హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 03.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ఠ, వారం : మంగళవారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : పుబ్బ
మేష రాశి వారు మిశ్రమ స్థితులను చూడగలరు. ముఖ్యమైన వ్యవహారాల్లో కదలికలు అంతంత మాత్రం. ఆరోగ్య, ఆర్థికాలు సామాన్యంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగులకు పనిభారములు ఎక్కువ. విద్యార్థులు, నిరుద్యోగులు నిరుత్సాహం ఏర్పరచుకోకుండా వ్యవహరించుకోవాలి. భూక్రయ నిక్రయాలు ముందుకు సాగుతాయి. తప్పనిసరి ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతను ఇచ్చుకోండి.
ఈ రాశి వారికి ఈ రోజు ఆలోచనలను కార్యరూపంలో పెట్టగలరు. అవకాశాలు కలిసి వస్తాయి. శ్రమకు తగిన గుర్తింపులు లేకపోయినా బాధ్యతాయుతంగా వ్యవహరించుకొంటారు. వివాహాది శుభాల స్థిరీకరణలు. అనారోగ్య భావనలు, అధికారులచే ఒత్తిడులు ఉంటాయి. వాహన, యంత్రాదుల్ని అమర్చుకుంటారు. నూతన అగ్రిమెంట్లు చేస్తారు.
మిథున రాశి వారికి ఈ రోజు ఒత్తిడికి గురికావుట, అవసరాలను సమర్థించుకోలేకపోవుట ఉంటుంది. యంత్ర, వాహనాలు వంటివి రిపేర్లను కోరగలవు. వ్యాపారాలు నత్తనడకన సాగగలవు. ఆస్తి విభజనలకు దూరంగా ఉండుట మంచిది. కుటుంబ వ్యక్తుల మధ్య ఏకీభావములు ఉంటాయి. కొన్ని అత్యవసరంగా అనుకున్న పనులు వాయిదా పడడం, చివరదాకా సాగి ఆగిపోవుట వంటివి ఉంటాయి.
కర్కాటక రాశి వారు నూతన విషయాలను తెలుసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక గురు బోధలకు ప్రాధాన్యతనిచ్చుకోగలరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. వ్యాపారాలలో చెల్లింపులు పూర్తి చేసుకోగలరు. ప్రభుత్వ తరహా పనులను చేపట్టుకొని పూర్తి చేసుకోవుటకు అవకాశాలు కలవు. భూక్రయ విక్రయాలలో చలనం ఉంటాయి. వివాహ, ఉద్యోగ యత్నీకులు పట్టుదలతో సాగాల్సి వుంటుంది.
సింహ రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. కుటుంబ వ్యక్తుల తీరు మీకు పని ఒత్తిడిని ఏర్పరచడమే కాక, ఏకాగ్రతను లేకుండా చేయగలదు. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటుంది. వివాహ నిశ్చయాలు, ఉద్యోగ సిద్ధి ఉంటాయి. బంధు మిత్రుల సహాయాలు కోరతారు, కానీ సహకరించుటకు దూరంగా ఉంటారు. కాలదుర్వినియోగాలు ఉండకుండా చూసుకోవాలి. ప్రయత్నించి ప్రయోజనాలు పొందగలుగుతారు. సాధారణతతో సాగుతుంది.
ఈ రాశి వారికి ఈ రోజు పనిచేసే చోట గుర్తింపులు ఏర్పరచుకుంటారు. గృహోపకరణాలు, స్థిరాస్తుల విషయాల్లో పెట్టుబడులు ఉంచగలరు. సంతాన, ఉద్యోగ, వివాహాది విషయాల్లో శుభాలు ఉంటాయి. కుటుంబంతో విందులకు హాజరవ్వగలరు. ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టగలరు. వ్యాపారాలు అంతంతమాత్రంగానే సాగుతాయి.
తుల రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలను చేపట్టుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల పట్ల అంకితభావాలు చూపగలరు. ఆర్థికంగా చిన్న మొత్తంలో ఋణ స్వీకారాలు ఉంటాయి. అగ్రిమెంట్లు, కాంట్రాక్టులు కుదుర్చుకోగలరు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. బంధువులతో తగు మేరకు వ్యవహరించండి. ఉద్యోగాల్లో గత తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారుల స్నేహహస్తములు ఉంటాయి.
ఈ రాశి వారికి ఈ రోజు మంచి ప్రయోజనాలు ఏర్పరచుకుంటారు. అవకాశాలను అందిపుచ్చుకోండి. కుటుంబ సభ్యులను కలుపుకుని యత్నించుకోవాలి. ఉద్యోగస్థులు కొంత సంయమనంతో సాగాలి. స్థిరాస్తుల క్రయవిక్రయాలకు దూరంగా ఉండుట మంచిది. స్పెక్యులేషన్ రంగాల పట్ల ఆసక్తి ఏర్పడగలదు. చిన్న తరహా పెట్టుబడులు ఉంచవచ్చును. వివాహ, ఉద్యోగ యత్నాల్లో నిరాశలు ఏర్పరచుకోకుండా సాగాలి.
ధనుస్సు రాశి వారికి మిశ్రమ స్థితులుంటాయి. ఒక పనికి 4 లేక 5 సార్లు యత్నించవలసి రావచ్చు. ఆదాయాలు ఉన్నా సంతృప్తి ఉండకపోవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు అధికారిక హోదాలు ఏర్పడతాయి. కోరుకున్న సమాచారాలను సేకరిస్తారు. ఆలోచనలను వెంటనే అమలు చేయకుండా పునరాలోచన తప్పనిసరిగా చేయండి. ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతనిచ్చి విరాళాలు ఇవ్వగలరు.
మకర రాశి వారికి ఈ రోజు ప్రయాణాలను తప్పించుకోవటానికి చూడండి. వాహన, యంత్రాదులతో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణ స్థాయిలో సాగగలవు. కుటుంబంలో ఏకవాక్యతలు ఉంటాయి. ఆధ్యాత్మికతలను మానసికంగా నిర్వహించుకోలేకపోతారు. అసహాయతను చూసి కొన్ని సమస్యలను జటిలం చేసుకోవచ్చుననే సూచనలుంటాయి.
కుంభ రాశి వారు ప్రయత్నాలను వేగవంతం చేసుకోండి. ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనీయకుండా, వ్యక్తిగత ఆలోచనలు అమలు చేసుకోండి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. వద్దనుకున్న కొన్ని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. వివాహ, ఉద్యోగ ప్రతిపాదనలు ముందుకు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు చేసి ప్రయోజనాలు పొందుతారు.
ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. శత్రు వర్గమున ఉన్న సోదరులు, తోటి ఉద్యోగులలో మంచి మార్పులు చూడగలరు. వ్యక్తిగతంగా ఉత్సాహం, సౌఖ్యం ఏర్పడగలవు. కుటుంబంలో ఏకవాక్యతలు ఉంటాయి. మాతాపితరుల ఆరోగ్యంకై జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు ప్రత్యేక గుర్తింపు, గౌరవమును పొందగలరు. ఆర్థికంగా ప్రయోజనాలు ఏర్పరచుకోగలరు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్