్సాహాలు పొందగలరు. సంతానంలో ఒకరికై ఎక్కువ ఆలోచనలు చేయవలసి రావచ్చును.

కన్య రాశి

కన్య రాశి వారు కుటుంబంలో ఏకవాక్యతలచే ఉత్సాహాలు చూస్తారు. ఆరోగ్యపరంగా చిన్నతరహా జాగ్రత్తలు అవసరం. ఆస్తిపరమైన వ్యవహారాల్లో అభీష్ట సిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రూకులై వ్యవహరించుకోండి. ఋణభారములను పెంచవలసి రావచ్చును. ప్రయాణాలను, పెట్టుబడులను వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలలో నూతన అగ్రిమెంట్లను పూర్తిచేసుకోగలుగుతారు.

తుల రాశి

తుల రాశి వారు నూతనమైన పనులను చేపట్టి పూర్తిచేసుకోగలుగుతారు. మనోధైర్యములు సిద్ధించి ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు. ఆర్థిక అవసరాల పట్ల ముందుచూపు ఉపకరిస్తుంది. చెల్లింపులు పూర్తిచేసుకుంటారు. విదేశీ ప్రయాణాలకై యత్నించువారికి ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి. వాగ్విషయాల్లో మెప్పును, గుర్తింపును ఏర్పరచుకోగలరు.

వృశ్చిక రాశి

స్వల్ప అనారోగ్య సమస్యలు, ఆర్థిక లోటు ఉన్నా సమర్థత చూపగలుగుతారు. ప్రతి పనికీ ఎక్కువ శ్రమ చూపవలసి ఉంటుంది. వివాహ, ఉద్యోగ, స్థిరీకరణలు ఉంటాయి. తోటి విద్యార్థుల కంటే మేటిగా పరీక్షలందు రాణించగలుగుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చెల్లింపులను పూర్తి చేసుకోగలుగుతారు. అగ్రిమెంట్లందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు మిశ్రమ ఫలితాలు చూస్తారు. ఆర్థిక సర్దుబాట్లు అవసరం. నూతన పనులను ప్రారంభించి పూర్తిచేసుకోగలుగుతారు. ఇతరుల నుండి ఆశించినవి పొందుతారు. బంధుమిత్రులతో ఉత్సాహాలు పంచుకోవడం, వారి శుభకార్యములందు పాల్గొనడం జరుగుతుంది. వ్యాపారాలలో శ్రమలు ఎక్కువగా గోచరిస్తాయి. అదనపు ఋణ స్వీకారాలకు దూరంగా ఉండటం మంచిది.

మకర రాశి

మకర రాశి వారు ఊహించని విధంగా కార్యానుకూలతలు ఏర్పరచుకోగలుగుతారు. అవకాశాలు కలసివస్తాయి. స్థిరమైన ఆలోచనలు ప్రదర్శించగలుగుతారు. మీ కుటుంబంలో స్వల్ప అనారోగ్యములున్నా సామాన్యతలకు ఇబ్బంది ఉండదు. తోటి ఉద్యోగులు, వ్యాపారుల మధ్య సయోధ్యను ఏర్పరచుకోగలుగుతారు. దూర ప్రయాణాలను తలపెట్టుకోగలరు. నిరుద్యోగులకు మంచి వార్తలుంటాయి.

కుంభ రాశి

ఊహించని విధంగా పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అవకాశాలు కలసివస్తాయి. శుభకార్య ఆహ్వానాలు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో గత ఇబ్బందులను దూరం చేసుకుంటారు. కుటుంబ వ్యక్తులచే సహకారాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో చిన్నతరహా ఆశాజనక పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వాలు ఏర్పడతాయి.

మీన రాశి

మీన రాశి వారి పనులు జాప్యంతో పూర్తవుతాయి. సొంత ఆలోచనలకన్నా ఆత్మీయుల సలహాలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూడగలుగుతారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమలు ఉన్నా ఆశాజనకంగా వ్యవహరించగలుగుతారు. ఖర్చులందు అనవసరమైనవి ఉంటాయి. విద్యార్థులకు కళాశాల ప్రవేశాలు అనుకూలిస్తాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000

ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.