మార్చి 3, 2024: నేటి రాశి ఫలాలు.. ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారులకు లాభాలు-today rasi phalalu march 3rd dina phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్చి 3, 2024: నేటి రాశి ఫలాలు.. ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారులకు లాభాలు

మార్చి 3, 2024: నేటి రాశి ఫలాలు.. ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారులకు లాభాలు

HT Telugu Desk HT Telugu
Published Mar 03, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ03.03.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

రాశి ఫలాలు
రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 03.03. 2024

వారం: ఆదివారం, తిథి : అష్టమి,

నక్ష్మత్రం : అనూరాధ, మాసం : ఫాల్గుణం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులుంటాయి. వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారులు, తోటివారి నుండి సహాయ సహకారాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయములు రాకుండా జాగ్రత్త వహించలి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటంం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆనందముగా ఉత్సాహంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలు, నూతన ఒప్పందాలు కలసివస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు మధ్యస్థ సమయం. మానసిక ఒత్తిళ్ళు ఉండును. ఉద్యోగస్తులకు పై అధికారులచే పని ఒత్తిళ్ళు అధికమగును. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అవసరాలకు తగిన ధనం అందుతుంది. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పై అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కమీషన్‌ కోసం చేసే వ్యాపారులకు మంచి అవకాశాలున్నాయి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలి. కుటుంబములో పెద్దవారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నారాయణ మూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు బాధ్యతలు అధికమగును. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సహాయ సహకారాలుంటాయి. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యలున్నవారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్నిపఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. భాగస్వామిక వ్యాపారాలలో జాగ్రత్తలు తప్పనిసరి. నిరుద్యోగులు శుభవార్తలుంటాయి. వ్యాపార వ్యవహారాలలో బిజీగా ఉంటారు. అధికారులు, పెద్దలచే ప్రశంసలుంటాయి. మీ కృషికి తగిన ఫలితాలుంటాయి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యభగవానుని పూజించి బెల్లం, పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. వాహనం, గృహం కొనుగోలుకు ఆలోచనలు చేస్తారు. సంతానపరంగా చికాకులుంటాయి. గతంలో ఆగిపోయిన పనులపై దృష్టి సారిస్తారు. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నిరుద్యోగులు ఉద్యోగాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అనారోగ్య సమస్యలుంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరి. అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రులు సహకారాలు పొందుతారు. ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు వృత్తి ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలున్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆరోగ్య సమస్యలనుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధములు ఏర్పడును. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ప్రయత్నాలు వేగవంతం చేసుకోవాలి. ఆదాయం పెరుగుతుంది. అన్ని విషయాలలో జాగ్రత్తలు వహించాలి. సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరాదు. అవసరాలకు సరిపడు ధనం అందుతుంది. ఆరోగ్యం అనుకూలించును. సంతానపరంగా విభేదాలు వచ్చే అవకాశమున్నది. ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయం. పశ్చాత్తాపానికి గురిచేయు అంశాలుంటాయి. నవగ్రహశాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగతంగా ఆనందముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అధికారుల గుర్తింపు ఉంటుంది. కుటుంబం, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వాహన, యంత్రాదుల వాడకం జాగ్రత్త అవసరం. మీ ప్రయత్నాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులు టార్గెట్‌ విధానాలు పాటించాలి. కుంభ రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాల పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలేర్పడతాయి. వ్యాపారస్తులు వ్యాపార సంబంధ ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని రుణాలు చేయవలసి రావచ్చును. ఊహించని సంఘటనలు ఇబ్బందిపెట్టును. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner