మార్చి 25, నేటి రాశి ఫలాలు.. హోలీ ఈ రాశుల జాతకుల జీవితాన్ని మార్చేస్తుంది-today rasi phalalu march 25th 2024 check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu March 25th, 2024 Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

మార్చి 25, నేటి రాశి ఫలాలు.. హోలీ ఈ రాశుల జాతకుల జీవితాన్ని మార్చేస్తుంది

HT Telugu Desk HT Telugu
Mar 25, 2024 12:04 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ25.03.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 25వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 25వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 25.03. 2024

ట్రెండింగ్ వార్తలు

వారం: సోమవారం, తిథి : పౌర్ణమి

నక్షత్రం : ఉత్తర ఫల్గుణి, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గృహ, నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. మేషరాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుడికి అభిషేకం, పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి సాయం అందుతుంది. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కలసివచ్చే సమయం. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు అనుకూలంగా లేదు. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపారస్తులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులుంటాయి. అనారోగ్య సమస్యలు. కార్యక్రమాలలో అవరోధాలుంటాయి. తరచు ప్రయాణాలు. శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులు అందక ఇబ్బందిపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలుంటాయి. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. బిల్వపత్రాలతో శివుడిని పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. భూవివాదాలు నెలకొంటాయి. కుటుంబసభ్యులతో అకారణంగా గొడవలు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలుంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకోని ప్రయాణాలుంటాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. కాంట్రాక్టులు చేజారతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్ట్రకాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పరపతి పెరుగుతుంది. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తి వృద్ధి అవుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. దేవాలయాలు సందర్శిస్తారు. బాకీలు అందుతాయి. పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు మార్పులుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు. తరచూ ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. కార్యక్రమాలు ముందుకు సాగవు. తులారాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. బాకీలు అందుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలుంటాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులుంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారులకు అనుకూలం. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. రావలసిన సొమ్ము అందుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మీరు చేసే పనులలో ఆటంకాలు. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూలంగా లేదు. రాబడి తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు ఇబ్బందిపెట్టును. దేవాలయాలు సందర్శిస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు పడతారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు చేజారతాయి. ఆస్తి విషయాలలో గొడవలు. దూరప్రయాణాలుంటాయి. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. చేపట్టిన పనులలో ఆటంకాలు. కుటుంబ బాధ్యతలు ఇబ్బందిపెట్టును. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel