నేటి రాశి ఫలాలు జూన్ 29, 2025: ఈరోజు ఈ రాశి వారికి నూతన వస్తు సంపాదనలు ఉంటాయి.. ప్రయత్నాలను పట్టుదలతో చేపట్టుకోవాలి!-today rasi phalalu june 29th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 29, 2025: ఈరోజు ఈ రాశి వారికి నూతన వస్తు సంపాదనలు ఉంటాయి.. ప్రయత్నాలను పట్టుదలతో చేపట్టుకోవాలి!

నేటి రాశి ఫలాలు జూన్ 29, 2025: ఈరోజు ఈ రాశి వారికి నూతన వస్తు సంపాదనలు ఉంటాయి.. ప్రయత్నాలను పట్టుదలతో చేపట్టుకోవాలి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 29.06.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (Canva)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 29 .06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : ఆదివారం, తిథి : శు. చవితి, నక్షత్రం : ఆశ్లేష

మేష రాశి:

మేష రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారాలు మధ్యమముగా ఉపకరిస్తాయి. ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవాలి. తొందరపాటు చర్యలు ఉండకుండా జాగ్రత్తలు వహించుకోవాలి. ఆర్థికంగా సామాన్య వెసులుబాటు తనములు కొనసాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి. మాతాపితరుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

వృషభ రాశి:

రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సమిష్టి యత్నాలు, ఒకరి బాధ్యతలు ఒకరు స్వీకరించుట వంటివి ఉంటాయి. ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నతరహా గుర్తింపులు పొందుతారు. స్థిరాస్తుల సేకరణకై ప్రయత్నాలు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలను పూర్తిచేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నూతన వ్యాపారపు ఆలోచనలు అమలులో పెట్టుకోగలరు.

మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ రోజు నిరాశాభావాలు వెంటాడే సూచనలున్నాయి. పట్టుదలలు అవసరం. ఆర్థిక అవసరాల పట్ల అవగాహనలతో ఉండాలి. చెల్లింపులందు మాటపడకుండా జాగ్రత్తపడాలి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రవేశాలు లేకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. అధికారులతో, పెద్దలతోను సంయమనంతో సాగాలి. వ్యాపార తరహా ఒప్పందాలను చేసుకుంటారు.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు ఈరోజు వాగ్విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ప్రయత్నాలను చేపట్టుకోవాలి. నూతన విషయాలను తెలుసుకోగలుగుతారు. ముఖ్యమనుకున్న పనులను పూర్తిచేసుకోగలరు. వ్యక్తిగత విషయాలలో వృద్ధిని పొందగలరు. ఆర్థిక, ఆరోగ్యాలు అనుకూలం. చెల్లింపులను పూర్తిచేసుకోగలరు. పంతావంచే ఆత్మీయ అనుభూతులు పొందగలుగుతారు. దృఢసంకల్పాలను చేసుకోగలుగుతారు.

సింహ రాశి:

సింహ రాశి వారు అనారోగ్య భావనలు వెంటాడుతున్నా ఉత్సాహంగా వ్యవహరించుకోగలరు. బాధ్యతాయుతంగా వ్యవహరించుకోవాలి. మీరంటే ఇష్టతగల వ్యక్తులను దూరం చేసుకోండి. ఇచ్చిపుచ్చుకునే విధంగా సాగాలి. ప్రయాణాలను, సాహసాలను తగ్గించండి. ఆర్థికంగా శుభసూచనలు ఉన్నాయి. ఋణభారాలను తగ్గించుకోగలరు. విద్యార్థులు, నిరుద్యోగులు పట్టుదలతో సాగాల్సి ఉంటుంది.

కన్య రాశి:

కన్య రాశి వారికి శ్రమలు ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఇష్టతలేని పనులను చేయవలసి రావచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి. ఆదాయాలు అవసరాలను సమర్థించుకునేలా ఉంటాయి. పెట్టుబడులందు జాగ్రత్తలు అవసరం. పనిచేసే చోట గుర్తింపులు పొందగలరు. విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు ఏర్పడగలవు.

తుల రాశి:

తుల రాశి వారికి విశేష ఫలితాలు ఉంటాయి. చేపట్టుకున్న పనులను పూర్తిచేసుకుంటారు. మీ అభిప్రాయాలకు గుర్తింపులు ఏర్పరచుకోగలరు. కావలసిన వారితో తరచుగా అభిప్రాయాలను పంచుకుంటారు. ఆరోగ్య విషయంలో సాధారణతలు కొనసాగుతాయి. ఆర్థిక సహాయాలు కోరువారితో సున్నితంగా వ్యవహరించండి. ముఖ్యమైన పనులను సంప్రదింపులతో చేపట్టుకోండి.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారాలు మిశ్రమంగా ఉంటాయి. వ్యతిరేక ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిళ్లు, పనులలో చికాకులు ఉండగలవు. ఆరోగ్యం అనుకూలమైనా ఉత్సాహం చూపలేకపోతారు. పూర్తయినది అనుకున్న పనిని తిరిగి చేయవలసి వస్తుంది. అనవసరమైన తొందరతనపు ఖర్చులు ఆర్థిక విషయాలలో నిరుత్సాహం కలిగించగలవు. ఉద్యోగాలలో బాధ్యతల మార్పులు ఉండవచ్చు.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఈ రోజులో గ్రహ సంచారాలు మూడొంతులు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్న కార్యములు అనవసరమైనవికాకుండా జాగ్రత్తలు అవసరం. ఖర్చులను సమర్థించుకోగలరు. ఇతరులతో ఇచ్చిపుచ్చుకునే విధంగా సాగగలరు. వ్యక్తిగత వృద్ధిని పొందగలరు. వ్యాపార వ్యవహారాలలో లావాదేవీలు అనుకూలంగా సాగగలవు. సోదరులతో మైత్రి ఏర్పడగలదు. వాహన, యంత్రాల మార్పులు చేసుకోగలరు.

మకర రాశి:

మకర రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారాలు మిశ్రమంగా ఉంటాయి. అన్నిటా ఆసక్తితో సాగవలసి ఉంటుంది. బాహాటమైన విమర్శలు ఉంటాయి. సంతానపు వ్యవహారాలలో కీలకమైన మార్పులు చేసుకోగలరు. కుటుంబంలో ఏకవాక్యత ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటుంది. ముఖ్యమైన పనులలో వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం. దూరపు ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నూతన వస్తు సంపాదనలు ఉంటాయి.

కుంభ రాశి:

కుంభ రాశి వారు ఈ రోజు ఆరోగ్యపరమైన అంశాల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ, ప్రయత్నాలను పట్టుదలతో చేపట్టుకోవాలి. కుటుంబంలో సహకారం పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలలో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్తలు అవసరం. ఆదాయాలు అవసరాలను సమర్థించుకునేలా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు మంచి ఫలితాలు చూడగలరు. క్రయవిక్రయాలు సాగగలవు.

మీన రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు ప్రయత్నాలకు విసుగు లేకుండా, పట్టుదలతో సాగాలి. ఊహించని విధంగా కొన్ని పనులను పూర్తిచేసుకోగలుగుతారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం పొందగలరు. ఆరోగ్యపరంగా మంచి మార్పులు కనిపిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో కొంత ఉత్సాహపూరిత మార్పులు చూడగలరు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సంయమనంతో కొనసాగాలి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.