నేటి రాశి ఫలాలు మే 16, 2025: ఈరోజు ఈ రాశి విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం!-today rasi phalalu may 16th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు మే 16, 2025: ఈరోజు ఈ రాశి విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం!

నేటి రాశి ఫలాలు మే 16, 2025: ఈరోజు ఈ రాశి విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 16.05.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 16.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : శుక్రవారం, తిథి : కృ. చవితి, నక్షత్రం : మూల

మేష రాశి

మేష రాశి వారి గ్రహసంచారాలు ప్రతికూలంగా ఉన్నా పనులను నెమ్మదిగా పూర్తి చేసుకుంటారు. అవసరాలను సమర్థించుకొనునట్లు ఆదాయాలుంటాయి. అనారోగ్య కారణాలు ఉంటున్నా హుషారుతనం చూపగలుగుతారు. సంతాన అవసరాల్ని తీర్చగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలకు ప్రాధాన్యత నిచ్చి ప్రణాళికాయుతముగా సాగాలి. కుటుంబ వ్యక్తులనుండి సహకారాలు ఉంటాయి.

వృషభ రాశి

గతం కంటే హుషారుగా వ్యవహరించుకుంటారు. కుటుంబంలో ఉత్సాహ పరచు వార్తలుంటాయి. కొత్తవైన పనులను చేపట్టుకోగలరు. రాని బకాయిలు వంటివి వసూలవ్వగలవు. చెల్లింపులు, ఋణములు పూర్తి చేసుకొనేందుకు అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను దూరం చేసుకోగలరు. విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి.

మిథున రాశి

మిథున రాశి వారు వాగ్విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేస్తూ వ్యవహరించుకోండి. ప్రయత్నకార్య అనుకూలతలుంటాయి. అవసరాలను సమర్థించు కొనునట్లు ఆదాయాలుంటాయి. కీలకమైన అంశాలగు కాంట్రాక్టులు, కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండుట మంచిది. వాహన, గృహోపకరణాదులు రిపేర్లకు రాగలవు. విద్యార్థులకు వ్యాసంగాలు అనుకూలం.

కర్కాటక రాశి

మీరు అన్నిటా పట్టుదలలను చూపుకోవలసి వుంటుంది. రోజులు హుషారుతనం లేనివిగా సామాన్యంగా సాగుతాయి. ఖర్చులు ఊహించుకొన్న దాని కంటే పెరగగలవు. కుటుంబంలో ఒంటరితనపు భావనలు ఉంటాయి. ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూస్తారు. వృత్తి, వ్యాపారులకు ఆదాయాలు అంతంత మాత్రంగా ఉంటూ చెల్లింపులు భారమనిపించగలవు. ఓరిమితో వ్యవహరించుకోవాలి.

సింహ రాశి

సింహ రాశి వారికి గ్రహ సంచారాలు తేలికపాటి ఉత్సాహమునిస్తాయి. మీకు ప్రతికూల అంశాలు ఉంటూవుంటాయి. బాధ్యతాయుతముగా వ్యవహరించు కోవాలి. ఆదాయ వ్యయాలకు ముందుచూపు తప్పనిసరి చేయండి. స్నేహవర్గంచే ప్రయోజనాలు పొందగలరు. తోటివారి వ్యవహార శైలిలో మార్పులు గమనించుకోవాలి. సంతాన వ్యవహారాలు సంతృప్తిని ఇస్తాయి.

కన్య రాశి

కన్య రాశి వారు అధికారులతో సంయమనములు పాటిస్తూ, వృత్తి, ఉద్యోగాల్లో క్రమ శిక్షణాయుతంగా సాగండి. ఇంటా బయటా సహకరించు వ్యక్తులు పెరుగుతారు. అనారోగ్యభావనలకు ముందు జాగ్రత్తలు అవసరం. తరచుగా ప్రయాణాలు చేయవలసి వుంటుంది. బాధ్యతలు ఇతరులకు అప్పగించకండి. ఆహార విరామాదులందు కాలనియమములు తప్పనిసరి చేసుకోండి. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం.

తుల రాశి

తుల రాశి వారు ఆర్థికపరమైన జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. ఉత్సాహకరముగా వ్యవహరించుకోగలరు. అవకాశాలు కలసివస్తాయి. కార్యలాభములు పొందగలరు. నూతన వాహన, యంత్ర సౌకర్యాలను ఏర్పరచుకుంటారు. స్నేహవర్గపు రాకపోకలు ఉంటాయి. కృతజ్ఞతా భావాలను పొందుతారు. అగ్రిమెంట్లు, ఒప్పందాలు వంటి రెన్యువల్స్ పూర్తి చేసుకోగలరు. విద్యార్థులు వ్యాసంగాలకు పట్టుదలలు చూపుకోవాలి.

వృశ్చిక రాశి

గ్రహ సంచారములో మార్పులు నెమ్మదిగా ఉపకరించగలవు. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణతలు కొనసాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. ఋణదాతలచే ఒత్తిడులుండు సూచనలు గలవు. ఆదాయాలు అనుకూలమైనా ఖర్చులెక్కువగా ఉండగలవు. క్రయవిక్రయాల్లో అంచనాలు కలసి రాక చికాకుతనములు పొందు సూచనలు గలవు. విద్యార్థులకు అనుకూల సమయం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు అన్నిటా జాగ్రత్తలు తప్పనిసరి చేయాలి. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాలుండకుండా జాగ్రత్తలు పాటించాలి. సంతాన వ్యవహారాల్లో సమయ, ధన కేటాయింపులు ఎక్కువ చేయవలసి రావచ్చు. మాతా పితరుల సేవా భాగ్యాలు ఏర్పడగలవు. భ్రాతృవర్గంతోను, తోటివారితోను తగుమాత్రంగా వ్యవహరించుకోవాలి. ఆధ్యాత్మికతకు సమయ కేటాయింపులు చేసుకోలేకపోతారు.

మకర రాశి

క్రమంగా అనుకూలతలు ఏర్పరచుకోగలరు. సాధించాలనే పట్టుదలలు పెరుగుతాయి. పరిచయస్తులను పెంచుకుంటారు. కుటుంబంలో చిన్నతరహా వైద్య సహాయాలు అవసరమవ్వగలవు. స్థిరాస్తుల క్రయవిక్రయాలకు దూరంగా ఉండుట మంచిది. సంతానమును సమర్థించుకోవలసిన స్థితులుంటాయి. వివాహాది స్థిర నిశ్చయాల్లో నిశ్చయాల్లో వేచివుండు విధానాల్ని పాటించుకోవాలి.

కుంభ రాశి

ప్రయత్న కార్యములు జాప్యంపై అనుకూలించగలవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మొహమాటాలకు తావివ్వక సాగండి. ఎవరికీ హామీ ఉండక లౌక్యంగా సాగాలి. వాహన మార్పులు చేసుకోగలరు. పెంపుడు జంతువులపట్ల మక్కువను ఏర్పరచుకోగలరు. వృత్తి, ఉద్యోగ మార్పులు కోరుకోకుండుట మంచిది. విద్యార్థులు పునశ్చరణలకు ప్రాధాన్యతను ఇచ్చుకోవాలి.

మీన రాశి

మీన రాశి వారు బంధు మిత్రులనుండి శుభవార్తలు వింటారు. ఆదాయాలున్నా అవసరాల్ని సమర్థించుకొనుటకు రుణములు చేయవలసి వస్తుంది. నూతన కాంట్రాక్టులు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలు సాధారణంగా సాగగలవు. గత అనుభవాలు గుర్తుచేసుకొంటూ కొన్ని అవకాశాలను జారవిడచుకొను సూచనలున్నాయి. అనారోగ్య భావనలు తగ్గుతాయి. విద్యార్థులకు వ్యాసంగాలు అనుకూలం.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.