మార్చి 5, నేటి రాశి ఫలాలు.. ఏయే రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయో తెలుసా?-today rasi phalalu march 5th 2024 check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu March 5th, 2024 Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

మార్చి 5, నేటి రాశి ఫలాలు.. ఏయే రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Mar 05, 2024 12:35 PM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ05.03.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 5వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 5వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 05.03. 2024

ట్రెండింగ్ వార్తలు

వారం: మంగళవారం, తిథి : దశమి,

నక్షత్రం: మూల, మాసం: మాఘం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులకు పై అధికారులచే ప్రశంసలుంటాయి. వృథా ఖర్చులుండును. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి లాభదాయకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధనచేయండి. రాహు కాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వస్తు వాహనలాభాలున్నాయి. ఉద్యోగులకు పదోన్నతులుంటాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. కొన్ని నిర్ణయాలకు కుటుంబ సభ్యుల ప్రశంసలు అందుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది. దేవీ ఖద్దమాల పఠించండి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా అనుకున్న లాభాలు వస్తాయి. విద్య, ఉద్యోగావకాశాలుంటాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు కొంతవరకు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నాను. సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పట్టుదలతో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగులకు పని ఒత్తిళ్ళు ఉంటాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఆంజనేయస్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయస్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా లాభదాయకం. వాహన, గృహ యోగాలున్నాయి. ఉద్యోగులకు మంచి సమయం. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. కొన్ని బాధ్యతల నుండి విముక్తి. దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగులకు పనిభారం ఉన్నా గుర్తింపు రాగలదు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలేర్పడే అవకాశముంది. దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు మంచి సమయం. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలుంటాయి. వృథా ఖర్చులుంటాయి. బంధువులతో వివాదాలు కలుగును. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశముంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఆశించిన రీతిలో పనులు పూర్తి చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యసమస్యలుంటాయి. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు అనుకూలమైన సమయం. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ఉత్సాహంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులు కొత్త ఒరవడితో విధులు నిర్వర్తిస్తారు. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారస్తులకు లాభాయకం. ఉద్యోగులకు సహోద్యోగుల సాయం అందుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూలం. ఎటువంటి బాధ్యతనైనా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. పనులు వేగవంతంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులకు లాభదాయకం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగముంది. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. వివాదాలు, సమస్యలు ఏర్పడినా సర్దుబాటు కాగలవు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పనుల్లో విజయం సాధిస్తారు. భూవివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత అవకాశాలుంటాయి. కుటుంబ సమస్యలు తీరతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel