జూన్ 5, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు తప్పవు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ005.06.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 05.06.2024
వారం: బుధవారం, తిథి : చతుర్దశి,
నక్షత్రం : కృత్తిక, మాసం : వైశాఖము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం కృష్ణుని ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో వివాదాలేర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులేర్పడతాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. కుటుంబ పరిస్థితులు అనుకూలం. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీమన్నారాయణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి అలయాలలో అర్చన జరిపించుకోవాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి విమర్శలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదాపడతాయి. ధనపరంగా కొంత చికాకులు ఏర్పడతాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో ఊహించని ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థులు పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారానికి ఆటంకాలు అధిగమిస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల రాక అనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించాలి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పరించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ధనపరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుని ఆలయాన్ని దర్శించాలి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కుటుంబమున కొందరి మాటల వలన మానసిక చికాకులు కలుగుతాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం అంత అనుకూలంగా లేదు. అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన భూ లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పరఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం. వ్యాపారాలలో సమస్యలు తగ్గుతాయి. సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చుట్టుప్రక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పరించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000