నేటి రాశి ఫలాలు జూన్ 30, 2025: ఈరోజు ఈ రాశి వారు పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది.. విద్యార్థులకు మంచి సమయం!-today rasi phalalu june 30th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 30, 2025: ఈరోజు ఈ రాశి వారు పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది.. విద్యార్థులకు మంచి సమయం!

నేటి రాశి ఫలాలు జూన్ 30, 2025: ఈరోజు ఈ రాశి వారు పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది.. విద్యార్థులకు మంచి సమయం!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 30.06.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 30.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : శు. పంచమి, నక్షత్రం : మఖ

మేష రాశి:

మేష రాశి వారికి ఈ రోజులో బంధుమిత్రులతో ఉత్సాహంగా వ్యవహరించుకోగలరు. సంతానసంబంధంగా కోరుకున్నవి పూర్తికాగలవు. అనవసర ఖర్చులు పెరగకుండా ఆర్థిక అవసరాలపట్ల జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. కుటుంబ వ్యవహారాల్లో సంయమనం అవసరం. వస్తు కొనుగోళ్ళు, అమ్మకాలు నిరాశలేర్పరచగలవు. కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు ఇతరులను ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ప్రయాణాలు ప్రయోజనం ఇస్తాయి.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్తవైన హోదాలు, అదనపు బాధ్యతలు వంటివి ఏర్పడగలవు. గృహ, కుటుంబ వ్యక్తులకు ఆచరణ, అలంకరణలు ఏర్పరచగలరు. వాహన మార్పులు ప్రధాన భూమిక వహించగలవు. ఆదాయాల్లో మిగులు శాతములు ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో మంచి నూర్పులు ఏర్పరచగలవు. ప్రయాణ, పెట్టుబడులందు జాగ్రత్తలు అవసరం. అన్నిటా జాగ్రత్తలు పాటించుకోండి.

మిథున రాశి:

మిథున రాశి అన్ని వ్యవహారాలపట్ల అవగాహనలతో ముందుకు ప్రయత్నించుకుంటారు. ఊహించుకున్నవి సాధించుకోగలరు. బంధుమిత్రుల మధ్య అపోహలు తొలగుతాయి. గతంలో దూరమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో చిన్నతరహా గుర్తింపులు పొందగలరు. అవివాహితులు, నిరుద్యోగులు నిరాశలు ఏర్పరచుకోకుండా సాగాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు వాగ్జోరణిలో మార్పు తప్పనిసరిగా చేసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకుంటూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి. ఆహార, విరామ నియమాలు తప్పనిసరి చేయండి. అటు ఇటు అయినా తలచిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ తరహా పనులను పూర్తి చేసుకోగలరు. ఆధ్యాత్మికతతో కూడిన ప్రయాణాలు ఉంటాయి.

సింహ రాశి:

ఈ రాశి వారికి ఈ రోజులో కోపావేశాలను అదుపులో ఉంచుకుంటూ వ్యవహరించుకోవాలి. అనారోగ్యం, ఔషధ సేవలు ఏర్పడగలవు. జీవనోపాధి మార్గాలు ఉత్సాహకరంగానే సాగుతాయి. మీ ప్రమేయం లేకుండా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. స్పెక్యులేషన్లకు, అప్పులు ఇచ్చుటకు దూరంగా ఉండండి. వాహన, యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగాలలో గుర్తింపులు ఏర్పరచుకుంటారు.

కన్య రాశి:

కన్య రాశి వారికి ఈ రోజులో గతంలో ఇబ్బందులకు గురిచేసిన అంశాలు తిరిగి తెరపైకి వస్తాయి. కుటుంబంలో కలసిరాకపోవడం, ఖర్చులు పెరుగుటచే మానసిక సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి. ఖర్చులు పెరిగినా ఊహించుకున్న ప్రయాణాలను పూర్తి చేసుకుంటారు. భూ, గృహం వంటి విషయాల్లో పెట్టుబడులు ఉంచుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి.

తుల రాశి:

తుల రాశి వారికి ఈ రోజులో గ్రహసంచారాలు అనుకూలం. ప్రయత్న కార్యాలను వేగవంతం చేసుకోండి. బంధుమిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు ఏర్పడతాయి. నూతన పనులను ప్రారంభించి పూర్తిచేసుకోగలరు. గత ఒడుదుడుకులను పూర్తిగా రూపుమాపుకొని దైనందిన నిత్యకృత్యాలతో బిజీగా ఉండగలరు. కొన్ని షార్ట్ జర్నీస్ చేయక తప్పకపోవచ్చు. అధికారులతో చర్చలప్పుడు సంయమనం పాటించుకోవాలి.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు అవసరాలను సమర్థించుకోగలుగుతున్నా ఆర్థిక వ్యవహారాలు నిరాశకు గురిచేయగలవు. ఊహించిన స్నేహ, బంధువర్గం వారు చిక్కదు దొరకదు తరహాలో ఉంటారు. తోటి ఉద్యోగుల నుండి, భ్రాతృవర్గం నుండి సహాయాలు ఉంటాయి. నూతన వ్యాపార వ్యవహారముల తలంపులకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని ఊహించని ప్రయాణాలు చేయవలసి రావచ్చు.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి ఈ రోజులో ఆరోగ్యపరంగా చిన్నతరహా జాగ్రత్తలకు ప్రాధాన్యతనిస్తూ ప్రయత్నాలను చేపట్టుకోవాలి. అవకాశాలను అందిపుచ్చుకోవలసి ఉంటుంది. చిన్నతరహా పెట్టుబడులు ఉంచి ప్రయోజనాలు పొందగలరు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమలు ఉన్నా ప్రయోజనాలు, గుర్తింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో సమయానికి తగినట్లుగా మార్పు చేర్పులు చేసుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి సమయం.

మకర రాశి:

మకర రాశి వారు పట్టుదల, పోరాడాలనే భావనలతో సాగుతారు. ఆలోచనాత్మకంగా ఉండే టట్లు జాగ్రత్తలు అవసరం. పంచమ శుక్రుడు ఆశావహ స్థితులు ఏర్పరచగలడు. బంధుమిత్రులతోను, అధికారులతోను సంప్రదింపులు, మంచి మార్గదర్శకాలు ఇస్తాడు. పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు మంచి సమయం. అవకాశాలు కలసివస్తాయి.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఈ రోజులో కొన్ని పనులను చేపట్టుకుంటారు. కుటుంబ వ్యక్తుల ఆరోగ్యంకై ధనం, సమయం కేటాయింపులు అవసరమవుతాయి. పలుకుబడిగల వ్యక్తుల పరిచయాలు తదితర ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న ఋణ సమస్యకు విముక్తి పొందగలుగుతారు. అవసరాలను సమర్థించుకోగలుగుతారు. క్రయ, విక్రయాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలకు మిశ్రమ స్థితులు ఉంటాయి.

మీన రాశి:

మీన రాశి వారు ఆర్థిక సామాన్యతలు కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్సాహకర స్థితులు ఉంటాయి. ఇంటా-బయటా ప్రోత్సాహం చూడగలరు. బాధ్యతాయుత ప్రవర్తనకు గుర్తింపులు ఏర్పరచుకోగలరు. తప్పనిసరి ప్రయాణాలు కొన్ని ఉంటాయి. ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూడగలరు. బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.