నేటి రాశి ఫలాలు మే 11, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో కలిసి వస్తుంది, పదవీ లాభం.. మహాలక్ష్మిని ధ్యానించండి-today rasi phalalu may 11th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు మే 11, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో కలిసి వస్తుంది, పదవీ లాభం.. మహాలక్ష్మిని ధ్యానించండి

నేటి రాశి ఫలాలు మే 11, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో కలిసి వస్తుంది, పదవీ లాభం.. మహాలక్ష్మిని ధ్యానించండి

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 11.05.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 11.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : ఆదివారం, తిథి : శు. చతుర్దశి, నక్షత్రం : స్వాతి

మేష రాశి

మేష రాశి వారికి విజయం గోచరిస్తోంది. ప్రాధాన్య క్రమంలో పనులు పూర్తిచేయండి. ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు. శాంత స్వభావం అవసరం. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. లోతుగా ఆలోచించాకే నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్య విషయాల్లో మిత్రుల సహాయం అందుతుంది. ఈశ్వరుడిని ఆరాధించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి విజయావకాశాలు పెరుగుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన, ధాన్య సమృద్ధి గోచరిస్తోంది. బలమైన ప్రయత్నంతో పాటూ బుద్ధిబలం అవసరం. వ్యాపారంలో కలిసొస్తుంది. కాలానికి తగినట్టు నైపుణ్యాలు పెంచుకోవాలి. ఉద్యోగ నిర్వహణలో ఆత్మవిశ్వాసం అవసరం. ఓ మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని పూజించండి.

మిథున రాశి

సూర్యబలం బావుంది. ప్రతి పనీ విజయవంతం అవుతుంది. స్థిరమైన ఉద్యోగాన్ని సాధిస్తారు. కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. పదోన్నతులు అందుకుంటారు. ఓర్పు, నేర్పుతో అభీష్టసిద్ధి కలుగుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. లక్ష్మీదేవిని అర్చించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు విజయాలు సాధిస్తారు. ఏకాదశ బృహస్పతి యోగం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. వివిధ మార్గాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. భాగ్య శుక్రయోగం ధనలాభాన్ని సూచిస్తోంది వ్యాపారంలో సమయానుకూల నిర్ణయాలు అవసరం. లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి.

సింహ రాశి

ఆర్ధిక ఫలితాలు అనుకూలం. ధనధాన్య వృద్ధి కనిపిస్తోంది. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. తోటివారి సహకారం లభిస్తుంది. చెడును ఊహించుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. మిత్రుల సాయం అందుకుంటారు. నవగ్రహ శ్లోకాలను పఠించండి.

కన్య రాశి

కన్య రాశి వారికి శుభ ఫలితాల సాధనకు కాలం సహకరిస్తుంది. ప్రాధాన్యక్రమంలో పనులు పూర్తిచేయండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. మనసును అదుపులో ఉంచుకోండి. భాగ్య గురుబలం ఆధ్యాత్మిక వికాసానికి సాయపడుతుంది. చిన్నపాటి బలహీనతలు ఆర్థిక ఇబ్బందుల్ని సృష్టించే ఆస్కారం ఉంది. శివధ్యానం శుభప్రదం.

తుల రాశి

వ్యాపారయోగం సూచితం. పరిస్థితుల్ని బట్టి సమయానుకూలంగా వ్యవహరించండి. ఆర్ధిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. వృధా వ్యయాలను పరిహరించండి. అపార్ధాలకు ఆస్కారం ఇవ్వకండి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా అధైర్య పడకండి. ఓ మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. విష్ణు సహస్రనామం పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో ఉన్నతి గోచరిస్తోంది. మీ ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు. పదవీయోగం ఉంది. గతంలోని పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. మిత్రుల అండ లబిస్తుంది. ఏకాగ్రతతో వ్యాపారంలోని అవరోదాలను అధిగమిస్తారు. గిట్టనివారు రెచ్చగొట్టినా, సంయమనాన్ని కోల్పోకండి. మేలు జరుగుతుంది. సరస్వతీదేవిని ఆరాధించండి.

ధనుస్సు రాశి

ఫలితాలు అనుకూలం. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. బుద్ధిబలంతో సమాజంలో పేరు సంపాదిస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. జాగ్రత్త పడకపోతే రుణ సమస్యలు చుట్టుముడతాయి. నిర్లిప్తతకు చోటివ్వకుండా, సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేయండి. కీలక సందర్భాల్లో వెనకడుగు వేయకండి. ఇష్టదేవతను ఆరాధించండి.

మకర రాశి

మకర రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. కాలం అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఉత్తమ విజయాలు సాధిస్తారు. వాయిదా మనస్తత్వం వద్దు. ఆర్థిక ఫలితాలు బావుంటాయి. అవకాశాల్ని అందిపుచ్చుకుని, ఆదాయ మార్గాల్ని విస్తరించుకోవాలి. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ భాగస్వామ్యం అవసరం. మీ ఓర్పును పరీక్షించేవారు ఉన్నారు, జాగ్రత్త, శ్రీలక్ష్మిని ఉపాసించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఫలితాలు వేగంగా అందుతాయి. మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. ఉద్యోగంలో కలిసొస్తుంది. పదవీలాభం సూచితం. గతంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. ఉన్నత స్థానాల్లోని వ్యక్తులతో మైత్రి బలపడుతుంది. భవిష్యత్ ప్రణాళికలకు సరైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదైన ముద్ర వేస్తారు. మహాలక్ష్మిని ధ్యానించండి.

మీన రాశి

జీవిత లక్ష్యాలపైన దృష్టి పెడతారు. లోతుగా ఆలోచించాకే కొత్త పనుల్ని ప్రారంభించండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అవసరం. ఇబ్బందులు సృష్టించేవారితో జాగ్రత్త పరిస్థితులకు తగినట్టు నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార వ్యవహారాల్లో మెలకువతో స్పందించండి. కష్టానికి తగిన ఫలితం అందుతుంది. నవగ్రహాల్ని ధ్యానించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ