నేటి రాశి ఫలాలు మే 14, 2025: ఈరోజు ఈ రాశి విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు.. సోదర వర్గంతో ఉత్సాహాలు!-today rasi phalalu may 14th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు మే 14, 2025: ఈరోజు ఈ రాశి విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు.. సోదర వర్గంతో ఉత్సాహాలు!

నేటి రాశి ఫలాలు మే 14, 2025: ఈరోజు ఈ రాశి విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు.. సోదర వర్గంతో ఉత్సాహాలు!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 14.05.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 14.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : బుధవారం, తిథి : కృ. విదియ, నక్షత్రం : అనురాధ

మేష రాశి

మేష రాశి వారి వ్యక్తిగత ఆలోచనల్లో మార్పు అర్థంలేనివిగా ఉంటాయి. తలపెట్టుకొన్ని కార్యక్రమా లను కొన్పిటిని వాయిదా వేసుకొంటారు. పలుకుబడి కలవారిలో పరిచయాలు ఏర్పరచుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో మౌనంగా సాగుతారు. ఆరోగ్యం, ఆర్థికం పరవాలేనివిగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు ఉంచగలుగుతారు.

వృషభ రాశి

అన్నిటా అనుకూలతలు చూస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకొంటారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు నుంచి అవకాశాలు ఏర్పడతాయి. గౌరవాలు పొందలేక పోతారుకాని, ఉత్సాహంగా వ్యవహరించుకొంటారు. ఆరోగ్యం, ఆర్థికం పరవాలేనివిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులను దూరం చేసుకొంటారు.

మిథున రాశి

మిథున రాశి వారికి ఉత్సాహమునిచ్చు సంఘటనలు ఉంటాయి. సభలు, సమావేశాలు బాగా ఆకర్షిస్తాయి. ఆర్థిక వ్యవ హారాల్లో జాగ్రత్తలు అవసరం. సోదర, తోటి ఉద్యోగులు వంటి వారిచే సంయమనాలు అవసరం. వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. ఉద్యోగాలలో ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ, అద్దె ఇంటి మార్పు యత్నాలు ఉపకరించగలవు. ఆదాయ సందర్శనలు ఉంటాయి.

కర్కాటక రాశి

గ్రహ సంచారాల్లో జన్మ కుజ స్థితిచే ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపకాలందు మీదైన తరహాలో సాగగలరు. అవకాశాలు కలసివస్తాయి. గృహోపకరణాలు వంటివి ఏర్పరచుకోగలరు. ఆదాయ వ్యయాలందు మిగులు తనములు, పెట్టుబడులు పెట్టుటవంటివి ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకొన్న బాధ్యతలు ఏర్పడగలవు. ఇతరులకు ఇచ్చు సూచనలు, సలహాలు గుర్తింపునివ్వగలవు.

సింహ రాశి

సింహ రాశి వారికి అవకాశాల కోసం చేయు యత్నాలు ఉపకరిస్తాయి. రుణ విముక్తిని పొందగలరు. కుటుంబంలో ఉత్సాహాలను పంచుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగులు గుర్తింపులు పొందుతారు. విద్యార్థులు ప్రవేశాలకు ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేయాలి. శుభకార్యాలకు హాజరవ్వగలరు.

కన్య రాశి

ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చినా అనుకూలతలు పెంచుకోగలరు. కుటుంబ వ్యవహారాలలో సంయమనాలు అవసరం. వ్యాపారాల్లో నూతనమైన వాటి నందు ప్రవేశించగలుగుతారు. ఉద్యోగులు, విద్యార్థులు, అధికారుల పట్ల సంయమనములు చూపుకోవాలి. మానసిక ప్రశాంతతకు నిత్యం మెడిటేషన్ కి ప్రాధాన్యతను ఇచ్చుకొంటారు.

తుల రాశి

తుల రాశి వారికి గ్రహసంచారాలు అనుకూలం. ఉత్సాహమును పొందే సందర్భాలు నిత్యం ఉంటాయి. ఆర్థిక సామాన్యతలు గోచరిస్తాయి. అదనపు అవకాశాలను పొందుతారు. కుటుంబంలో చిన్న తరహా ఘర్షణాత్మకతలున్నా తలచిన పనుల్ని పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు, అవివాహితులు అసంతృప్తికి దూరంగా ఉంటూ వ్యవహరించుకోవాలి. వ్యాపార వ్యవహారాలలో అనుకొన్నవి సాధించుకోగలరు.

వృశ్చిక రాశి

నూతన పరిచయాలుంటాయి. ఆలోచనలు కలసివస్తాయి. కొత్త పనుల్ని చేయుటకు ముందు సాగగలరు. ఖర్చుల్ని నియంత్రించుకొంటూ మిగులుతనమును యోచనలు చేయగలరు. కుటుంబంలో కలసికట్టుగా వ్యవహరించుకోగలరు. వృత్తి, ఉద్యోగాలలో గత ఇబ్బందులు అధిగమించుటయే కాక కీలకమైన బాధ్యతలను చేపట్టుకోగలరు. ఉన్నత విద్యావకాశాలు, కోరుకొన్నవి పొందుతారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు పనులకు సమయ కేటాయింపులు చేసుకోండి. ఇంటా-బయటా కూడా అన్య విషయాలు ఉండకుండా జాగ్రత్తలు పాటించుకోండి. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. కుటుంబంలో అంతంత మాత్రపు సయోధ్యలు చికాకును ఏర్పరచగలవు. వ్యాపారాల్లో చెల్లింపులకు ప్రాధాన్యతనిచ్చి సాగాలి.

మకర రాశి

మకర రాశి వారు వ్యక్తిగత విషయాల్లో ఇతరులతో పోలికలకు దూరంగా ఉండండి. ఆదాయ వ్యయాలు అదుపులో ఉంటాయి. మాత పితరుల ఉత్సాహాలను చూడగలుగుతారు. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో అంకితభావాలతో సాగగలరు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలేర్పడతాయి. సోదర వర్గంతో ఉత్సాహాలు పంచుకోగలరు.

కుంభ రాశి

కుంభ రాశి వారు ప్రయత్న కార్యములను అనుకొన్నట్లుగా పూర్తిచేసుకోగలరు. మాతాపితరుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబంలో ఏకవాక్యతలు కొనసాగేటట్లు జాగ్రత్తలు అవసరం, భ్రాతృవర్గం నుండి తోటి వారి నుండి సహాయాలు ఏర్పరచుకోగలరు. నూతన వ్యాపార వ్యవహారములు తలపెట్టినప్పుడు మీకు అనుకూలమైనవి చేపట్టుకోండి. నిరుద్యోగులకు, విద్యార్థులకు ఆలోచనలు ఒక కొలిక్కి రాగలవు.

మీన రాశి

శ్రమ, ఒత్తిడులు ఉంటున్నా రోజులు సాధారణంగా సాగిపోగలవు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాలుండకుండా జాగ్రత్తలు అవసరం. తరచూ ఒత్తిడికి గురిచేయు అంశాలను ఎదుర్కోవలసి రావచ్చును. విద్యార్థులు ప్రవేశాలకు ముందు జాగ్రత్తలు చూపుకోవాలి. ప్రయాణాలు సౌకర్యవంతంగా ఊహించుకొన్నట్లుగా సాగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతల్ని వాయిదా వేసుకోకండి. సామాన్యతలతో సాగగలరు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.