రాశిఫలాలు (దిన ఫలాలు) : 15.05.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: వైశాఖ, వారం : గురువారం, తిథి : కృ. తదియ, నక్షత్రం : జ్యేష్ట
మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయ త్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణం, భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ముందు కుసాగుతాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్యసా ఫల్యం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. శివాలయాన్ని సందర్శించండి.
వృషభ రాశి వారు వృత్తిలో రాణిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తిచేయండి. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అనవసరమైన వివాదాలు ముందుకువస్తాయి. సంయమనంతో ఉండటం అవసరం. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. సూర్యారాధన శుభప్రదం.
మిథున రాశి వారి పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. అధికారుల స్నేహంతో మంచి పేరు సంపాదిస్తారు. సహోద్యోగులతో పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు, రాజకీయ, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి.
ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. భక్తి పెరుగుతుంది. కొన్ని పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. పట్టుదలతో ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులు, పై అధికారులతో, తోటివారితో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
సింహ రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రమ అధికం అయినప్పటికీ చేపట్టిన పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. సంయమనంతో వ్యవహరించండి. విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
కన్య రాశి వారు నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. పాతబాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంయ మనంతో పనులు చేయడం అవసరం, రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపు తారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. కళాకారులకు కొత్త ఆవకాశాలు వస్తాయి. దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి.
తుల రాశి వారి ఆర్థిక సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు చేస్తారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన గృహ నిర్మాణం చేపడతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. తోటివారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇష్టదేవతార్చన చేసుకోండి.
పాత బాకీలు వసూలు అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. భూముల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహ కారం లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రామాలయాన్ని సందర్శించండి.
ధనుస్సు రాశి కళాకారులకు మంచికాలం. పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విద్యార్థులు శ్రమించాల్సి రావచ్చు. ఉద్యోగులు పట్టుదలతో పనులు చేస్తారు. ప్రభుత్వ, రాజకీయ పనుల్లో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లోకి కావల సిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో చిన్నపాటి అభి ప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.
మకర రాశి వారికి అధికారుల ఆదరణ లభిస్తుంది. వివాహాది శుభకా ర్యాలు చేస్తారు. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉంటుంది. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు కళకళలాడు తుంది. ఖర్చులు పెరగవచ్చు. భూమి కొనుగోలు చేస్తారు. తీర్థ యాత్రలు, విహారయాత్రలకు వెళ్లవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తవుతాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరు గుతాయి. సోదరులతో ఆస్తి తగాదాలు కొంత పరిష్కారం అవుతాయి. నరసింహస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
మీన రాశి వారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. తొందర పాటు నిర్ణయాలతో పనులలో జాప్యం ఉండవచ్చు. భక్తి పెరుగుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నూతన వస్తు వులు కొనుగోలు చేస్తారు. చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలలోకి వెళ్లకుండా సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. శివాలయాన్ని సందర్శించండి.