రాశిఫలాలు (దిన ఫలాలు) : 20.05.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: వైశాఖ, వారం : మంగళవారం, తిథి : అష్టమి, నక్షత్రం : ధనిష్ట
మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఎరుపు, గులాబీ రంగులు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తుల సహాయ సహకారాలు పొందుతారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట పొందుతారు. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. పారిశ్రామిక వర్గాలకు భాగస్వాముల నుంచి సమస్యలు పరిష్కారమవుతాయి. అనారోగ్యం, కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
మిథున రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అలసత్వం చూపక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
కర్కాటక రాశి వారు అనుకున్న పనులు తక్షణం పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాల కొనుగోలు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. రాజకీయ వర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. ధనవ్యయం, బంధువులతో విభేదాలు కలగవచ్చు. ఎరుపు, నేరేడు రంగులు అనుకూలం. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.
సింహ రాశి వారు ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు అనుకోని విధంగా లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామిక వర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. ధనవ్యయం, బంధువులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.
తులా రాశి వారు పనుల్లో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట కలుగుతుంది. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యయప్రయాసలు, అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
వృశ్చిక రాశి వారు నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పోస్టులు దక్కవచ్చు. ధనవ్యయం, స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
అనుకున్న పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో కొనసాగి లాభాలు అందుకుంటాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. ధనవ్యయం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మకర రాశి వారు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఏదో విధంగా కొంత సొమ్ము లభించి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ వర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. శుభవార్తలు, ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు అందుకుంటాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు అనుకూలం. శివాష్టకం పఠించండి.
మీన రాశి వారి సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సజావుగా సాగి లాభాల బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు కలగవచ్చు. గులాబీ, నేరేడు రంగులు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000
టాపిక్