మార్చి 24, నేటి రాశి ఫలాలు.. ప్రముఖులతో పరిచయాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ24.03.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 24 03.2024
వారం: ఆదివారం, తిథి : చతుర్దశి
నక్షత్రం : పుబ్బ, మాసం : ఫాల్గుణం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. స్నేహితులతో అకారణంగా విభేదాలుంటాయి. ఆస్తి వివాదాలతో ఇబ్బందిపడతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఉంటాయి. స్త్రీలు ప్రతి విషయానికి మానసిక అందోళనకు గురవుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవాలయాలు సందర్శిస్తారు. ఖర్చులు అధికమగును. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన రీతిలో మార్పులుంటాయి. శుభకార్యాలను నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వాహన, గృహయోగాలున్నాయి. శుభాకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. సోదరులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్నిసమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకులంగా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం లభిస్తుంది. అందరిలోనూ గౌరవ మర్యాదలుంటాయి. వివాహ ప్రయత్నంలో ఆటంకాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు చేయూతనిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలం. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. సూర్యనారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పఠించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అందరిలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయమే వరిస్తుంది. తీర్ధయాత్రలు చేస్తారు. నూతన వ్యక్తులు పరిచయమై చేయూతనిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలుంటాయి. పెట్టుబడులకు సైతం లోటుండదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు తొలగుతాయి. అదనపు బాధ్యతలుండే సూచనలు. రావలసిన సొమ్ము అందుకుంటారు. స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు మరింత సంతోషం కలిగిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలుకు బంధువుల సహకారముంటుంది. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం అందుతుంది. నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. మహిళలకు కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సూర్యభగవానుడిని పూజించి బెల్లం, పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. స్నేహితులతో ఆనందముగా గడిపెదరు. వాహనాలు, స్థలాలు కొంటారు. శుభకార్యాలకు అదనపు ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఒత్తిడులు తొలగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సేవాభావంతో ముందుకు సాగి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధువుల నుంచి శుభవర్తమానాలుంటాయి. ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీరతాయి. రుణబాధలు తీరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వివాదాలనుంచి బయటపడతారు. శుభకార్యాల నిర్వహణకు డబ్బు ఖర్చుచేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఉంటాయి. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. హృదయాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సోదరులు, స్నేహితులతో అత్యంత కీలక విషయాలు చర్చిస్తారు. కుటుంబ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. రాజకీయనాయకులకు ఊహించని కొన్ని పదవులు దక్కవచ్చు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. ప్రత్యర్థులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలుంటాయి. ప్రయాణాలు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్లు పొందుతారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడి లబ్ధి పొందుతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ముఖ్య కార్యక్రమాలలో విజయం లభిస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమయానికి అందుతాయి. విస్తరణ ప్రక్రియ పూర్తిచేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆనందాన్నిస్తుంది. కుటుంబములో మీ మాటలకు ఎదురు ఉండదు. కుంభ రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మ, ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. శుభకార్యాలకు ధనం వెచ్చిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. దూరపు బంధువులు ఊహించని మాటసాయం అందిస్తారు. అప్పులు తీరతాయి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000