నేటి రాశి ఫలాలు జూన్ 7, 2025: ఈరోజు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ యోగం, ఆస్తి లాభం.. నేరేడు, ఆకుపచ్చ అదృష్ట రంగులు!-today rasi phalalu june 7th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 7, 2025: ఈరోజు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ యోగం, ఆస్తి లాభం.. నేరేడు, ఆకుపచ్చ అదృష్ట రంగులు!

నేటి రాశి ఫలాలు జూన్ 7, 2025: ఈరోజు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ యోగం, ఆస్తి లాభం.. నేరేడు, ఆకుపచ్చ అదృష్ట రంగులు!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 07.06.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik )

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 07.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : శనివారం, తిథి : శు. ద్వాదశి, నక్షత్రం : చిత్త

మేష రాశి

ఈ రాశి వారు ఈ రోజు ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. ధనవ్యయం. గులాబీ, వేరేడు అదృష్ట రంగులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనుల్లో కొంత ఇబ్బంది ఏర్పడినా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్టంభన తొలగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. శ్రమాధిక్యం, ఒత్తిడులు. గులాబీ, తెలుపు అదృష్ట రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథున రాశి

మిథున రాశి వారు మధ్యలో కొన్ని సమస్యలు, వివాదాలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. ఇంతకాలం నైరాశ్యంలో ఉన్న మీకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. బంధువులతో తగాదాలు, ఆరోగ్య సమస్యలు, ధనవ్యయం. వసువు, నేరేడు అదృష్ట రంగులు. గణేశాష్టకం పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాల ఆశలు ఫలిస్తాయి. ధనవ్యయం. ఎరుపు, పసుపు అదృష్ట రంగులు. శ్రీ మహావిష్ణు ధ్యానం పఠించండి.

సింహ రాశి

ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గుతుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వృథా ఖర్చులు, కుటుంబ సభ్యులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ అదృష్ట రంగులు. నృసింహ స్తోత్రాలు పఠించండి.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ రోజు కొత్త పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరే సమయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు కష్టానికి ఫలితం దక్కుతుంది. గృహయోగం. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వ్యయ ప్రయాసలు, ఆరోగ్య భంగం. ఎరుపు, నేరేడు అదృష్ట రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

తులా రాశి

మీ శ్రమకు తగిన ఫలితం దక్కే సమయం. భూవివాదాలు పరిష్కారమయ్యే సూచనలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు సర్దుకుంటాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్య సమస్యలు, మిత్రులతో విభేదాలు. గులాబీ, తెలుపు అదృష్ట రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ పనినైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. అవకాశాలు చేజారినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. భూములు, వాహనాల కొనుగోలు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వ్యయ ప్రయాసలు. తెలుపు, నేరేడు అదృష్ట రంగులు. శ్రీ సూర్య ప్రార్థన మంచిది.

ధనుస్సు రాశి

మధ్యమధ్యలో కొన్ని చికాకులు ఎదురైనా నిలబడతారు. పనులను నేర్పుగా పూర్తి చేస్తారు. భూవివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పెండింగ్‌లో ఉంచిన పెళ్లి మాటలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కావచ్చు. ధనవ్యయం. ఎరుపు, నీలం అదృష్ట రంగులు. హయగ్రీవ ధ్యానం చేయండి.

మకర రాశి

రాశి వారికి ఈ రోజు నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇళ్లు, వాహనాల కొనుగోలు. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, గులాబీ అదృష్ట రంగులు. శివాష్టకం పఠించండి.

కుంభ రాశి

ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు శుభవర్తమానాలు. భూములు, వాహనాల కొనుగోలు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ పూర్తి చేస్తాయి. కళారంగం వారికి కొంతవరకు సానుకూలం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు అదృష్ట రంగులు. శ్రీకృష్ణ స్తుతి మంచిది.

మీన రాశి

మీన రాశి వారు ఈ రోజు వ్యయ ప్రయాసలు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలు స్వల్ప లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామిక వర్గాలు ఆచితూచి అడుగువేయడం మంచిది. నూతన ఉద్యోగయోగం, ఆస్తి లాభం. నేరేడు, ఆకుపచ్చ అదృష్ట రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.