నేటి రాశి ఫలాలు జూన్ 6, 2025: ఈరోజు ఈ రాశి వారికి గృహలాభం.. ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకండి, శ్రీ మహాలక్ష్మిని పూజించండి-today rasi phalalu june 6th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 6, 2025: ఈరోజు ఈ రాశి వారికి గృహలాభం.. ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకండి, శ్రీ మహాలక్ష్మిని పూజించండి

నేటి రాశి ఫలాలు జూన్ 6, 2025: ఈరోజు ఈ రాశి వారికి గృహలాభం.. ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకండి, శ్రీ మహాలక్ష్మిని పూజించండి

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 06.06.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 06.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : శుక్రవారం, తిథి : శు. ఏకాదశి, నక్షత్రం : హస్త

మేష రాశి

మేష రాశి వారి వ్యాపారం లాభదాయకం. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. వృథా వ్యయాలను నివారించాలి. మనోబలం అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అధికారుల అండదండలు అందుతాయి. లాభాన్ని అందుకుంటారు. సూర్యుడిని ధ్యానించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టకాలం కొనసాగుతోంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. సౌమ్యంగా సంభాషించాలి. మీ నిర్ణయాలు సిరిసంపదలను రెట్టింపు చేస్తాయి. గృహలాభం గోచరిస్తోంది. ధర్మమార్గాన్ని వదిలిపెట్టకండి. ఆత్మీయుల సహకారం అందుతుంది. శ్రీ మహాలక్ష్మిని పూజించండి.

మిథున రాశి

ముఖ్య విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఏకాగ్రతను పెంచుకోవాలి. ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత వేగంగా పనులు పూర్తవుతాయి. చెడును ఊహించుకోవద్దు. ఆటంకాలు సృష్టించే వారితో జాగ్రత్త. మితభాషణం మేలు చేస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొత్త అడుగులు వేయాలి. నిర్ణయాలను వాయిదా వేయకండి. నవగ్రహ శ్లోకాలు పఠించండి.

కర్కాటక రాశి

రాశి వారికి ఈ రోజు వ్యాపారం కలిసొస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. మీ నిర్ణయాలు మేలైన ఫలితాలను ఇస్తాయి. మనసులోని కోరికలు నెరవేరతాయి. తెలివితేటలే పెట్టుబడిగా లాభాలను స్వీకరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటారు. ఆపదల నుంచి సురక్షితంగా బయట పడతారు. విజయం లభిస్తుంది. మహాలక్ష్మిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి అదృష్టయోగం ఉంది. బలమైన ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. ఏకాదశ బృహస్పతి యోగం శుభాలను ప్రసాదిస్తుంది. ఆగిపోయిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి గురికాకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి.

కన్య రాశి

రాశి వారికి ఈ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. ప్రయత్నలోపం లేకుండా జాగ్రత్తపడండి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అపార్థాలకు తావివ్వకండి. మిత్రుల సలహాలు, సూచనలు తీసుకోండి. సవాళ్లు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. రుణ సమస్యలు చుట్టుముట్టకుండా చర్యలు తీసుకోండి. నవగ్రహాలను పూజించండి.

తుల రాశి

తుల రాశి మనోబలంతో విజయాలు సాధిస్తారు. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆశయాలు నెరవేరతాయి. గతంతో పోలిస్తే ఉత్తమమైన కాలం ఇది. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరాశ వద్దు. మానవ ప్రయత్నం కొనసాగించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. పరమేశ్వరుడిని ధ్యానించండి.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఈ రోజు విజయాలు సాధిస్తారు. లోతుగా ఆలోచించాకే నిర్ణయాలు తీసుకోండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బుద్ధిబలంతో వ్యవహరించండి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. క్రమశిక్షణతో ఉద్యోగంలో విజయాలు అందుకుంటారు. అపార్థాలకు తావివ్వకండి. కొందరు మీ ఓర్పును పరీక్షిస్తారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి అదృష్టకాలం మొదలైంది. విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి గోచరిస్తోంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తెలివిగా వ్యవహరిస్తూ గణనీయమైన లాభాలను అందుకుంటారు. పెట్టుబడుల విలువ పెరుగుతుంది. మీ కారణంగా కొందరికి మేలు జరుగుతుంది. మహాలక్ష్మిని ఆర్చించండి.

మకర రాశి

ఈ రాశి వారికి ఈ రోజు శుక్రయోగం వల్ల సిరిసంపదలు సిద్ధిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలు మంచి చేస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడిని జయిస్తారు. పనులను వాయిదా వేయకండి. నలుగురితోనూ స్నేహంగా మాట్లాడండి. ఆలోచనలను పక్కదారి పట్టించకండి. నవగ్రహ శ్లోకాలు పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి అదృష్టయోగం ఆరంభమైంది. చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వ్యాపారంలో కలిసొస్తుంది. గురు-శుక్ర బలం మేలు చేస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించాల్సిన సమయం. కుటుంబానికి ఉపయోగపడే పనులు చేస్తారు. మనోబలంతో ఒత్తిడిని జయించండి. మహాలక్ష్మిని ధ్యానించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదమైన సమయం. ఉద్యోగులకు ఉన్నతి లభిస్తుంది. గతంతో పోలిస్తే మేలైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. జన్మశుక్రయోగం మేలు చేస్తుంది. ఇంతకాలంగా వేధిస్తున్న విఘ్నాలు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఓ శుభవార్త వింటారు. దుర్గాదేవిని ధ్యానించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ