నేటి రాశి ఫలాలు జూన్ 4, 2025: ఈరోజు ఈ రాశి వారు శుభవార్త వింటారు, ఆరోగ్యంగా ఉంటారు, రామాలయాన్ని సందర్శించండి!-today rasi phalalu june 4th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 4, 2025: ఈరోజు ఈ రాశి వారు శుభవార్త వింటారు, ఆరోగ్యంగా ఉంటారు, రామాలయాన్ని సందర్శించండి!

నేటి రాశి ఫలాలు జూన్ 4, 2025: ఈరోజు ఈ రాశి వారు శుభవార్త వింటారు, ఆరోగ్యంగా ఉంటారు, రామాలయాన్ని సందర్శించండి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.06.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (Canva)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 04.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : బుధవారం, తిథి : శు. నవమి, నక్షత్రం : ఉత్త

మేష రాశి

మేష రాశి వారికి అనుకూలంగా ఉంది. భార్యా పిల్లలతో, కుటుంబ సభ్యులందరితో ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. పిల్లల చదువు, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన శుభప్రదం.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. రోజు వారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వ్యాపారాలకు రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో సామరస్యం ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. అయితే మంచి ఆలోచనతో ముందుకు వెళ్లడం అవసరం. స్నేహితులు, బంధువులతో మనస్పర్థలు తలెత్తవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు ఉంటాయి. దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి.

మిథున రాశి

ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ముందుకొస్తాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సమయపాలన పాటించడం చాలా అవసరం. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో పెద్దల సలహాలు పాటిస్తే మంచిది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. బంధువులతో మాటపట్టింపులకు పోకండి. దుర్గా దేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం. భారీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. కొత్త పనులు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. నిబద్ధత చాలా అవసరం. నిత్యం కాలభైరవాష్టకం పఠించండి.

తుల రాశి

తుల రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసివస్తుంది. అనుకున్న స్థాయిలో పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రులు, పెద్దల సలహాలు పాటించడం వల్ల లాభం పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలహం ఏర్పడవచ్చు. మాటపట్టింపులకు పోవద్దు. నిరుద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. రుణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. రామాలయాన్ని సందర్శించండి.

సింహ రాశి

విద్యార్థులకు కలిసివస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలనం సూచన. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సూర్యారాధన మేలు చేస్తుంది.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ రోజు అన్నిటా విజయాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి, మంచి పేరు వస్తుంది. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఏ పని చేపట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఈశ్వరారాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

వ్యాపారం బాగా కలిసివస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి. సంతృప్తికరంగా గడుస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న చికాకులు ఉంటాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సంతోషంగా సాగుతుంది. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు పరిగణనలోకి తీసుకోవడం అవసరం. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.

మకర రాశి

మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నవారికి కలిసివస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా లాభం పొందుతారు. అయితే అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండటం చాలా అవసరం. పెద్దల సూచనలను పాటిస్తూ ముందుకు సాగాలి. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్థలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభ రాశి

మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారులకు రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులతో వైరం ఏర్పడవచ్చు. అయినవారిని దూరం చేసుకోకండి. ఎదుటివారి మనసు తెలుసుకొని మసులుకోవడం చాలా అవసరం. మీ పరువుకు భంగం వాటిల్లకుండా చూసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యత చెడకుండా చూసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000

ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.