నేటి రాశి ఫలాలు మే 12, 2025: ఈరోజు ఈ రాశి వారు సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.. విలువైన వస్తువులు జాగ్రత్త!-today rasi phalalu may 12th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు మే 12, 2025: ఈరోజు ఈ రాశి వారు సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.. విలువైన వస్తువులు జాగ్రత్త!

నేటి రాశి ఫలాలు మే 12, 2025: ఈరోజు ఈ రాశి వారు సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.. విలువైన వస్తువులు జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 12.05.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 12.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : సోమవారం, తిథి : కృ. పౌర్ణమి: శ్రవణం

మేష రాశి

మేష రాశి వారు మనోదైర్యంతో యత్నాలు సాగించండి. దీక్షతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, వాయిదా వేసుకుంటారు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. కీలక పత్రాలు అందుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు, ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.

వృషభ రాశి

వృషభ రాశి వారి లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆత్మసైర్యంతో అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. అపజయం మీలో పట్టుదలను రేకెత్తిస్తుంది. మొండిగా యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది.

మిథున రాశి

అనవసర ఒత్తిళ్లకు గురికావొద్దు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కీలక వ్యవహారంలో పెద్దల సలహా పాటించండి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవతలివారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆహ్వానం అందుకుంటారు. బందువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి అభీష్టం నెరవేరుతుంది. సమర్థతను చాటుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి. పురస్కారాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రతను కోల్పోవద్దు. ఆచితూచి అడుగేయండి, పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆప్తులతో తరచుగా సంభాషిస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. వేడుకలో అందరినీ ఆకట్టుకుంటారు.

సింహ రాశి

ఆర్ధికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఖర్చులు అధికం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.

కన్య రాశి

కన్య రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. లక్ష్యసాధనకు చేరువవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. పరిచయస్తులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. అనుమానాలకు తావివ్వవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త.

తుల రాశి

తుల రాశి వారికి విశేష ఫలితాలున్నాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ధన వ్యయంలో మితం పాటించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. శుభకార్యం నిశ్చ యమవుతుంది. కొత్త బంధుత్వాలు బలపడ తాయి. రశీదులు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి. కీలక పత్రాలు అందుకుంటారు. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దది చేసుకోవద్దు.

వ్యశ్చిక రాశి

వ్యశ్చిక రాశి వారికి అన్ని విధాలా అనుకూలం. మీ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పెట్టుబడులకు అనుకూలం. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివే యొద్దు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు సంతోషకరమైన వార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించ వద్దు. వాగ్వాదాలకు దిగవద్దు. అందరితోనూ మితంగా మాట్లాడండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు.

మకర రాశి

గ్రహస్తితి అనుకూలంగా ఉంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. సామరస్యంగా మెలగండి. పట్టుదలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగి స్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కుంభ రాశి

కుంభ రాశి వారు ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. కార్యదీక్షతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపి వేయొద్దు. నోటీసులు అందుకుంటారు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగుండా మెలగండి. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. పెద్దల సలహా తీసుకోండి. ప్రయాణం కలిసివస్తుంది.

మీన రాశి

కార్యానుకూలత ఉంది. దీక్షతో శ్రమించి మంచి ఫలితం సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఊహించని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.