నేటి రాశి ఫలాలు మే 21, 2025: ఈరోజు ఈ రాశి వారు పది మందికీ ఉపయోగపడే పనులు చేస్తారు, వ్యాపార విజయాలు సాధిస్తారు!-today rasi phalalu may 21st 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు మే 21, 2025: ఈరోజు ఈ రాశి వారు పది మందికీ ఉపయోగపడే పనులు చేస్తారు, వ్యాపార విజయాలు సాధిస్తారు!

నేటి రాశి ఫలాలు మే 21, 2025: ఈరోజు ఈ రాశి వారు పది మందికీ ఉపయోగపడే పనులు చేస్తారు, వ్యాపార విజయాలు సాధిస్తారు!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 21.05.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : బుధవారం, తిథి : నవమి, నక్షత్రం : శతభిషం

మేష రాశి

మేష రాశి వారికి శుభప్రదమైన సమయం. ధనయోగం ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గుర్తింపును, గౌరవాన్ని సాధిస్తారు. పూర్వపుణ్యం కాపాడుతుంది. కలహాలకు ఆస్కారం ఇవ్వకండి. ఏకాగ్రతతో వ్యాపార సమస్యలను అధిగమిస్తారు. ఓ శుభవార్త వింటారు. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారు వేగంగా పనులు జరుగుతాయి. శుభయోగం ఉంది. సంపదలు పెరుగుతాయి. ఆర్థిక వనరులను పొదుపు-మదుపు దిశగా మళ్లించాలి. ఏకాదశంలోని శుక్రయోగం మేలు చేస్తుంది. ముఖ్య విషయాల్లో స్పష్టత వస్తుంది. పెద్దల సాయం అందుతుంది. సమాజంలో పేరు తెచ్చుకుంటారు. చెడు ఆలోచనలు వద్దు. శ్రీలక్ష్మిని దర్శించుకోండి.

మిథున రాశి

ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. అనూహ్య విజయాలు సాధిస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పరిధిని విస్తరిస్తారు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. కీలక నిర్ణయాల్లో ఆరంభశూరత్వం వద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఓ శుభవార్త వింటారు. పరమేశ్వరుడిని ధ్యానించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి అదృష్టం వరిస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. సూర్యుడి శుభదృష్టితో ఆరోగ్యయోగం సిద్ధిస్తుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. భాగ్య శుక్రయోగం మేలు చేస్తుంది. ముఖ్య ఆర్థిక వ్యవహారాలను మీ నియంత్రణలో ఉంచుకోండి. మహావిష్ణువును పూజించండి.

సింహ రాశి

మిశ్రమ కాలం నడుస్తోంది. ఆర్థిక ఫలితాలు అనుకూలం. రుణ సమస్యలతో జాగ్రత్త. శక్తికి మించిన భారాన్ని భుజాన వేసుకోకండి. మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపార నిర్ణయాల్లో తక్షణ స్పందన అవసరం. కొత్త ప్రయత్నాలకు సరైన సమయం కాదు. నవగ్రహాలను ధ్యానించండి.

కన్య రాశి

కన్య రాశి వారు ధైర్యంగా కొత్త పనులు ప్రారంభించండి. లక్ష్య సాధనలో ఆరంభశూరత్వం వద్దు. చెడు ఫలితాలను ఊహించుకోకండి. అధికారుల మద్దతు లభిస్తుంది. సమయ స్ఫూర్తితో ఆటంకాలను అధిగమిస్తారు. ప్రశాంతంగా వ్యవహరించండి. ఓ శుభవార్త వింటారు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

తుల రాశి

తుల రాశి వారు మనోబలం విజయాల వైపు నడిపిస్తుంది. ముఖ్యమైన పనులను మధ్యలోనే ఆపేయకండి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి. పట్టువిడుపులు అవసరం. కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకంగా వెనకడుగు వేయాల్సి వస్తుంది. రుణ సమస్యల విషయంలో జాగ్రత్త. నవగ్రహ శ్లోకాలు పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి అదృష్టయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కలిసొస్తుంది. నలుగురి ప్రశంసలు లభిస్తాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తుతో ముడిపడిన నిర్ణయాలు తీసుకోండి. ధనలాభం గోచరిస్తోంది. స్థిరాస్తుల కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. దైవబలం నడిపిస్తుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. గృహనిర్మాణం కొలిక్కి వస్తుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. వాహనయోగం ఉంది. ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆగిపోయిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. విమర్శలను పట్టించుకోవద్దు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకర రాశి

మకర రాశి వారికి శుభకాలం కొనసాగుతోంది. దీర్ఘకాలిక స్వప్నం సాకారం అవుతుంది. ఏకాగ్రతతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పదిమందికీ ఉపయోగపడే పనులు చేస్తారు. వ్యాపార విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సంప్రదింపులతో నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. లక్ష్మీదేవిని ఉపాసించండి.

కుంభ రాశి

ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. కొన్ని నిర్ణయాల్లో దూకుడు అవసరం. భూ లాభం సూచితం. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. దీర్ఘకాలిక అన్వేషణ ఫలిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మితంగా, హితంగా సంభాషించండి. మేలు జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మీన రాశి

మీన రాశి వారు అత్యుత్తమ కాలం నడుస్తోంది. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. ధనలాభం గోచరిస్తోంది. తక్షణ స్పందనతో ఉద్యోగ సమస్యలను అధిగమిస్తారు. బాధ్యతల నిర్వహణలో నలుగురినీ కలుపుకుని వెళ్లండి. సున్నితంగా సంభాషించండి. మనోబలం అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.