మార్చి 19, నేటి రాశి ఫలాలు.. పన్నెండు రాశులలో ఈ ఒక్క రాశి వారికి అనుకూలంగా లేదు-today rasi phalalu march 19th check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu March 19th Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

మార్చి 19, నేటి రాశి ఫలాలు.. పన్నెండు రాశులలో ఈ ఒక్క రాశి వారికి అనుకూలంగా లేదు

HT Telugu Desk HT Telugu
Mar 19, 2024 12:03 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ19.03.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 19, నేటి రాశి ఫలాలు
మార్చి 19, నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 19.03.2024

ట్రెండింగ్ వార్తలు

వారం: మంగళవారం, తిథి: దశమి,

నక్షత్రం : పునర్వసు, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, బంధువుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వాహనయోగముంది. ఆస్తుల వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. అవసరాలకు అప్పులు చేస్తారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది. దేవి మంత్రాలు పఠించాలి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు ఆశించిన పెట్టుబడులు లభించును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. స్థిరాస్తి వివాదాలు చివరిదశకు చేరతాయి. సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు తిరిగే దొరికే అవకాశముంది. సకాలంలో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కర్కాటకరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆంజనేయ స్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయ స్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులు తొలగుతాయి. వాహనయోగముంది. భూవివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలతో కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. జీవితాశయం సాధించే దిశగా ముందడుగు వేస్తారు. దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు ఊహించని పెట్టుబడులుంటాయి. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ఆప్తుల నుంచి శుభవార్తలుంటాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వాహన, గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్నిస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. సోదర, సోదరీలతో వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వాహన, గృహయోగాలున్నాయి. చిన్న చిన్న సమస్యలు నుంచి బయటపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. కొన్ని పనులు కుటుంబసభ్యుల సాయంతో పూర్తిచేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. నిరుద్యోగులకు విద్యావకాశాలు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. దూరమైన ఆప్తులు చేరువవుతారు. గృహ, వాహన యోగాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో తమ సత్తా చాటుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలు. ఆత్మీయుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభ సూచన. ఆరోగ్యం అనుకూలించును. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. వ్యాపారస్తుల వ్యాపారంలో ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు రావచ్చు. అనుకున్న రాబడి పొంది ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపుకు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరించుకుని లబ్ది పొందుతారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel