హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 09.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ఠ, వారం : సోమవారం, తిథి : శు. త్రయోదశి, నక్షత్రం : విశాఖ
మేష రాశి వారికి ఈ రోజు వ్యాపారయోగం బావుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనస్థానంలోని బుధుడు ఉత్తమ ఆలోచనా విధానాన్ని ప్రసాదిస్తాడు. జన్మ శుక్ర యోగం ఆర్థిక ప్రగతికి కారణం అవుతుంది. అర్ధాష్టమ కుజయోగం వల్ల రుణ సమస్యలూ ఎదురుకావచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతల్లో శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
వృషభ రాశి వారికి ఉత్తమమైన కాలం, ధైర్యంగా పనులు ప్రారంభించండి. సమాజంలో గుర్తింపును సాధిస్తారు. సరైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమించవచ్చు. ద్వాదశ శుక్రయోగం వల్ల అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు. పరిస్థితులకు తగినట్టు వ్యవహరించడం మంచిది. ఆరంభంలోనే విజయాలు మొదలవుతాయి. శ్రీ మహాలక్ష్మిని ఉపాసించండి.
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక ఫలితాలు అనుకూలం. శుక్రబలం లాభాలను ప్రసాదిస్తుంది. ముఖ్య విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. గ్రహదోషం అధికంగా ఉంది; ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. మనోబలాన్ని పెంచుకోవాలి. వ్యాపారంలోని అవరోధాలను పట్టుదలతో అధిగమించండి. వివాదాలకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
కర్కాటక రాశి వారి కొత్త ప్రయత్నాలకు అనువైన సమయం. ఏకాదశంలోని సూర్యుడు, బుధుడు మంచి చేస్తారు. గతంతో పోలిస్తే మేలైన ఫలితాలు ఉంటాయి. ఉద్వేగాలకు లోనుకావద్దు. పెద్దల మన్ననలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతాయి. వాహన ప్రయాణంలో జాగ్రత్త. పరమేశ్వరుడిని ధ్యానించండి.
సింహ రాశి వారికి ఈ రోజు శుభాలు జరుగుతాయి. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అధికారయోగం ఉంది. దాంతోపాటు ధనయోగమూ ఉంది. ఉద్యోగులకు పేరుప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం. చంచల స్వభావం పనికిరాదు. స్థిరచరాస్తులను సంపాదించుకుంటారు. శ్రీవేంకటేశ్వరుడిని పూజించండి.
కన్య రాశి వారికి ఈ రోజు మనోబలంతో కొత్త పనులు ఆరంభించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలకు కట్టుబడి ఉండండి. ఆలోచనలు మార్చుకోకండి. ఎంతోకాలంగా ఆగిపోయిన పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృథా వ్యయాలను నివారించాలి. ఓ ఆటంకం నుంచి బయటపడతారు. సూర్యనారాయణమూర్తిని ధ్యానించండి.
తుల రాశి వారు ఏకాగ్రతతో ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది, శుభ ఫలితాలను ఇస్తుంది. పుణ్యకార్యాలు చేస్తారు. బాధ్యతతో వ్యవహరిస్తూ వృత్తి, ఉద్యోగాల్లో పేరు తెచ్చుకుంటారు. వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించకండి. స్తోమతకు మించిన అప్పులు ఇవ్వకండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
వృశ్చిక రాశి వారికి ఈ రోజు కాలం మిశ్రమంగా ఉంది. ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. పరిస్థితులకు తగినట్టు వ్యవహరించాలి. అప్రమత్తత అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొనే ఆస్కారం ఉంది. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా ప్రశాంతంగా వ్యవహరించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు రాశి వారు ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి గోచరిస్తోంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మిత్రుల అండ లభిస్తుంది. భూ, గృహ యోగాలు ఉన్నాయి. చంచల స్వభావం పనికి రాదు. మీ వల్ల కొందరు లాభపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి. లక్ష్మీ అష్టకం పారాయణం చేయండి.
ఈ రాశి వారికి ఈ రోజు మనోబలంతో పనులు ఆరంభించండి. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక అభివృద్ధి సూచితం. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. చతుర్థ స్థానంలోని శుక్రుడు అన్ని విధాలుగా మేలు చేస్తాడు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.
కుంభ రాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. తెలివితేటలతో వ్యవహారాలను చక్కబెడతారు. ఏ విషయంలోనూ వెనకడుగు వేయకండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి, అవగాహనతో అడుగేయండి. ఆత్మీయుల సహాయం అందుకుంటారు. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ ఫలితాలు బావున్నాయి. సకాలంలో కర్తవ్యాన్ని నిర్వర్తించండి. జీవితాశయం నెరవేరుతుంది. ఆర్థిక విజయాలు సాధిస్తారు. తొందరపాటు పనికిరాదు. ప్రశాంత చిత్తంతో వ్యవహరించాలి. అపార్థాలకు తావివ్వకండి. చెడు ఆలోచనలు మిమ్మల్ని దారితప్పించే ఆస్కారం ఉంది. మనోబలాన్ని పెంచుకోండి. దుర్గాదేవిని ధ్యానించండి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000