మార్చి 27, నేటి రాశి ఫలాలు.. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు, వివాదాలకు దూరంగా ఉండాలి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ27.03.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 27.03.2024
వారం: బుధవారం, తిథి: విదియ,
నక్షత్రం: చిత్త, మాసం: ఫాల్గుణం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబములో అభిప్రాయబేధములు ఏర్పడవచ్చు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు కలసివస్తాయి. అన్నదమ్ములతో కలసిమెలసి ఉటారు. శుభకార్యాల విషయంలో ఆర్థికంగా ఆటంకాలు ఏర్పడవచ్చు. అరోగ్య సమస్యలు తీరతాయి. శుభవార్త వింటారు. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆనందముగా కాలం గడుపుతారు. విలువైన అభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి వ్యక్తులతో పరిచయమవుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యసమస్యలుంటాయి. ప్రశాంతంగా ఉంటారు. వృధా ఖర్చులుంటాయి. సమయపాలన పాటించడం మంచిది. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం కృష్ణుని ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. స్థిరాస్తి ద్వారా అదాయం సమకూరుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. పెద్దల సలహాలు పాటించండి. ఉద్యోగులకు విధి నిర్వహణలో పని ఒత్తిళ్ళు ఉంటాయి. ఉన్నతాధికారులతో అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం అనుకూలించును. పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. పెట్టుబడుల విషయంలో అచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా కలసి వస్తుంది. శ్రీమన్నారాయణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి ఆలయాలలో అర్చన జరిపించుకోవాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, అనుకూల బదిలీకి అవకాశముంది. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అరోగ్యం బాగుంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికమగును. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పని ఒత్తిడితో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పై అధికారులతో ఇబ్బందులుంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అరోగ్యం అనుకూలించును. వ్యాపారస్తులకు అనుకూల సమయం. క్యాటరింగ్, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు లాభాలు పొందుతారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో సంతోషంగా కాలం గడుపుతారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులుంటాయి. సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. వాహన మరమ్మత్తులుంటాయి. రావలసిన డబ్బు అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. తీర్ధయాత్రలు చేస్తారు. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.
వృశ్చిక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు నెరవేరతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక పెట్లుబడుల విషయంలో కొంతకాలం వేచి ఉండటం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. పెద్దల సూచనలు పాటించడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు అందరి ప్రశంసలను పొందుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుడి ఆలయాన్ని దర్శించాలి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. శుభవార్త వింటారు. శ్రద్ధతో పనులు చేయడం అవసరం. అనవసరమైన ఆలోచనలు తలెత్తుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. సమయపాలన అవసరం. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. శారీరక సమస్యలు తీరతాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. ప్రయాణాలు కలసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణం, ఉన్నత విద్య అనుకూలిస్తుంది. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం కలిసొస్తుంది. బంధువులతో భేదాభిప్రాయములు తలెత్తవచ్చు. వాహన మరమ్మతుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. పెద్దల సహకారం లభిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. బంధువులతో అనవసర చర్చలు వద్దు. భూలావాదేవీల్లో లాభాలు పొందుతారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు తలెత్తుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. గతంలోని సమస్యలు తీరతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పరించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అవకాశాలుంటాయి. కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మంచి ఆలోచనలు వస్తాయి. దైవ భక్తి పెరుగుతుంది. మంచివారితో పరిచయాలేర్పడతాయి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000