హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 08.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ఠ, వారం : ఆదివారం, తిథి : శు. ద్వాదశి, నక్షత్రం : స్వాతి
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలతలు నెలకొంటాయి. ప్రతికూలతలకు దీటుగా స్పందిస్తారు. ఆదా యానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. వ్యూహా త్మకంగా అడుగులేస్తారు. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. అన వసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం విద్యావకాశం లభిస్తుంది. వాయిదాల చెల్లింపులో జాప్యం తగదు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి.
వృషభ రాశి వారికి గ్రహసంచారం సామాన్యంగా ఉంది. కార్యసిద్ధికి ఓర్పు అవసరం. ఉత్సాహాన్ని తగ్గనివ్వకుండా శ్రమించాలి. రావలసిన ధనాన్ని తెలివిగా రాబట్టాలి. ఆధిపత్యం ప్రదర్శించకండి. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేయడం తగదు. సామరస్యంగా మెలగండి. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచండి. ప్రయాణం వాయిదా వేయవచ్చు. పందాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి.
మిథున రాశి వారికి కార్యసాధనకు మరింత శ్రమ అవసరం. ఇతరుల సహాయంపై ఆధారపడకండి. మనోధైర్యమే విజయానికి కారణం అవుతుంది. అతిగా ఆలోచించకండి. వ్యాపార అవకాశాలను సృష్టించుకోండి. ధనం మితంగా ఖర్చు చేయండి. మీ భాగస్వామి సహాయంతో ఒక అవసరం తీరవచ్చు. పత్రాలలో సవరణలు అనుకూలించకపోవచ్చు. ప్రారంభించిన పనులు మాత్రం పూర్తిచేయాలి. ఆత్మీయుల మాటలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటి విషయాలు పట్టించుకోండి.
కర్కాటక రాశి వారు లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయ వ్యయాలలో సమతుల్యత ఉండదు. పొదుపు ధనాన్ని గుర్తించి ఉపయోగించండి. పనులు సానుకూలంగా సాగుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో మితంగా మాట్లాడండి. మీ నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం చేసే వ్యక్తులు ఉండవచ్చు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్ విషయంలో ఏకాగ్రత అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. అతిగా శ్రమించవద్దు.
సింహ రాశి వారి కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. అవసరమైతే ఇతరులకు సాయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. పొగిడే వారితో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒక ఆహ్వానం ఇబ్బందిని కలిగించవచ్చు. పత్రాల రెన్యువల్లో ఆలస్యం తగదు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
కన్య రాశి వారికి లావాదేవీలు ప్రశాంతంగా సాగుతాయి. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మొహమాటాలు, భేషజాలకు తావివ్వకండి. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులుంటాయి. పొదుపుకు అవకాశం తక్కువగా ఉంటుంది. పనులు చురుకుగా పూర్తవుతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. మీ చొరవతో ఒక శుభకార్యం నిర్ణయించబడుతుంది.
తుల రాశి వారికి అనుకూలదాయకంగా ఉంటుంది. మీ కష్టం ఫలితంగా మారుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. స్థిరచరాస్తుల రూపంలో ధనం లభించవచ్చు. ప్రణాళికలు రూపొందిస్తారు. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతుంది. వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. తెగిపోయిన బంధాలు మళ్లీ బలపడతాయి. వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపర్చవచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి.
వృశ్చిక రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది. అవకాశాలు కనిపించినట్టే కనిపించి చేజారవచ్చు. చిన్న విషయాలకే చిరాకు వచ్చే అవకాశం ఉంది. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. అతిగా ఆలోచించకండి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. కీలక పనులు ఇతరులకు అప్పగించకండి. ఖర్చులు నియంత్రణలో ఉండకపోవచ్చు. రాబడి విషయంలో దృష్టి పెట్టాలి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వస్తుంది. సన్నిహితుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
ధనుస్సు రాశి వారికి రావలసిన ధనం సమయానికి లభిస్తుంది. రుణ భారం నుండి విముక్తి పొందుతారు. ఖర్చులు సాధారణంగా ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ కృషికి తక్షణ ఫలితం లభిస్తుంది. బాధ్యతలు స్వయంగా నిర్వహించాలి. స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రముఖులతో సత్సంబంధాలు కొనసాగించండి. మీ సమస్యను ఆప్తులతో పంచుకోవచ్చు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యం చేయకండి.
మకర రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీ మాటతీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోవాలి. పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. అయితే విలాసాలపై విపరీతంగా ఖర్చు చేయవద్దు. అవసరమైన పత్రాలు సమయానికి దొరకకపోవచ్చు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కుంభ రాశి వారి ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కృషికి ఫలితం తప్పకుండా ఉంటుంది. పొదుపుగా ఉండే అవకాశం ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉండకపోవచ్చు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుగుతాయి. మీ అభిప్రాయాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. పత్రాల రెన్యువల్ విషయంలో జాప్యం చేయకండి. పిల్లల విద్యాయత్నం ఫలితాన్నిస్తుంది. ప్రయాణం అనుకూలంగా సాగుతుంది.
మీన రాశి వారు మీదైన రంగంలో పురోగతి సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. చేపట్టిన పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. వివాహ యత్నం విజయవంతమవుతుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. గృహంలో సందడి నెలకొంటుంది. కీలక పత్రాలు అందుతాయి. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000