నేటి రాశి ఫలాలు మే 13, 2025: ఈరోజు ఈ రాశి వారికి శుభవార్తలు, వాహన యోగం.. గులాబీ, నీలం అదృష్ట రంగులు-today rasi phalalu may 13th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు మే 13, 2025: ఈరోజు ఈ రాశి వారికి శుభవార్తలు, వాహన యోగం.. గులాబీ, నీలం అదృష్ట రంగులు

నేటి రాశి ఫలాలు మే 13, 2025: ఈరోజు ఈ రాశి వారికి శుభవార్తలు, వాహన యోగం.. గులాబీ, నీలం అదృష్ట రంగులు

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 13.05.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 13.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : మంగళవారం, తిథి : కృ. పాడ్యమి, నక్షత్రం : విశాఖ

మేష రాశి

మేష రాశి వారికి ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవార్డులు దక్కే అవకాశం. కుటుంబంలో ఒత్తిడులు, దూరప్రయాణాలు. నీలం, ఆకుపచ్చ రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారి శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. నూతనోద్యోగాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. అనారోగ్యం, గులాబీ, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి.

మిధున రాశి

అనుకున్న సమయానికి డబ్బు సమకూరక కొంత ఇబ్బందిపడవచ్చు. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా కొనసాగుతాయి. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. శుభవార్తలు. వాహన యోగం. గులాబీ, నీలం రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఆస్తి విషయంలో చిక్కులు తొలగి లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి కొత్త ఆశలు. చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

సింహ రాశి

అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి విషయాలలో సోదరుల నుంచి అనుకూల సంకేతాలు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. వాహన యోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ అదృష్ట రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.

కన్య రాశి

కన్య రాశి వారికి కొన్ని పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. విద్యార్ధులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పురస్కారాలు అందుతాయి. కుటుంబ సమస్యలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు అదృష్ట రంగులు. లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.

తుల రాశి

తుల రాశి వారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులు మీపై మరింత ఆదరణ చూపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, తెలుపు అదృష్ట రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు. ఆరోగ్యసమస్యలు, వ్యయప్రయాసలు, గులాబీ, పసుపు అదృష్ట రంగులు. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు రాశి

ఆర్థికంగా కొంత పురోగతి కనిపించినా రుణాలు సైతం చేస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత శ్రమ తప్పదు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. శుభవార్తలు. పసుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

మకర రాశి

మకర రాశి వారి వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అందరిలోనూ గౌరవానికి లోటు ఉండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త విధుల్లో చేరవచ్చు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం. ఆరోగ్యభంగం, గులాబీ, లేత ఆకుపచ్చ అదృష్ట రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారి ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డునపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. వ్యాపార లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి సత్కారాలు. వ్యయప్రయాసలు. ఎరుపు, నేరేడు అదృష్ట రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీన రాశి

మీన రాశి వారు నూతనంగా చేపట్టిన పనులు నకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వివాహయత్నాలు తుది దశకు చేరుకుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. బంధువిరోధాలు, వ్యయప్రయాసలు. ఎరుపు, తెలుపు అదృష్ట రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.