నేటి రాశి ఫలాలు జూన్ 2, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి.. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి!-today rasi phalalu june 2nd 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 2, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి.. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి!

నేటి రాశి ఫలాలు జూన్ 2, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి.. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 02.06.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 02.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ఠ, వారం : సోమవారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : మఖ

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి గాను కీలకమైన చర్చలను సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా పురోగతి బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. నిత్యం కౌముది ధరించటం వలన మేలు జరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కలుగుతుంది.

వృషభ రాశి

సంతానం సాంకేతిక విద్యలోనూ, వైద్య విద్యలోనూ రాణిస్తారు. పోటీపరీక్షలో విజయం సాధిస్తారు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. సౌకర్యవంతంగా ఉంటుంది. నిత్యం హనుమాన్ సింధూర్ ఉపయోగించటం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో రొటేషన్లు, లాభాలు బాగుంటాయి. వ్యక్తుల సామర్థ్యం అంచనావేయడంలో పొరపాటు పడతారు.

మిథున రాశి

మిథున రాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పెట్టుబడుల విషయంలో నిదానం చాలా అవసరం. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలలో చక్కగా రాణిస్తారు. అనువంశిక ఆస్తులను నిలబెట్టుకోగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కొరకు లక్ష్మీ కటాక్షాన్ని ఉపయోగించండి. ఇది చాలా మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.

కర్కాటక రాశి

రాశి వారికి ఈ రోజు అదృష్టవశాత్తు కొన్ని ముఖ్యమైన రహస్య సమాచారాలు అందుతాయి. వాటి వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుంది. ఆ రహస్య సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. నిత్యం కుబేర కంకణం ధరించండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి.

సింహ రాశి

సింహ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు నిత్యం సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించటం, జ్ఞానచూర్ణాన్ని సేవించడం, మేధాదక్షిణామూర్తి రూపు ధరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.

కన్య రాశి

కన్య రాశి వారికి నూతన మిత్రులు పరిచయమై, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. నిత్యం మహాతీర్ధం పొడితో చేసే అభిషేకాలు, పూజలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి మంచి సాయం అందిస్తారు. సంతానానికి చేసే వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు.

తుల రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురై చికాకులు కలుగుతాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. నిత్యం సర్వదోష నివారణ చూర్ణముతో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయటం వలన గ్రహాల వలన కలిగే బాధలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు సంభవిస్తాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు శ్రమానంతరం దక్కుతాయి. ఆర్థికాభివృద్ధి కోసం ఐశ్వర్యనాగిని ఉపయోగించండి. భాగస్వామ్య వ్యవహారాలు అభివృద్ధి చెందతాయి. పనులలో విజయం సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ఈ రోజు పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. లక్ష్మీప్రదమైన ముఖానికి, ఐశ్వర్యప్రాప్తికి, వృత్తి ఉద్యోగాలలో కలుసుబాటుకు ఈ లక్ష్మీచందనం ధరించడం వలన మేలు జరుగుతుంది. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

మకర రాశి

మకర రాశి వారు మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఎలాంటి అభిషేకానికైనా ఈ మహాతీర్ధం పొడిలో కొద్దిగా నీళ్ళు కలిపి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను ఇస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వరంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విందు, వినోదాలలో, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. తెల్ల జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది.

మీన రాశి

సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నానారకాల అరిష్టాలు, ఇబ్బంది, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్ ఉపయోగించండి. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సిరిసంపదలు ప్రాప్తిస్తాయి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.