మార్చి 9, నేటి రాశి ఫలాలు.. కొత్త వ్యక్తులతో పరిచయాలు, కేసుల నుంచి బయటపడతారు-today rasi phalalu march 9th 2024 check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్చి 9, నేటి రాశి ఫలాలు.. కొత్త వ్యక్తులతో పరిచయాలు, కేసుల నుంచి బయటపడతారు

మార్చి 9, నేటి రాశి ఫలాలు.. కొత్త వ్యక్తులతో పరిచయాలు, కేసుల నుంచి బయటపడతారు

HT Telugu Desk HT Telugu
Mar 09, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ09.03.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 9వ తేదీ రాశి ఫలాలు
మార్చి 9వ తేదీ రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 09.03. 2024

వారం: శనివారం, తిథి: చతుర్దశి,

నక్షత్రం: ధనిష్ట, మాసం : మాఘము

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కోర్టు వ్యవహారాల్లో పురోగతి. వ్యాపారులకు అనుకోని లాభాలుంటాయి. ఉద్యోగులకు విధుల్లో అనుకూలం. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. ఉద్యోగులకు విధుల్లో ఇబ్బందులు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. అందరిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వ్యాపారులకు వ్యాపార నిర్వహణలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు. దీర్ఘకాలిక సమస్యలు కొంతమేర తీరి ఊరట లభిస్తుంది. విద్యావకాశాలు ఊహించని రీతిలో దక్కుతాయి. శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. గౌరవానికి లోటు ఉండదు. పరిస్థితుల ప్రభావంతో కొన్ని నిర్ణయాలు వాయిదా. ఆభరణాలు, వాహనాలు కొంటారు. భూ వివాదాలు, కేసుల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి సాయపడతారు. దశరథప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

సింహ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యాపారులు కొత్త పెట్టుబడులకు ప్రయత్నాలు చేస్తారు. ఇళ్ళు, వాహనాలు కొనుగోలులో స్వల్ప అవాంతరాలు. కొన్ని కార్యక్రమాల్లో ఆలస్యం జరిగినా పూర్తిచేస్తారు. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు విధుల్లో ఇబ్బందులు. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు నూతన ఉత్సాహం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయనాయకులకు అనుకూలం. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. విద్యార్థులకు మంచి సమయం. రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్య నిర్ణయాలకు అనుకూల కాలం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత విముక్తి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులకు విధుల్లో గుర్తింపు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. వ్యాపారుల అంచనాలకు తగ్గ లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. చేపట్టి కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో అకారణ విభేదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు శ్రద్ద వహించాలి. వ్యాపారాలకు లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు బాధ్యతలు మరిన్ని మీద పడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు మీదపడతాయి. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొంటారు. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని మీ భావాలను పంచుకుంటారు. అదనపు ఆదాయం దక్కి రుణ బాధలు తొలగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గణపతిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. భూ, గృహ యోగాలున్నాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కోర్టు వివాదాల పరిష్కారం. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు దక్కుతాయి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ