మార్చి 18, నేటి రాశి ఫలాలు.. ఉద్యోగులకు ప్రశంసలు, డబ్బు చేతికి వస్తుంది-today rasi phalalu march 18th check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్చి 18, నేటి రాశి ఫలాలు.. ఉద్యోగులకు ప్రశంసలు, డబ్బు చేతికి వస్తుంది

మార్చి 18, నేటి రాశి ఫలాలు.. ఉద్యోగులకు ప్రశంసలు, డబ్బు చేతికి వస్తుంది

HT Telugu Desk HT Telugu
Published Mar 18, 2024 12:04 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ18.03.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 18, నేటి రాశి ఫలాలు
మార్చి 18, నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 18.03. 2024

వారం: సోమవారం, తిథి : నవమి

నక్షత్రం: ఆరుద్ర, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. దీర్ఘకాలిక రుణ బాధలు తీరును. బంధువర్గం నుండి సాయం అందుతుంది. వ్యాపారస్తులకు భాగస్వాములు చేరి పెట్టుబడులు పెంచుతారు. ఉద్యోగస్తులు పై అధికారులచే ప్రశంసలు పొందుతారు. శుభ కార్య నిర్వహణలో పాల్గొంటారు. స్పల్ప అనారోగ్య సమస్యలుంటాయి. అవసరాలకు కొంత సొమ్ము అందుతుంది. భూముల కొనుగోలుపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. మేష రాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుడిని అభిషేకించడం, పూజించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆలయాలను సందర్శిస్తారు. రుణాలు తీరతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన విధముగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు విధినిర్వహణలో గుర్తింపు పొందుతారు. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు అవుతాయి. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. వృషభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాదాల నుండి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ ఉద్యోగ విషయాలలో అనుకూలం. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. కుటుంబములో చిరాకులు తొలగుతాయి. శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయి. పదోన్నలుంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుదురు. దీర్ఘకాలిక రుణములు తొలగుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. శుభవార్తలు వింటారు. బిల్వపత్రాలతో శివుడిని పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతీ పని కలిసివస్తుంది. ఆకస్మికంగా ధనలాభముండును. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. సంతానం నుండి చికాకులు తొలగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు తగిన లాభాలు వస్తాయి. సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్టకాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. మహిళలు ఆరోగ్య సమస్యలనుండి బయటపడతారు. సంతాన పరంగా మంచి గుర్తింపు ఉటుంది. పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టును. భార్యాభర్తల మధ్య సంఘర్షణలుంటాయి. ఉద్యోగస్తులు శ్రమ పడవలసిన సమయం. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పతారు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగులకు అనుకూల సమయం. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఇతరుల నుండి రావలసిన డబ్బు అందుతుంది. భూమి కొనుగోలు చేస్తారు. కుటుంబంముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. మీపై వచ్చిన నిందలు సమసిపోతాయి. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబములో ఆనందకరమైన వాతావరణం. వ్యాపారాలలో మరింత లాభాల కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు కోరుకొన్న పదోన్నతులు. నిల్వ చేసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పెద్దల సలహా పాటిస్తూ ముందుకు సాగుతారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నాయి. శుభకార్యాలకు విశేషంగా ఖర్చు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకొన్న లాభాలు వస్తాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశములు లభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులచే ప్రశంసలు అందుకుంటారు. అప్పులు తీరతాయి. ఊహించని విధముగా కొంత సొమ్ము అందుతుంది. సోదరులతో ఆనందముగా గడుపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఆరోగ్యం అనుకూలించును. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా లబ్ది పొందుతారు. విద్యార్థులకు విదేశీయానం. సోదరి సోదరులతో విబేధాలు తొలగుతాయి. బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner