రాశి ఫలాలు (దిన ఫలాలు) : 17.05.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: వైశాఖ, వారం : శనివారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : పూ. షాడ
మేష రాశి వారికి దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. లక్ష్మీప్రదమైన ముఖానికి, ఐశ్వర్య ప్రాప్తికి, ఈ లక్ష్మీ చందనం ధరించడం వలన మేలు జరుగుతుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. రుణాలు తీరుస్తారు.
వృషభ రాశి వారు పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రతి నిత్యం సర్పదోష నివారణ చూర్ణముతో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయటం వలన గ్రహాల వలన కలుగు బాధలు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. పెట్టుబదులకు తగిన లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.
సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నాగబంధాన్ని ఉపయోగించండి. సమస్త దుష్టశక్తులకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి నుండి ధనసహాయం అందుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. హనుమాన్ సింధూరంతో ఆంజనేయస్వామి వారికి పూజ చేయించి, ధరించడం మంచిది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు మీ చెంతకు వస్తాయి.
దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. రుణ ఒత్తడిల నుండి బయటపడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. పరిమళ సిద్ధ గంధాక్షతలతో పూజ చేయటం అన్ని విధాలా మంచిది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
రాజకీయ, కళా, పారిశ్రామికరంగాలలోని వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. ఓం నమో శివాయ వత్తులు అష్టమూలిక తైలంతో కలిసి దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కాంట్రాక్టులు, టెండర్లు లాభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.
తుల రాశి సంతానం సాంకేతికపరమైన విద్యావకాశాలు పొందుతారు. నిత్యం హనుమాన్ వత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన నరదృష్టి, శత్సపీద మొదలగునవి నశిస్తాయి. ప్రభుత్వపరంగా, వ్యక్తులవరంగా రావలసిన ప్రయోజనాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా వుంటుంది.
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా, సూర్య నమస్కారాలు చేయండి. దీర్ఘకాలిక ఋణాలు తీరుతాయి. వ్యాపారాలు, లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగులకు హెూదాలు దక్కుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు.
ధనస్సు రాశి వారికి కొంతకాలంగా వేధిస్తున్న సమస్య తీరుతుంది. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పట్టుదలతో ముందుకు సాగుతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నానారకాల అరిష్టాలు, ఇబ్బందులు, శత్రు బాధలు, బాధలు నశించడానికి త్రిశూల్ ఉపయోగించండి. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.
దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. సుమంగళి పసుపుతో, ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవిని పూజించడం అన్ని విధాలా శ్రేయస్కరం. ముఖ్యమైన వ్యవహారాలు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి.
కుంభ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. వ్యాపారంలో నూతన మార్పులు, చేర్పులు కలిసి వస్తాయి. ప్రజాధరణ బాగుంటుంది. ప్రచార సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిత్యం లక్ష్మీ తామర వత్తులతో అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయటం వల్ల మేలు జరుగుతుంది.
అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగుతారు. కారణాలు ఏమైనా వృత్తి ఉద్యోగ విషయాలలో కఠినంగా ప్రవర్తిస్తారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలా మందికి నచ్చదు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు గట్టి పోటీని, విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. నిత్యం శక్తి కంకణం ధరించటం అన్ని విధాలా శ్రేయస్కరం.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000