Today Rasi Phalalu: ఆ రాశి ఉద్యోగస్తులకు నేడు లాభదాయకం-today rasi phalalu know horoscope astrological predictions for 21st march 2023 tues day in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu Know Horoscope Astrological Predictions For 21st March 2023 Tues Day In Telugu

Today Rasi Phalalu: ఆ రాశి ఉద్యోగస్తులకు నేడు లాభదాయకం

HT Telugu Desk HT Telugu
Mar 21, 2023 01:01 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 21.03.2023 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (21.03.2023 మంగళవారం) బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: ఫాల్గుణము వారం: మంగళవారం, తిథి: అమావాస్య నక్షత్రం: పూర్వాభాద్ర

మేషరాశి నేటి రాశి ఫలాలు

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి చెడు ఫలితాలున్నాయి. మేషరాశికి జన్మరాశియందు శుక్ర, రాహువులు మరియు వ్యయస్థానమునందు రవి, బుధ, గురుల సంచారంచేత పనులు యందు ఆలస్యము, మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమగును. ధన నష్టము సూచనలు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వాహనాలు, గృహాలు వంటి వాటికి ధనము ఖర్చు చేయు సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. మేషరాశివారు ఈ రోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి.

వృషభరాశి నేటి రాశి ఫలాలు

వృషభరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. వృషభరాశి వారికి లాభస్థానములో రవి, బుధ, గురుల ప్రభావంచేత చేసే పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలము, వ్యాపారస్తులకు వ్యాపారమునందు లాభములు కలుగును. వృషభరాశి వారికి వాక్ స్థానమునందు కుజుని సంచారం వలన గొడవలు, వాగ్వివాదములకు దూరంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు దూరంగా ఉండాలని సూచన. వృషభరాశి వారికి లాభమునందు గురుడు, దశమము నందు శని ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని మరియు దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించాలి.

మిథునరాశి నేటి రాశి ఫలాలు

మిథునరాశివారికి ఈ రోజు మథ్యస్తముగా ఉంది. మిథున రాశి వారికి జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ, మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాలి. రవి, బుధ, గురులు దశమంలో ఉండటం చేత ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. కుజుని ప్రభావం చేత ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మిథునరాశివారు మరిన్ని శుభఫలితాల కోసం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించాలి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి ఫలితాలు ఉన్నాయి. భాగ్యమునందు రవి, బుధ, గురులు సంచారము వలన కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు మధ్యస్థ ఫలితములు ఏర్పడుతున్నవి. దశమ స్థానమునందు శుక్ర, రాహువుల సంచారం వలన ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము. కర్కాటక రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

సింహరాశి నేటి రాశి ఫలాలు

సింహరాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు ఉన్నాయి. సింహరాశికి అష్టమ స్థానము నందు రవి, బుధ, గురుల ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పనులయందు శ్రమ మరియు చికాకులు అధికమగును. ఆర్థిక విషయాలు ఇబ్బంది పెట్టు సూచన. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. లాభములో కుజుని ప్రభావం చేత సింహరాశి ఉద్యోగస్తులకు అనుకూలము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడుచున్నవి. విద్యార్థులకు జాగ్రత్త వహించవలసినటువంటి సమయము. స్త్రీలు కుటుంబ విషయాల యందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఆదివారం సూర్యాష్టకము పఠించాలి. గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

కన్యారాశి నేటి రాశి ఫలాలు

కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కళత్ర స్థానమునందు రవి, బుధ, గురుల సంచారం వలన కుటుంబమునందు కొంత చికాకులు అధికముగా ఉండును. దశమంలో కుజుని అనుకూలత వలన ఉద్యోగస్తులకు లాభదాయకముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. శని ఆరో ఇంట అనుకూల ప్రభావంచేత అనుకున్న ప్రతీ పనియందు విజయాన్ని చూచెదరు. అష్టమ స్థానమునందు శుక్ర, రాహువుల సంచారము వలన శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగును. కన్యారాశి వారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

తులా రాశి నేటి రాశి ఫలాలు

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. పంచమంలో శని మరియు ఆరో ఇంట రవి, బుధ, గురుల ప్రభావంచేత తులారాశివారు చేసే పనులు అనుకూలించును. కళత్ర స్థానమునందు శుక్ర, రాహువులు భాగ్యస్థానమునందు కుజుని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలుగును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు అనుకూలమైన సమయము. తులారాశి వారికి ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

వృశ్చిక రాశి నేటి రాశి ఫలాలు

వృశ్చికరాశికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అష్టమ కుజుని ప్రభావం చేత వృశ్చికరాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. జన్మరాశి యందు కేతువు, కళత్ర స్థానము శుక్ర రాహువుల ప్రభావంచేత కుటుంబములో సమస్యలు వేధించును. రవి, బుధ, గురులు ఆరో స్థానమునందు పంచమంలో శని ప్రభావం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. ప్రయాణములు అనుకూలించును. శారీరక శ్రమ అధికముగా ఉండును. వివాదములకు దూరంగా ఉండాలని సూచన. వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

ధనూ రాశి నేటి రాశి ఫలాలు

ధనూ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. చతుర్థ స్థానమునందు రవి, బుధ, గురుల ప్రభావం చేత కుటుంబ సౌఖ్యము కలుగును. ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. పంచమ స్థానమునందు శుక్ర, రాహువుల ప్రభావంచేత కుటుంబ సౌఖ్యము, లాభము పొందెదరు. ప్రయాణములు అనుకూలించును. ధనూరాశి వారికి శని అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ధనూరాశి వారికి ఈరోజు ధనలాభము, సౌఖ్యము కలుగు సూచన. ధనూరాశి వారికి రోజు ధనలాభము సౌఖ్యము కలుగు సూచన. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజు పూజించాలి.

మకర రాశి నేటి రాశి ఫలాలు

మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. ధనస్థానమునందు శని ప్రభావంచేత ఖర్చులు అధికమగును. భ్రాతృ స్థానమునందు రవి, బుధ, గురుల ప్రభావం చేత కుటుంబమునందు సమస్యలు, వివాదాలు, మానసిక ఘర్షణలు అధికమగును. చతుర్ధ స్థానమునందు శుక్ర, రాహువులు, ఆరో స్థానమునందు కుజుడు అనుకూలించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు, విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది. మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి. మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజు పూజించాలి.

కుంభ రాశి నేటి రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశివారికి జన్మరాశియందు శని సంచారం వలన శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధన స్థానము కుటుంబ స్థానము వాక్ స్థానము అయినటువంటి 2వ ఇంట రవి, బుధ, గురుల ప్రభావం చేత ఆర్ధిక విషయాలు, ఖర్చులలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొను సూచనలు. కుటుంబ సమస్యలతో వాగ్వివిదాలకు దూరంగా ఉండాలని సూచన. తృతీయ స్థానము నందు శుక్ర, రాహువులు, పంచమ స్థానముల కుజుని అనుకూలత వలన ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును. పనుల యందు ఆలస్యము. కుటుంబ వ్యవహారాలయందు చికాకులు కలుగును. కుంభరాశివారికి జన్మ శని ప్రభావంచేత గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. కుంభరాశి వారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి.

మీన రాశి నేటి రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. జన్మరాశి యందు రవి, బుధ, గురులు ప్రభావంచేత మీనరాశి వారికిశారీక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికమగును. మీనరాశివారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. వ్యయస్థానము నందు శని (ఏలినాటి శని) ప్రభావం చేత మీనరాశి వారికి ఖర్చులు అధికముగా అగును. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు చెడు సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు కష్ట సమయము. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్ 9494981000

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

టాపిక్